Jagan-CBN : ముస‌లోడెవ‌రో తేల్చుకుందాం..రా.! ఏడుకొండలెక్కుతావా? ఛాలెంజ్!!

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan-CBN) చెబుతోన్న వాటిల్లో `వైనాట్ 175, చంద్ర‌బాబు ముస‌లాయ‌న‌, వ‌చ్చే 30ఏళ్ల మ‌న‌మే..`

  • Written By:
  • Publish Date - February 4, 2023 / 02:01 PM IST

వైసీపీ జీవితకాల శాశ్వ‌త అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan-CBN) ఇటీవ‌ల చెబుతోన్న వాటిల్లో `వైనాట్ 175, చంద్ర‌బాబు ముస‌లాయ‌న‌, వ‌చ్చే 30ఏళ్ల మ‌న‌మే..` ఈ మూడు అంశాలు ప్ర‌ధానంగా ఉన్నాయి. వాటి వెనుక అర్థం ప‌ర‌మార్థం లేక‌పోలేదు. మైండ్ గేమ్(Mind game) ఆడ‌డం ఆయ‌న‌కు స్వ‌త‌హాగా ఉండే రాజ‌కీయ ల‌క్ష‌ణం. ఎన్డీయే నుంచి 2019 ఎన్నిక‌లకు ముందు ఏ విధంగా టీడీపీని బ‌య‌ట‌కు ర‌ప్పించారో, అంద‌రం చూశాం. ఆనాడు ప్ర‌త్యేక హోదా అస్త్రాన్ని ప్ర‌యోగించి టీడీపీ, బీజేపీ బంధాన్ని విజ‌య‌వంతంగా విడ‌గొట్టారు. ఇప్పుడు ప్ర‌త్యేక‌హోదా ప్ర‌స్తావ‌న లేకుండా రాజ‌కీయాన్ని అద్బుతంగా న‌డుపుతున్నారు. హోదాను ప్ర‌జ‌లు మ‌రిచిపోయేలా చేశారు. తాజాగా `వై నాట్ 175` అంటూ బ‌లంగా వినిపిస్తున్నారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల చెబుతోన్న చంద్ర‌బాబు ముస‌లాయ‌న‌ (Jagan-CBN) 

నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని జ‌గ‌న్మోహన్ రెడ్డి (Jagan-CBN)ముందుగా గ్ర‌హించారు. దావానంలా పేల‌కుండా `వై నాట్ 175` అంటూ పాజిటివ్ మూడ్ లోకి ఎమ్మెల్యేల‌ను తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యేలు స్వేచ్ఛ‌గా వెళ్లే ప‌రిస్థితి క్షేత్ర‌స్థాయిలో లేదు. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను సానుకూలంగా మ‌లుచుకునేందుకు మంత్రుల బ‌స్సు యాత్ర తుస్ అయింది. ప‌ర‌దామాటున ప‌ర్య‌ట‌న‌లు చేసే ప‌రిస్థితికి ఆయ‌న వ‌చ్చారు. అదే స‌మ‌యంలో 50 నుంచి 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 12 మంత్రులు గెలిచే ప‌రిస్థితి లేద‌ని స‌ర్వేలను అందుకున్నారని తెలుస్తోంది. ఇలా ప‌లు మైన‌స్ ల‌ను గ‌మ‌నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `వై నాట్ 175` ను తెర‌మీద‌కు తీసుకు రావ‌డం ద్వారా మైండ్ గేమ్(Mind game) ను మొద‌లు పెట్టార‌ని రాజ‌కీయ అనుభ‌వ‌జ్ఞుల‌కు తెలుసు.

Also Read : CBN Giotag : జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌కు టెక్నాల‌జీతో చెక్ పెట్టేలా చంద్ర‌బాబు చ‌తుర‌త‌

`ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి ..` ప్రోగ్రామ్ ద్వారా చంద్ర‌బాబు గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఆయ‌న అనుభ‌వాన్ని ప్ర‌జ‌లు గ్ర‌హించారు. ఎక్క‌డ స‌భ‌లు పెట్టిన‌ప్ప‌టికీ స్వచ్చంధంగా జ‌నం పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. నిఘా సంస్థ‌ల నుంచి స‌మాచారం అందుకున్న జ‌గన్మోహ‌న్ రెడ్డి (Jagan-CBN)వ్యూహాత్మ‌కంగా `ముస‌లాయ‌న` అంటూ చంద్ర‌బాబు మీద మైండ్ గేమ్ మొద‌లు పెట్టారు. ఇటీవ‌ల వ‌ర‌కు దుష్ట‌చ‌తుష్ట‌యం అంటూ బాగా వినిపించారు. ఇప్పుడు ముస‌లాయ‌న అంటూ చంద్ర‌బాబు వ‌య‌సును త‌న‌కు పాజిటివ్ గా మార్చుకునే ఎత్తుగ‌డ‌కు తెర‌లేపారు. సరిగ్గా ఈ కామెంట్ వ‌ద్ద కౌంట‌ర్ ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వ‌య‌సు మీద‌ప‌డినా ఆలోచ‌న మాత్రం ఇప్ప‌టికీ 20 ఏజ్ లోనే ఉంద‌ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేసే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, లోకేష్ త‌న పాద‌యాత్ర‌లో ఇదే అంశాన్ని మ‌రోలా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లారు. తిరుప‌తి కొండ ఎక్క‌డానికి చంద్ర‌బాబుతో పోటీప‌డాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌వాల్ విసిరారు.

