Site icon HashtagU Telugu

Jagan Day : అమ్మో`ఫ్రై` డే! జ‌గ‌న్ స్క్రిఫ్ట్ భ‌యాన‌కం!!

Jagan Pulivendula Politics

Jagan Day

Jagan Day : ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్క్రీప్ట్ ను దేవుని స్క్రీఫ్ట్ అంటూ వైసీపీ ప్ర‌చారం చేసుకుంటోంది. ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హాజ‌రు కావాలి. ఫ్రై డే తో ఆయ‌న‌కు అవినాభావ సంబంధం ఉంది. సీబీఐ కోర్టుకు ప్ర‌తి ఫ్రై డే ఆయ‌న హాజ‌రు కావాలి. సీఎం అయిన త‌రువాత ఉపశ‌మ‌నం ల‌భించింది. బెయిల్ ర‌ద్దు మీద ఆయ‌న జాత‌కం ఆధార‌ప‌డింది. ఆయ‌న్ను జైలు ప‌క్షిగా టీడీపీ ప్ర‌తి వేదిక మీదా ఫోక‌స్ చేసింది. ప్ర‌తి శుక్ర‌వారం వెళ్లే కోర్టుప‌క్షిగా పోల్చింది. అందుకే, ఇప్పుడు టీడీపీ లీడ‌ర్ల‌ను కూడా జైలు, కోర్టులు చుట్టూ తిప్ప‌డానికి శుక్ర‌వారాన్ని  ముహూర్తంగా పెట్టుకుంటున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

కోర్టులు చుట్టూ తిప్ప‌డానికి శుక్ర‌వారాన్ని  ముహూర్తం (Jagan Day)

జ‌గ‌మొండోడు జ‌గ‌న్ అంటూ ముద్దుగా ఆ పార్టీ క్యాడ‌ర్ చెప్పుకుంటారు. ఆయ‌న పాల‌న కూడా అదే త‌ర‌హాలో ఉంద‌ని ప్ర‌త్య‌ర్థులు భావిస్తుంటారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి టీడీపీ లీడ‌ర్ల‌ను ఆయ‌న టార్గెట్ చేశారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండ‌గా త‌న‌ను టార్గెట్ చేసిన అచ్చెంనాయుడును తొలుత జైలుకు పంపారు. ఆయ‌న ఈఎస్ ఐ స్కామ్ కు పాల్ప‌డ్డారంగూ అభియోగాలు మోపారు. ఏసీబీ, సీఐడీని ప్ర‌యోగించారు. ఒక్క‌రోజైనా జైలులో పెట్టాల‌ని టార్గెట్ పెట్టుకున్నార‌ట‌. అందుకే, ఆయ‌న్ను ఎలాగైనా జైలులో పెట్టాల‌ని ద‌ర్యాప్తు సంస్థ‌లు ప్ర‌యాస‌ప‌డ్డాయి. ఆయ‌న్ను జైలుకు పంపారు. ఆ త‌రువాత బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ కేసు ఇప్ప‌టికీ న్యాయ‌స్థానాల్లో న‌డుస్తోంది.

మాజీ మంత్రుల‌ను జైళ్ల‌కు పంపిన జ‌గ‌న్

ఇక మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర మీద హ‌త్యాయ‌త్నం కేసు మోపారు. ఆధారాల్లేకుండా ఏవో అభియోగాలు మోప‌డం ద్వారా ఆయ‌న్నూ జైలుకు పంపారు. ఇక మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మీద ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. ఆయ‌న మీద రౌడీషీట్ ఓపెన్ చేయ‌డానికి సాహ‌సం చేశారు. పోలీసుల వెంబ‌డించి ఆయ‌న్ను అరెస్ట్ చేసి లోప‌ల‌కు పంపే వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒప్పుకోలేద‌ట‌. ఇక సొంత డెయిరీని నిర్వ‌హిస్తూ చ‌ట్ట ప్ర‌కారం పైకి ఎదిగిన మ‌చ్చ‌లేని నాయ‌కుడు ధూళ్లిపాళ్ల న‌రేంద్ర‌ను టార్గెట్ చేశారు. పాల ఉత్ప‌త్తులు చేస్తూ డెయిరీని అభివృద్ధి చేసిన ఆయ‌న చ‌ట్టానికి విరుద్ధంగా అక్క‌డ కార్య‌క‌లాపాలు న‌డిపార‌ని అభియోగం మోపారు. ఐదుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచిన న‌రేంద్ర‌ను జైలుకు పంపారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని లేకుండా క‌క్ష సాధింపు

రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంటేనే భ‌య‌ప‌డే ప్రాంతంలో జేసీ బ్ర‌ద‌ర్స్ ఆయ‌న్ను ఎదురొడ్డారు. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్య‌క్తిగ‌తాన్ని త‌వ్వి తీశారు. ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేసే ప్ర‌య‌త్నం చేశారు. అందుకు ప్ర‌తిగా అధికారంలోకి రాగానే వాళ్లు వ్యాపారాన్ని కూల్చేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆ త‌రువాత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మీది ట్రాన్స్ పోర్ట్ అక్ర‌మాలంటూ అభియోగాలు మోపారు. ఆయ‌న్ను క‌డ‌ప జైలుకు పంపారు. మాజీ స్పీక‌ర్, ఏపీ తొలి స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న‌కుతానే ఆత్మహ‌త్య చేసుకునేలా సిట్యువేష‌న్ క్రియేట్ అయింది. దానికి కార‌ణం కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అంటూ అప్ప‌ట్లో వినిపించింది.

Also Read : TDP Loyalty : చంద్ర‌బాబు నిప్పంటూ కేశినేని స‌ర్టిఫికేట్

మాజీ మంత్రులు అయ‌న్న‌పాత్రుడు, గంటా శ్రీనివాస‌రావుల‌ను తొలి నుంచి టార్గెట్ చేస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ క‌న్నేసింది. విశాఖ జిల్లాకు చెందిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్ స‌బ్బం హ‌రి గృహం మీద దాడికి దిగారు. ఆ నిర్మాణాల‌ను కూల్చారు. ఆ త‌రువాత ఆయ‌న మ‌ర‌ణించారు. కేవ‌లం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్య‌క్తిగ‌తంపై రాజ‌కీయ‌దాడి చేయ‌డం కార‌ణంగా ఆయ‌న్ను స‌ర్కార్ టార్గెట్ చేసిందని అప్ప‌ట్లోని టాక్‌. ఇక సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శించిన వాళ్లు అనేక మంది అరెస్ట్ అయ్యారు. ప‌లువుర్ని జైలుకు పంపారు. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా అమ‌రావ‌తి ప్రాంతంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేశారు. ఆ త‌రువాత ప‌సుపు నీళ్ల‌తో ఆ ప్రాంతాన్ని స్థానికులు శుద్ధి చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అమ‌రావ‌తి రాజ‌ధాని లేకుండా చేశార‌ని చెప్పుకుంటారు. ఇలా, క‌క్ష సాధింపు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తార‌ని గుర్తు చేసుకుంటున్నారు.

Also Read : CBN ARREST : నా అరెస్టు వెనుక పెద్ద కుట్ర : చంద్రబాబు

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణం రాజు ప‌రిస్థితిని చూశాం. ఆయ‌న సీఎం అయిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితిని వివ‌రిస్తూ పాల‌న మీద ఎదురుదాడికి దిగారు. టార్గెట్ చేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అత‌న్ని అరెస్ట్ చేయించారు. అంతేకాదు, థ‌ర్డ్ డిగ్రీని కూడా సీఐడీ పోలీసులు ప్ర‌యోగించార‌ని త్రిబుల్ ఆర్ చెబుతున్నారు. ఆయ‌న్ను అరెస్ట్ చేసిన సంద‌ర్భంగా మ్యాన్ హ్యాండ‌ల్ చేసి వీడియో ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చూపించార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. అంటే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌క్ష క‌డితే ఎలా ఉంటుంది? అనేది ఇలాంటి సంఘ‌ట‌న‌ల ద్వారా వివ‌రిస్తున్నారు. ఇక చంద్ర‌బాబు మీద కోపాన్ని ప్ర‌జావేదిక ద్వారా తొలి రోజుల్లో సీఎం హోదాలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీర్చుకున్నారు. దాదాపుగా ఈ సంఘ‌ట‌న‌ల‌న్నీ శుక్ర‌వారం జ‌రిగిన‌వే. ఆయ‌న్ను ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు వెళ‌తార‌ని అనే విమ‌ర్శ చేశారు క‌నుక అంద‌రికీ ఫ్రై డే హ‌డ‌ల్ ఎత్తేలా చేస్తున్నార‌ని ఆయ‌న గురించి తెలిసిన వాళ్లు చేసే కామెంట్‌. దానిలో నిజ‌మెంతో దేవుడికే ఎరుక‌!