Jagan Sketch Change : వైసీపీకి బ్రాహ్మణి భ‌యం! లోకేష్ అరెస్ట్ లేన‌ట్టే?

Jagan Sketch Change :  తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ను అరెస్ట్ చేస్తారా? ఆయ‌న్నుకూడా జైలుకు పంపిస్తారా?

  • Written By:
  • Publish Date - September 30, 2023 / 01:14 PM IST

Jagan Sketch Change :  తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ను అరెస్ట్ చేస్తారా? ఆయ‌న్నుకూడా జైలుకు పంపిస్తారా? అనేది ఇప్పుడు ఏపీలోని హాట్ టాపిక్. ఖ‌చ్చితంగా లోకేష్ ను జైలుకు పంపిస్తార‌ని రెండో రోజులు వ‌ర‌కు వినిపించింది. ఆ మేర‌కు సీఐడీ కూడా ప్ర‌క‌టించింది. ఏపీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ కూడా మీడియా ముందు వెల్ల‌డించారు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్కెచ్ మార్చిన‌ట్టు తెలుస్తోంది.

లోకేష్ ను కూడా జైలుకు పంపితే..(Jagan Sketch Change)

ఒక వేళ లోకేష్ ను అరెస్ట్ చేస్తే, సానుభూతి మ‌రింత పెరుగుతుంద‌ని వైసీపీ అభిప్రాయం. ఇప్ప‌టికే చంద్ర‌బాబును జైలుకు పంపించ‌డం ద్వారా ఎంతో కొంత రాజ‌కీయంగా న‌ష్ట‌పోయిన‌ట్టు అంచ‌నా వేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో లోకేష్ ను కూడా జైలుకు పంపితే, న‌ష్ట‌మ‌ని భావిస్తున్నార‌ట‌. పైగా లోకేష్ జైలుకు వెళితే, బ్రాహ్మ‌ణి బ‌స్సు యాత్ర చేయ‌డానికి సిద్ద‌ప‌డుతున్నారు. ఆ విష‌యం తెలుసుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ (Jagan Sketch Change) పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని తెలుస్తోంది.

జ‌గ‌న్ అండ్ టీమ్ తాజాగా స్కెచ్

యువ‌గ‌ళం కార‌ణంగా టీడీపీకి పెద్ద‌గా లాభం వ‌చ్చిన‌ట్టు లేద‌ని వైసీపీ స‌ర్వేల్లోని సారాంశం. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ ను విచార‌ణ వ‌ర‌కు ప‌రిమితం చేసి యువ‌గ‌ళం కంటిన్యూ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ సానుకూల మార్గాల‌ను వైసీపీ ఇవ్వ‌నుంద‌ని తెలుస్తోంది. విచార‌ణ‌కు ఎప్పుడు కావాలంటే, అప్పుడు రావాల‌ని కండీష‌న్లు పెడుతూ విసిగించ‌డంతో పాటు భ‌య‌ప‌డేలా చేయాల‌ని జ‌గ‌న్ అండ్ టీమ్ తాజాగా స్కెచ్  (Jagan Sketch Change) వేసిన‌ట్టు తెలుస్తోంది. వీలున్నంత వ‌ర‌కు బ్రాహ్మ‌ణి హైలెట్ కాకుండా ఉంటే బాగుటుంద‌న్న అభిప్రాయానికి తాడేప‌ల్లి టీమ్ వ‌చ్చింద‌ని స‌మాచారం.

బ్రాహ్మ‌ణి స‌హ‌జంగా మంచి స్పీక‌ర్

నంద‌మూరి కుటుంబం నుంచి వ‌చ్చిన బ్రాహ్మ‌ణి స‌హ‌జంగా మంచి స్పీక‌ర్. పైగా ఆమె స‌బ్జెక్టు మీద పూర్తి అవ‌గాహ‌న క‌లిగి ఉన్నారు. హీరో బాల‌క్రిష్ణ కుమార్తె, చంద్ర‌బాబునాయుడు కోడ‌లుగా హైలెట్ అయ్యే అవ‌కాశం ఉంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ మ‌నుమ‌రాలిగా ఫోక‌స్ అవుతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి మైలేజి బాగా వ‌చ్చే ఛాన్స్ లేక‌పోలేదు. ఇలా అన్నీ కోణాల నుంచి స‌ర్వేలు చేయించుకున్న జ‌గ‌న్ అండ్ టీమ్ ప్ర‌స్తుతానికి లోకేష్ ను అరెస్ట్ చేయ‌కుండా ఉండ‌డ‌మే బెట‌ర్  (Jagan Sketch Change) అనే అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

Also Read : CBN Jail Effect In Telangana : చంద్ర‌బాబు జైలుపై ఒకే పంథాలో రేవంత్ , కేటీఆర్

మూడు వారాలుగా ఢిల్లీలోనే ఉన్న లోకేష్ ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. స్కిల్ కేసులో తాత్కాలిక ఉప‌శ‌మ‌నం క‌లిగింది. అలాగే, ఇన్న‌ర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఫైబ‌ర్ నెట్ కేసుల్లో పిటీ వారెంట్లను ఆయ‌న మీద జారీ చేశారు. వాటి మీద 41 ఏ కింద నోటీసులు ఇవ్వ‌డానికి ఏపీ సీఐడీ ఢిల్లీ వెళ్లింది. నోటీసులు ఇవ్వ‌డం ద్వారా విచార‌ణ‌కు ర‌ప్పించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, అరెస్ట్ వ‌ర‌కు వెళ్ల‌కుండా యువ‌గ‌ళం సాఫీగా సాగ‌కుండా వ్యూహాల‌ను వైసీపీ ర‌చించిన‌ట్టు తెలుస్తోంది. మొత్తం మీద బ్రాహ్మ‌ణి ఎన్నిక‌ల సీన్లోకి రాకుండా వైసీపీ జాగ్ర‌త్త ప‌డ‌డం గ‌మ‌నార్హం.

Also Read : TDP : టీడీపీ ‘మోత మోగిద్దాం’ పిలుపు ఫై అంబటి రాంబాబు కామెంట్స్ ..