Navodaya Jobs : నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. వాస్తవానికి నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన 1377 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేసే గడువు ఏప్రిల్ 30తోనే ముగిసింది. అయితే తాజాగా ఆ తేదీని మే 7 వరకు పొడిగించారు. అంటే అప్లై చేసుకోవడానికి మరో ఐదు రోజుల అదనపు టైం అందుబాటులోకి వచ్చింది. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు ఉపయోగించుకోవాలి. ఆయా పోస్టులను బట్టి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ పాసైన వారు అప్లై చేయొచ్చు. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
ఏయే ఉద్యోగాలు ? ఎన్ని ఉద్యోగాలు ?
దేశంలోని నవోదయ విద్యాలయాల్లో(Navodaya Jobs) మొత్తం 1377 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండగా.. వాటిలో అత్యధికంగా మెస్ హెల్పర్ ఉద్యోగాలు 442, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు 381, ల్యాబ్ అటెండెంట్ జాబ్స్ 161 ఉన్నాయి. ఇక ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ ఉద్యోగాలు 128, ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు 121, క్యాటరింగ్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు 78 ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు 23, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ 19, ఆడిట్ అసిస్టెంట్ జాబ్స్ 12, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ 5, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు 4, కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ 2, లీగల్ అసిస్టెంట్ జాబ్స్ 1 ఉన్నాయి.
Also Read :Kingmaker : 12 లోక్‌సభ సీట్లతో బీఆర్ఎస్ కింగ్‌మేకర్ అవుతుందా ?
ఫీజు, వయసు, పరీక్షలు..
- అన్ని పోస్టులకు కనిష్ఠ వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు.
- ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1500 కాగా, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
- మిగతా అన్ని పోస్టులకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే చాలు.
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంది.
- తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌లలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.