విశాఖపట్నం నగరం మరోసారి చరిత్ర సృష్టించింది. ‘యోగాంధ్ర 2025’ (Yogandhra 2025)కార్యక్రమం దేశాన్ని గర్వపడేలా చేసింది. విశాఖ RK బీచ్‌లో జరిగిన ఈ భారీ యోగా కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Record) గుర్తింపు లభించింది. ఇప్పటివరకు గుజరాత్‌లోని సూరత్ పట్టణం 1.5 లక్షల మందితో నిర్వహించిన యోగా కార్యక్రమం రికార్డుగా నిలిచినప్పటికీ, యోగాంధ్ర 2025 ఆ రికార్డును అధిగమించింది. ఏకంగా 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొనడం ద్వారా కొత్త రికార్డుని నెలకొల్పింది.
Telangana Yoga Day: గచ్చిబౌలిలో జూన్ 21న యోగా డే వేడుకలు, 5500 మందితో భారీ నిర్వహణ
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు 26 కిలోమీటర్ల మేర బీచ్ ప్రాంతంను యోగాసనాల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. 45 నిమిషాలపాటు జరిగిన యోగా ప్రదర్శనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. వారందరూ ఒకే సమయంలో యోగాసనాలు చేయడం వలన ఈ ఘనత సాధ్యమైంది.
Liver : మీ లివర్ బాగుందా..? డేంజర్ లో ఉందా..? అనేది ఈ లక్షణం తో తెలిసిపోతుంది
ఈ రికార్డు ద్వారా తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, భారతదేశానికే ఒక విశేషమైన గుర్తింపు లభించింది. యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కలిగించే ప్రయత్నంలో ఇది మరో ముందడుగు. ‘వన్ ఎర్త్ – వన్ హెల్త్’ అనే థీమ్‌పై జరిగిన ఈ కార్యక్రమం ద్వారా యోగా వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ప్రపంచానికి చాటి చెప్పబడ్డాయి. యోగా ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇది గొప్ప ప్రేరణగా మారనుంది.
ఇక మోడీ మాట్లాడుతూ..యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని మోడీ తెలిపారు. యోగాదినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని గుర్తు చేశారు. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని చెప్పారు. యోగాకు హద్దులు లేవని, యోగాకు వయస్సుతో పనిలేదని మోడీ పేర్కొన్నారు. ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి విశాఖపట్నం చిరునామా అని, చంద్రబాబు, పవన్ యోగాంధ్ర నిర్వహణకు చొరవ చూపారని కొనియాడారు. నారా లోకేశ్ కూడా యోగాంధ్ర కార్యక్రమం కోసం కృషి చేశారని అన్నారు. నెలన్నర రోజుల్లో యోగాంధ్రను విజయవంతం చేయడంలో లోకేశ్ పాత్ర కీలకమైందన్న ప్రధాని, కొత్త కార్యక్రమాల రూపకల్పనలో లోకేశ్ చొరవ ప్రశంసనీయమన్నారు.