Site icon HashtagU Telugu

Good News For Alcohol Lovers : మద్యం ప్రియులకు మంత్రి కొల్లు రవీంద్ర గుడ్ న్యూస్

Kollu

Kollu

ఏపీలో మద్యం ప్రియులకు (Good News For Alcohol Lovers) ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లు అందజేస్తుంది. ఇప్పటీకే నాణ్యమైన మద్యాన్ని , అనేక బ్రాండ్స్ ను అందుబాటులోకి తీసుకరావడమే కాదు రూ.99 లకే క్వాటర్ మద్యాన్ని అందించి సంతోష పెట్టింది. ఇక ఇప్పుడు మరో తీపి కబురు ను మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అందించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. మద్యం రేట్ల తగ్గింపుపై కమిటీని ఏర్పాటు చేశారని, త్వరలోనే వినియోగదారులకు తక్కువ ధరల్లో నాణ్యమైన మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టడంపై కూడా పని జరుగుతోందని , అంతేకాక, మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ కూడా అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఇక పబ్ లలో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Read Also : Harish Rao : ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ కు 100 సీట్లు గ్యారెంటీ – హరీష్ రావు