Janasena Effect : ఏపీలో `బండి` మార్క్ రాజ‌కీయం, ప‌వ‌న్ కు జ‌ల‌క్‌

Janasena Effect : తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజ‌య్య పైర్ బ్రాండ్‌. భావోద్వేగాల‌ను పెంచ‌డంలో దిట్ట‌. హిందూవాదాన్ని బ‌లంగా న‌మ్మే లీడ‌ర్‌

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 01:07 PM IST

Janasena Effect : తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజ‌య్య పైర్ బ్రాండ్‌. భావోద్వేగాల‌ను పెంచ‌డంలో దిట్ట‌. హిందూవాదాన్ని బ‌లంగా న‌మ్మే లీడ‌ర్‌. రాజ‌కీయాల్లో చాలా వేగంగా అడుగులు వేస్తారు. సామాజిక స‌మీక‌ర‌ణ చేయ‌డంలోనూ నేర్ప‌రి. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ నీడ కూడా ఆయ‌న‌కు ప‌డ‌దు. ఆ విష‌యం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బ‌య‌ట ప‌డింది. ఆ రోజున కిష‌న్ రెడ్డి ఒక వైపు జనసేన మ‌ద్ధ‌తు ప‌లికారు. కానీ, బండి సంజ‌య్ స‌సేమిరా అన్నారు. ఢిల్లీ స్థాయిలో బీజేపీతో పొత్తు ఉన్న‌ప్ప‌టికీ జ‌న‌సేన  (Janasena Effect)పార్టీని హైద‌రాబాద్ లో దూరంగా పెట్టారు.

బీజేపీతో పొత్తు ఉన్న‌ప్ప‌టికీ జ‌న‌సేన పార్టీ దూరం(Janasena Effect)

ఏపీ బీజేపీ ఇంచార్జిగా నియామ‌కం అయిన బండి సంజ‌య్ కు ఢిల్లీ బీజేపీలోని కీల‌క లీడ‌ర్ల‌తో బ‌ల‌మైన సంబంధాలు ఉన్నాయి. అందుకే, ఆయ‌న‌కు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని అప్ప‌గించారు. రాబోవు రోజుల్లో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఎద‌గ‌డానికి ఒక అడుగు ముందుకు ప‌డింద‌ని ఆయ‌న అభిమానుల్లోని చ‌ర్చ‌. అంత‌టి ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ లీడ‌ర్  (Janasena Effect) ఇప్పుడు ఏపీలోని బీజేపీని ఎలా బ‌లోపేతం చేయ‌బోతున్నారు? అనేది హాట్ టాపిక్.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో పాటు ఈ ఫోటోలో ఉన్న పిల్లోడు ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని భారీగా ఇటీవ‌ల ప్ర‌క్షాళ‌న చేశారు. ఏపీ బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను పురంధ‌రేశ్వ‌రికి అప్ప‌గించారు. సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పార్టీని న‌డిపే లీడ‌ర్ గా ఆమెకు పేరుంది. అదే స‌మ‌యంలో నంద‌మూరి కుటుంబానికి చెందిన మ‌హిళ కావ‌డంతో తెలుగుదేశం పార్టీ నీడ ప‌రోక్షంగా ప‌డుతోంది. ఇదే స‌మ‌యంలో బండి సంజ‌య్ ఇంచార్జిగా నియామ‌కం కావ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. వాళ్లిద్ద‌రి ద్వారా తెలుగుదేశం పార్టీని బ‌ల‌హీన‌ప‌రిచే ఎత్తుగ‌డ బీజేపీ వేసిందా? అనే అనుమానం (Janasena Effect)  క‌లుగుతోంది.

