Ugadi Wishes: చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు

తెలుగు వారికి ప్రత్యేకమైన ఉగాది పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు.

Published By: HashtagU Telugu Desk
Happy Ugadi Wishes By Nara Chandra Babu

Happy Ugadi Wishes By Nara Chandra Babu

తెలుగు వారికి ప్రత్యేకమైన ఉగాది (Ugadi) పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలతో పాటు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు (Ugadi Wishes). మనందరం శోభకృత్ నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. శోభను కలిగించేది శోభకృత్. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు ప్రగతి శోభ రావాలి. చీకట్లు తొలగిపోయి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నవోదయం రావాలి.

ప్రకృతిలో కలిగే మార్పుకు సంకేతంగా ఉగాది జరుపుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా కొత్త ఏడాది శుభప్రదమైన మార్పును తేవాలని ఆకాంక్షిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో కొత్త ఏడాది పెనుమార్పులు తేబోతుంది అని ఉగాదికి మూడు రోజుల ముందే మనకు అర్థం అయ్యింది. ప్రజలు ఉగాది పంచాంగం ముందే చెప్పేశారు. ఇది రాష్ట్రానికి శుభసూచకం. శుభప్రదమైన ఆ మార్పును స్వాగతిద్దాం. ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికీ శుభాలను కలిగించాలని, మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ, తెలుగు ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:  ‘R5’ riot in Amaravati: అమరావతిలో ‘ఆర్‌ 5’ అలజడి

  Last Updated: 21 Mar 2023, 11:42 PM IST