Site icon HashtagU Telugu

Jagan 2.0 : 2027లో జగన్ 2.0 పాదయాత్ర..ఏంటి గెలుద్దామనే !!

Jaganpaadayatra

Jaganpaadayatra

2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైఎస్ జగన్ (Jagan) నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)ఇప్పటికీ ఆ షాక్ నుంచి పూర్తిగా కోలుకోలేకపోతుంది. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోవడం పార్టీకి గట్టి దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన తాజా ప్రకటన పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపేలా ఉంది. జగన్ 2027లో “పాదయాత్ర 2.0” (Paadayatra 2.0) ప్రారంభించనున్నారని ప్రకటించారు.

Terrorist Attack : ప్రధాని మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ

గతంలో ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైసీపీకి భారీ విజయం దక్కిన నేపథ్యంలో, ఇప్పుడు రెండవ పాదయాత్రతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారని సంకేతాలు వెల్లడి అయ్యాయి. విశాఖపట్నంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో గుడివాడ చేసిన ప్రసంగం, పార్టీ శ్రేణుల్లో మార్గదర్శకంగా నిలిచింది. ఐదేళ్ల సమయం త్వరగా గడుస్తుందని, ఈ నాలుగేళ్లలో పార్టీ పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నుంచి వెళ్తే బతిమాలే పరిస్థితి లేదన్న ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పార్టీని బలోపేతం చేయడం కోసం కమిటీలను పునర్నిర్మించాలని, అందుకు ఓ ఏడాది పట్టే అవకాశముందని తెలిపారు. తరువాత వచ్చే సంవత్సరంలో భారీ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

APPSC Irregularities : ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ధాత్రి మధు అరెస్టు.. ఏమిటీ కేసు ?

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తగిన మేర సేవలు అందించలేకపోతున్నదన్న విమర్శలు చేస్తూ, గుడివాడ ప్రజలు మళ్లీ జగన్ పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కొత్తగా పింఛన్లు ఇవ్వడం లేదన్న ప్రజల ఆరోపణలు ప్రస్తావించారు. జగన్ పాదయాత్ర 2.0 వల్ల ప్రజల్లో మళ్లీ విశ్వాసం చేకూరుతుందని, గతం మరిచి కొత్త పోరాటానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరి జగన్ నిజగానే పాదయాత్ర చేస్తాడా..? చేస్తే ప్రజలు జగన్ ను నమ్ముతారా..? ఒకసారి గెలిపించే తప్పు చేశామని బాదపడ్డ ప్రజలు మళ్లీ ఓటు వేస్తారా..? వీటి అన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.