తెలుగుదేశం పార్టీలోని ఒక గ్రూప్ ద‌గ్గుబాటి పురంధ‌రేశ్వ‌రికి సానుకూలం

తెలుగుదేశం పార్టీలోని ఒక గ్రూప్ ద‌గ్గుబాటి పురంధ‌రేశ్వ‌రికి సానుకూలంగా ఉంటుంది. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌యాణంలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు అభిమానులు ఎంద‌రో టీడీపీలో కొనసాగుతున్నారు. రాజ‌కీయంగా చంద్ర‌బాబు, ద‌గ్గుబాటి వేర్వేరు అయిన‌ప్ప‌టికీ అభిమానులు దాదాపుగా ఒక‌టే ఉంటారు. అందుకే, ఇప్పుడు తెలుగుదేశంలోని ఒక గ్రూప్ ను పురంధ‌రేశ్వ‌రి రూపంలో లాగేసుకోవ‌డానికి బీజేపీ ఎత్తుగ‌డ వేసిందా? అనే అనుమానం క‌లుగుతోంది. ఇక వెనుక‌బ‌డిన వ‌ర్గాల పార్టీగా టీడీపీకి పేరుంది. ఆ పార్టీని 2019 ఎన్నిక‌ల్లో బీసీలు కొంద‌రు వీడారు. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేతో సీఎం (Janasena Effect) అయ్యారు.

 Also Read : Pawan CM : ప‌వ‌న్ కు సీఎం అభ్య‌ర్థి ఎర వేస్తోన్న బీజేపీ

ఏపీ బీజేపీ ఇంచార్జిగా బండి సంజ‌య్ ను నియ‌మించ‌డం ద్వారా బీసీ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం బీజేపీ చేస్తుందా? అనే టాక్ న‌డుస్తోంది. ఇదే నిజ‌మైతే, టీడీపీలోని ద‌గ్గుబాటి గ్రూప్, బీసీలు బీజేపీ వైపు మొగ్గే ఛాన్స్ ఉంది. అప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి లాభం క‌లుగుతుంది. అందుకోస‌మే, బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఇలాంటి ప్రక్షాళ‌న బీజేపీలో చేశారా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఇక మ‌రో టాక్ ఏమంటే, ప‌వ‌న్ తో బండికి రాజ‌కీయ అంత‌రం ఉంది. తెలుగుదేశం పార్టీ పొత్త‌ను కొరుకుంటున్న బీజేపీ లీడ‌ర్ల‌లో బండి ప్ర‌ముఖుడు అంటూ చెబుతుంటారు. ఆ కోణంలో (Janasena Effect) ఆలోచిస్తే, రాబోవు రోజుల్లో టీడీపీ, బీజేపీ ఒక‌టిగా పనిచేయడానికి బండి అనుసంధానం చేస్తారా? అనే చ‌ర్చ లేక‌పోలేదు.

రాజ‌కీయంగా జ‌న‌సేన మీద స‌దాభిప్రాయంలేని బండి 

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ స‌హ‌కారం తెర వెనుక తీసుకుని, ప్ర‌త్య‌క్షంగా ఏపీలో తీసుకోవాల‌ని బీజేపీ ఆలోచ‌న‌. కానీ, చంద్ర‌బాబు అందుకు అంగీకారం తెల‌ప‌డంలేదు. పైగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా నెల‌కొన్ని ప‌రిస్థితుల్లో బీజేపీకి దూరంగా ఉండ‌డ‌మే బెట‌ర్ అంటూ ఆయ‌న అభిప్రాయంగా చెబుతున్నారు. ఇలాంటి రాజ‌కీయ ప‌రిణామాల న‌డుమ ఏపీ రాజ‌కీయాల‌ను బండి ఏమి చేస్తారు? అనేది ఒక ప్ర‌శ్న‌. అంతేకాదు, రాజ‌కీయంగా జ‌న‌సేన మీద స‌దాభిప్రాయంలేని బండి  (Janasena Effect) ఆ పార్టీతో క‌లిసి ప‌నిచేసేలా బీజేపీ దూకుడుగా ముందుకు తీసుకెళ‌తారా? అనే ప్ర‌శ్న కూడా ఉత్ప‌న్నం అవుతోంది. ఏదేమైనా బండి ఇంచార్జి నియామ‌కం ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయింది.