Nani : జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు నేచురల్‌ స్టార్‌ నాని మద్దతు

Natural Star Nani: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ఈ ఎన్నికల్లో పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ పోరులో తలపడుతున్న విషయం తెలిసిందే. దీంతో పవన్‌ కల్యాణ్‌కు మెగా ఫ్యామిలి నుండి కూడా మద్దతు వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. […]

Published By: HashtagU Telugu Desk
Janasenani Pawan Kalyan is supported by Natural Star Nani

Janasenani Pawan Kalyan is supported by Natural Star Nani

Natural Star Nani: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ఈ ఎన్నికల్లో పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ పోరులో తలపడుతున్న విషయం తెలిసిందే. దీంతో పవన్‌ కల్యాణ్‌కు మెగా ఫ్యామిలి నుండి కూడా మద్దతు వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినీ కుటుంబంలో ఒకడిగా పవన్ కల్యాణ్ కు మద్దతు పలుకుతున్నట్లు వివరించారు. ‘ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సర్’ అంటూ నాని ట్వీట్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మద్దతు కూడా పవన్ కల్యాణ్ కే ఉంటుందని నాని ఆశాభావం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా అన్న మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. పిఠాపురం ప్రజలు పవన్‌ను గెలిపించాలని కోరుతూ చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేశారు.

Read Also: KCR Vs Modi : నా అరెస్టుకూ మోడీ కుట్ర.. కేసీఆర్ సంచలన ఆరోపణ

  Last Updated: 07 May 2024, 12:39 PM IST