Anantha Sriram : తెలుగు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల కాలంలో పలు సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కొన్ని సినిమాల్లో హైందవ పురాణాలను వక్రీకరించి చూపిస్తున్నారని ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే సినిమాల్లో హైందవ ధర్మ హననం జరుగుతోందని అనంత శ్రీరామ్ వ్యాఖ్యానించారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసే సినిమాలను ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలని కోరారు. ‘‘మన దీక్ష దేవాలయ రక్ష’’ నినాదంతో ఇవాళ ఏపీలోని అమరావతి పరిధిలో ఉన్న కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్, హిందూ సంఘాలు హైందవ శంఖారావం బహిరంగ సభను ఏర్పాటు చేశాయి. ఈ సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రజలు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంత శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read :JC Prabhakar Reddy : ‘‘నేను మాట్లాడింది తప్పే..’’ నటి మాధవీలతకు జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణలు
‘‘హిందూ సమాజానికి సినీ రంగం తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. క్షమాపణ చెప్పకపోతే నాకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. మన పురాణాలు, ఇతి హాసాల గొప్పతనాన్ని సినిమాల్లో తగ్గించి చూపిస్తున్నారు. చరిత్రను వక్రీకరించి హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వ్యాసుడు, వాల్మీకిల రచనలను వినోదం కోసం వక్రీకరించారు’’ అని అనంత శ్రీరామ్ (Anantha Sriram) తెలిపారు. ‘‘కల్కి 2898 ఏడీ సినిమాలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారు. ఆయన్ను శూరుడు అంటే ఎవరు ఒప్పుకోరు. సినిమాల్లో పురాణాలపై ఇలాంటి వక్రీకరణలు చూసి నేనే సిగ్గుపడుతున్నాను. ఎవరు చేసినా తప్పును తప్పే అని చెప్పాలి’’ అని ఆయన తెలిపారు.
Also Read :Sankranti Special Trains : సంక్రాంతి స్పెషల్.. తెలుగు రాష్ట్రాలకు 52 అదనపు రైళ్లు
‘‘కల్కి సినిమాలో కర్ణుడి పాత్రకు ఆపాదించిన గొప్పతనాన్ని చూసి నేను సినిమా వాడిగా సిగ్గు పడుతున్నా. ఈ కృష్ణా జిల్లాకే చెందిన దర్శకులు, నిర్మాతలే ఈ పొరపాటు గురించి చెప్పకపోతే ఎలా ? ఇలా పాత్రల ఔన్నత్యాన్ని మారిస్తే.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు’’ అని అనంత శ్రీరామ్ కామెంట్ చేశారు. ‘‘సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం. ఈ రెండింటిని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతోంది. జరిగే తప్పులను తాను బాహాటంగానే విమర్శిస్తున్నాను. సినీ రంగానికి చెందిన వాడిగా ఇప్పటివరకు సినిమాల్లో జరిగిన హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం గురించి సమాజానికి చెబుతున్నాను’’ అని అనంత శ్రీరామ్ వ్యాఖ్యానించారు.