Site icon HashtagU Telugu

YS Jagan : జగన్‌పై అనర్హత వేటు వేస్తారా ? పులివెందులకు బైపోల్ తప్పదా ?

Ysrcp Chief Ys Jagan Pulivendula By Election Ap Govt Andhra Pradesh

YS Jagan : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పటి నుంచి మళ్లీ అసెంబ్లీ వైపు తిరిగి చూడలేదు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లనివ్వడం లేదు. దీనిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తాజాగా సీరియస్ అయ్యారు. సెలవుకు అప్లై చేయకుండా వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని  వార్నింగ్ ఇచ్చారు. సభకు జగన్‌ గైర్హాజరీ గురించి విలేకరులు ప్రశ్నించగా .. రఘురామ ఈవిధంగా రిప్లై ఇచ్చారు. జగన్‌పై అనర్హత వేటు పడగానే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందన్నారు. ‘‘వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు. అసెంబ్లీలో కనీసం 10శాతం మంది ఎమ్మెల్యేల బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు’’ అని రఘురామ తెలిపారు. ఈ మాటల అంతరార్ధం ఏమిటి ? నెక్ట్స్ ఏం జరగబోతోంది ?

Also Read :SwaRail vs IRCTC : ‘స్వరైల్’, ‘ఐఆర్‌సీటీసీ’ యాప్‌లలో ఏది బెటర్ ?

జగన్ అసెంబ్లీకి వస్తారా ?

వైఎస్ జగన్(YS Jagan) ఏం చేయబోతున్నారు ? అసెంబ్లీకి హాజరవుతారా ? అనర్హత వేటును ఎదుర్కొంటారా ? అనే దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. ఈనెలలోనే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. జగన్ రిస్క్ లేకుండా ఈసారి బడ్జెట్ సమావేశాలకు ఒకటి, రెండు రోజులు హాజరయ్యే అవకాశం ఉందని వైఎస్సార్ సీపీ వర్గాలు అంటున్నాయి. తద్వారా అనర్హత వేటు ముప్పు నుంచి ఆయన బయటపడతారని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ సెషన్ పూర్తయిన తర్వాత జరిగే మరో రెండు, మూడు అసెంబ్లీ సెషన్లకు జగన్ గైర్హాజరయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.

బైపోల్ వస్తే..

ఒక్క విషయం మాత్రం క్లియర్. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కానీ, వైఎస్ జగన్ కానీ అసెంబ్లీ రూల్స్‌కు వ్యతిరేకంగా నడుచుకుంటూ ఏపీలోని కూటమి సర్కారు ఉపేక్షించే అవకాశాలు లేవు. ఆయా నియమాలకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ వైఎస్ జగన్ ఇకపైనా అసెంబ్లీకి వెళ్లకుంటే.. అనర్హత వేటు వేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక  వస్తుంది. చాలా అరుదైన సందర్భాల్లోనే అక్కడ బైపోల్స్ జరిగాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1989లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 1991లో లోక్‌‌సభకు పోటీ చేశారు. దీంతో అప్పట్లో పులివెందులకు బైపోల్ నిర్వహించారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించినపుడు మరోసారి అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ప్రతీ బైపోల్‌లోనూ అక్కడ వైఎస్ కుటుంబమే విజయం సాధించింది.

Also Read :Bhagya Sri Borse : రెండు క్రేజీ సినిమాలతో మిస్టర్ బచ్చన్ బ్యూటీ..!

ఆ లెక్క ప్రకారం.. అనర్హతకు ఛాన్సే లేదు