Hyper Aadi : పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే..ఎన్నికల్లో పోటీ చేస్తా – హైపర్ ఆది ఫుల్ క్లారిటీ

  • Written By:
  • Publish Date - February 14, 2024 / 08:50 PM IST

జబర్డస్త్ ఫేమ్ హైపర్ ఆది (Hyper Aadi) కి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సభ ఏదైనా , వేదిక ఏదైనా సరే పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ఎప్పటికప్పుడు చూపిస్తుంటారు. ఆ అభిమానమే..మెగా అభిమానుల్లో హైపర్ ఆది కి ప్రత్యేక స్థానం ఏర్పడేలా చేసింది. అంతే కాదు జనసేన కోసం అది ప్రచారం కూడా చేస్తుంటారు. తాజాగా తన రాజకీయ ఆరంగేట్రం (Political Entry) ఆది క్లారిటీ ఇచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు అనసరించే ప్రతి ఒక్క సిద్ధాంతం నాకు నచ్చుతుంది. ఈ కారణంతోనే ఆయనతో నేను నడవాలనుకుంటున్నాను. పవన్‌ ను ఎవరెమన్నా నాకు కోపం వస్తుందని.. ఏదైనా అంటే నేను తప్పకుండ రియాక్ట్‌ అవుతాను. ఆయన వ్యక్తిగతంగా ఎవరిని దూషించరు. ప్రజల సమస్యల గురించి మాత్రం ఆయన నిత్యం ఆలోచిస్తారు. ఆయన గెలిస్తే జానాలకు తప్పకుండా మంచి చేస్తాడు. నేను పదవులు, టికెట్లు ఆశించిన జనసేన సపోర్టు చేయడం లేదు. అయన మీద ఉన్న అభిమానం, పవర్‌ సిద్ధాంతాలు నచ్చే జనసేనకు మద్దతు ఇస్తున్నాను” అని స్పష్టం చేశాడు.

ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తనకు జనసేన టికెట్‌ ఇచ్చి పోటీ చేయమంటే మాత్రం తప్పకుండా చేస్తానంటూ స్పష్టం చేసారు. పవన్‌ కళ్యాణ్‌ను గెలిపించడం కోసమైనా తాను గెలుస్తానని, ఈసారి ఎన్నికల్లో జనసేన తరపున క్యాంపైన్‌ చేయడానికి వెళతానని పేర్కొన్నాడు. అలాగే వైసీపీ మినిస్టర్ రోజా తో తనకు ఎలాంటి గొడవలు లేవని , నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నంటే అది జబర్దస్త్ వల్లే అని, నా సక్సెస్ లో నాగబాబు ఎలాగో..రోజా గారు అలాగే అన్నారు. రాజకీయాలు వేరు , కెరియర్ వేరు అని క్లారిటీ ఇచ్చారు.

Read Also : CM Revanth Reddy : సీఎం రేవంత్‌ సంచలన నిర్ణయం.. రెవెన్యూ రికవరీ చట్టం..?