చిత్తూరు పాద‌యాత్ర‌లో ఉన్న లోకేష్ స‌రికొత్త స‌వాల్

వాస్తవంగా తిరుప‌తి కొండ‌ను మెట్ల మార్గం ద్వారా జ‌న‌సేనాని ప‌వ‌న్, చిరంజీవి త‌దిత‌రులు ఎవ‌రూ ఒక‌బిగిన ఎక్క‌లేక‌పోయారు. అంతెందుకు టీనేజ్ వాళ్లు కూడా చాలా మంది ఆగ‌కుండా తిరుప‌తి మెట్లు ఎక్క‌డం క‌ష్టం. అలాంటిది చంద్ర‌బాబు త‌న 70 ఏళ్ల వ‌య‌స్సులోనే ఏక‌బిగిన తిరుప‌తి మెట్ల మార్గం ద్వారా తిరుమ‌ల‌కు చేరుకున్నారు. అదో రికార్డ్ గా ఆయ‌న‌కు మిగిలిపోయింది. ఇప్పటికీ చంద్ర‌బాబునాయుడు మాదిరిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పుడూ మెట్ల మార్గం ద్వారా తిరుమ‌ల‌కు వెళ్ల‌లేదు. అందుకే, తాజాగా చిత్తూరు పాద‌యాత్ర‌లో ఉన్న లోకేష్ స‌రికొత్త స‌వాల్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందుంచారు. `కొండ‌కొస్తే తేల్చుకుందాం..ఎవ‌రు ముస‌లాయ‌న` అనేది అంటూ స‌వాల్ చేయ‌డంతో అక్క‌డి జ‌నాలు కేరింత‌లు కొట్టారు. ఇక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan-CBN)ఈ స‌వాల్ ను స్వీక‌రించే ప‌రిస్థితి లేద‌ని టీడీపీ వ‌ర్గాల్లోని అభిప్రాయం. దీంతో ముస‌లాయ‌న అనే వ్యంగ్యాస్త్రాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మానుకోవ‌డం ఖాయ‌మంగా భావిస్తున్నారు.

తిరుప‌తి కొండ ఎక్క‌డానికి చంద్ర‌బాబుతో పోటీప‌డాల‌ని

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిస్తే రాబోవు 30ఏళ్లు ఇక ఆయ‌న శాశ్వ‌తంగా అధికారంలో ఉంటాడ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆశ ప‌డుతున్నారు. దానికి కార‌ణం లేక‌పోలేదు. ఆయ‌న దృష్టిలో ఇప్పుడు గెలిస్తే, చంద్ర‌బాబు వ‌య‌స్సు మీదప‌డి టీడీపీ బ‌ల‌హీన ప‌డుతుంద‌ని అంచ‌నా. అలాగే, జ‌న‌సేన క్షేత్ర‌స్థాయిలో ఇక క‌న‌బ‌డ‌ద‌ని ఆయ‌న న‌మ్మ‌కం. ప్ర‌త్య‌ర్థి పార్టీలు కంటిచూపు మేర‌లో ఉండ‌కుండా మ‌రోసారి అధికారం ఇస్తే చేయొచ్చ‌ని వ్యూహం. పైగా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని ముద్ర‌వేస్తే జ‌నం కూడా వైసీపీ వైపు ఉంటార‌ని ఆశ‌. అందుకే, మ‌రో 30ఏళ్లు శాశ్వ‌తం అంటూ ప‌దేప‌దే చెబుతున్నారు. బ‌హుశా మ‌రో కార‌ణం కూడా ఆయ‌న మదిలో ఉండొచ్చు.

Also Read : Jagan-CBN : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైఫ‌ల్యాలే చంద్ర‌బాబు విజ‌యానికి మెట్లు

క‌డ‌ప‌లో త‌ర‌త‌రాలుగా ఎలా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా గెలిస్తే, క‌డ‌ప త‌ర‌హాలో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని ఆయ‌న భావ‌న కావ‌చ్చు. ఇప్ప‌టికే ఏపీ వ్యాప్తంగా ప్యానిక్ వాతావ‌ర‌ణ నెల‌కొంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల ఆఫీస్ ల‌పై దాడులు, తుపాకీ కాల్పులు, ప్ర‌త్య‌ర్థుల ఇళ్ల ధ్వంసం త‌దిత‌రాల‌తో భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టించారు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్య‌ర్థులు నిర్వీర్యం అవుతారు. ఫ‌లితంగా ఎన్నేళ్లైనా అధికారంలో ఉండొచ్చ‌ని భావించేలా జ‌నంకు వ్యూహాత్మ‌కంగా ప‌రోక్ష హెచ్చ‌రిక జారీ చేస్తున్నారు. ఈ మూడు అంశాలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేసే ఎత్తుగ‌డ‌ల్లోని ప్ర‌ధాన‌మైన‌వి. వీటికి చెక్ పెట్టేలా లోకేష్ కౌంట‌ర్ ఇస్తున్నారు. తాజాగా ముస‌లాయ‌న కామెంట్ (Mind game) కు కొండ మీద తేల్చుకుందామ‌ని చేసిన ఛాలెంజ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తాకుతుందా? లేదా అనేది చూడాలి.