Site icon HashtagU Telugu

Guntur Techie Dies In America : అమెరికాలో గుంటూరు యువ‌కుడు మృతి.. ట్రెక్కింగ్ చేస్తూ..!

Sucide Imresizer

Sucide Imresizer

అమెరికాలో ట్రెక్కింగ్‌కు వెళ్లి ఓ తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రమాదంలో మృతి చెందాడు. గుంటూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ నిపుణుడు తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లి లోయలో పడి మృతి చెందాడు. ఈ దారుణ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతుడు గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్ (32)గా గుర్తించారు. శ్రీనాథ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ప‌ని చేస్తున్నాడు. ఆయ‌న‌కు భార్య‌, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. గత ఆరేళ్లుగా ఫ్లోరిడాలో ఉద్యోగం చేస్తున్న శ్రీనాథ్ సెలవుపై తన స్నేహితులతో కలిసి అట్లాంటా వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో భార్యాభర్తలు సరదాగా అట్లాంటాలో ట్రెక్కింగ్‌కు వెళ్లారు.

క్లీవ్‌ల్యాండ్‌లోని పర్వత కొండల్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లిన అతను ప్రమాదవశాత్తు జారి 200 వందల అడుగుల ఎత్తులో పడిపోయాడు. శ్రీనాథ్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని గుంటూరుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనాథ్ అమెరికా వెళ్లి యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో మాస్టర్స్ చేశారు. అతను మిన్నెసోటాలోని ఒక ఫైనాన్షియల్ కంపెనీతో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. కుమారుడి మరణవార్త విని శ్రీనాథ్ తల్లిదండ్రులు బాబూరావు, మల్లేశ్వరి భోరున విలపించారు.