Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ పిల్లలతో పాటుగా కాలేజీ పిల్లలకు మరో అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఇంకా ఎవరైనా పిల్లలు ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే.. వెంటనే చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 2 నుంచి 6 వరకు.. ఈ నెల 16 నుంచి 20 వరకు ఆధార్ స్పెషల్ క్యాంపుల్ని నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్, కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి స్కూల్స్, ఇంటర్ కాలేజీల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గతేడాది నుంచి ఈ క్యాంపులు నిర్వహిస్తున్నా సరే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేయలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఆధార్ క్యాంపుల్ని స్కూల్స్, కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. రెండో విడతగా ఈ నెల 16వ తేదీ నుంచి 20 తేదీ వరకు కూడా మరోసారి అవకాశం కల్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల్లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది (గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది) ఈ ఆధార్ స్పెషల్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల నుంచి 17 ఏళ్ల వరకు పిల్లలకు ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత మొదటిసారి బయోమెట్రిక్ అప్డేట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.. పూర్తిగా ఉచితం. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మిగిలిన మార్పులు/చేర్పులకు కేంద్రం నిర్ణయించిన నామమాత్రంగా ఫీజులు వసూలు చేస్తారు. వెంటనే తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లల ఆధార్ కార్డుల్ని అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
గతేడాది అక్టోబర్ నుంచి ఈ స్పెషల్ ఆధార్ క్యాంపుల్ని నిర్వహిస్తోంది. ప్రతి నెలలో రెండు విడతలుగా క్యాంపులు ఏర్పాటు చేసినా సరే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల ఆధార్ కార్డుల్ని అప్డేట్ చేయడం లేదు.. అందుకే ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. ఒకవేళ ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలతో పాటుగా మరికొన్ని కీలక విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. అందుకే వెంటనే పిల్లల ఆధార్‌లను అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో కూడా ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్లకు సంబంధించిన వివరాలను , ఎంఈవోలను సంప్రదించి తెలుసుకోవచ్చు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యార్థులు ఆధార్‌ను అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లే పని లేకుండా స్కూల్స్, కాలేజీల్లోనే ఏర్పాట్లు చేశారు.
