Site icon HashtagU Telugu

Gannavaram : చంద్ర‌బాబు జాత‌కమే అంత.!న‌మ్మ‌క‌ద్రోహులుగా కొడాలి,వ‌ల్ల‌భ‌నేని!!

Gannavaram

Gannavaram

తిన్నంటి వాసాలు లెక్క‌పెట్ట‌డం అనే సామెత‌ వంశీ, కొడాలి(Gannavaram) లాంటి వాళ్ల‌ను చూసి వ‌చ్చిన‌ట్టు ఉంది. `చంద్ర‌బాబు(CBN) చరిత్ర తనకు, కొడాలి నానికి తెలుసు` అంటూ వంశీ తాజాగా చేసిన కామెంట్‌. నిజ‌మే, పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రుల సంగ‌తి త‌ల్లిదండ్రుల సంగ‌తి పిల్ల‌ల‌కు తెలియ‌కుండా ఉంటుందా? ఇదీ అంతే. స్థిర‌ప‌డిన త‌రువాత‌ పేరెంట్స్ ను భూ స్థాపితం చేయాల‌నుకునే పిల్ల‌ల్ని ఏమంటారో సంప్ర‌దాయ కుటుంబాల‌ను అడిగితే చెబుతారు. సరిగ్గా ఇదే చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌స్థానంలో జ‌రిగింది. అనామ‌కులుగా ఉండే కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు, వ‌ల్ల‌భ‌నేని వంశీల‌ను ఆయ‌న చేర‌దీశారు. అప్ప‌టి వ‌ర‌కు గుడివాడ‌, గ‌న్న‌వ‌రం టీడీపీకి పెద్ద మ‌నుషులుగా ఉండే నాయ‌కుల‌ను కాద‌ని కొడాలి, వ‌ల్ల‌భ‌నేనికి టిక్కెట్లు ఇచ్చారు. ఆనాడే టీడీపీలోని సంప్రదాయ వ‌ర్గం వ్య‌తిరేకించింది. కానీ, స్వ‌ర్గీయ హ‌రికృష్ణ ఒత్తిడి మేర‌కు వాళ్ల‌కు చంద్ర‌బాబు టిక్కెట్ల ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. అదే ఆయ‌న చేసిన త‌ప్పు.

తిన్నంటి వాసాలు లెక్క‌పెట్ట‌డం అనే సామెత‌ వంశీ, కొడాలి(Gannavaram)

జూనియ‌ర్ ఎన్టీఆర్ నీడ‌న వెంక‌టేశ్వ‌ర‌రావు రాజ‌కీయంగా ఎదిగారు. స్వ‌ర్గీయ ప‌రిటాల ర‌వి పేరు చెప్పుకుంటూ వ‌ల్ల‌భ‌నేని(Gannavaram) వంశీ ఆర్థికంగా స్థిర‌ప‌డ్డారు. వాళ్లిద్ద‌రి జీవ‌నం, పోక‌డ‌ల‌ను కృష్ణా జిల్లాలోని ఎవ‌ర్ని అడిగినా చెబుతారు. గ‌త మూడున్న‌రేళ్లుగా టీడీపీ ఎమ్మెల్యేగా వ‌ల్ల‌భ‌నేని ఉన్నారు. ఆయ‌న చంద్ర‌బాబు క‌ష్టం, ఇమేజ్, సానుభూతితో ఎమ్మెల్యేగా గెలుస్తూ వ‌చ్చారు. మూడున్న‌రేళ్లుగా నోటికొచ్చిన‌ట్టు చంద్ర‌బాబును(CBN) తిడుతూ ఎమ్మెల్యే ప‌ద‌విని అనుభ‌విస్తున్నారు. నికార్సైయిన కృష్ణా జిల్లా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్లు దాదాపుగా ఇలా చేయ‌ర‌ని ఆ వ‌ర్గంలోని కొంద‌రు చెప్పుకుంటారు.

Also Read : CBN : ఇప్పుడు సీఎంగా చంద్ర‌బాబు ఉంటే.!`గ‌న్న‌వ‌రం` ఎపిసోడ్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌!

ఇక మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని దాదాపు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి దూరం అయ్యారు. కేవ‌లం గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఛీ కొట్టేలా నోరు పారేసుకుంటున్నారు. మంత్రి హోదా, సామాజిక వ‌ర్గం హుందాత‌నం కూడా మ‌రిచిపోయి బూతుపురాణం వినిపించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. పైగా ఏనాడూ ఆయ‌న ప‌శ్చాత్త‌పం చెందిన దాఖ‌లాలు లేవు. చంద్ర‌బాబు (CBN)భిక్ష‌తో రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌రువాత వైసీపీకి మారిన ఆయ‌న చంద్ర‌బాబును బూతులు తిట్ట‌డ‌మే మంత్రి ప‌ద‌వి ల‌క్ష్యం అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.

చంద్ర‌బాబు మోచేతినీళ్లు తాగిన వాళ్లు ఆయ‌న‌కే శ‌త్రువుగా..

రాజ‌కీయ ఓన‌మాలు నేర్చుకునే తొలి రోజుల్లో అక్కా అంటూ లేనిఅప్యాయ‌త‌ను రంగ‌రించి భువ‌నేశ్వ‌రిని దేవ‌త‌లా చూసిన కొడాలి, వ‌ల్ల‌భ‌నేని ఆమె శీలాన్ని శంకించేలా పీల‌ర్స్ వ‌దిలారు. ఇప్పుడు చంద్ర‌బాబు(CBN) చ‌రిత్ర అంతా తెలుసు అంటూ హూంక‌రిస్తున్నారు. శ‌త్రువునైనా క్ష‌మించొచ్చుగానీ, న‌మ్మ‌క‌ద్రోహుల‌ను,తిన్నింటి వాసాల‌ను లెక్కించే వాళ్ల అంతం చూడాల‌ని చాణ‌క్యుని నీతి. కానీ, చంద్ర‌బాబు భోళాశంక‌రుడో, ఉదార‌వాదో, భ‌య‌స్తుడో, ప్ర‌జాస్వామ్య‌వాదో తెలియ‌దుగానీ అలాంటి వాళ్ల‌ను కూడా తేలిగ్గా క్ష‌మించేస్తారు. ఇదేనేమో కొడాలి, వ‌ల్ల‌భ‌నేనికి(Gannavaram) చంద్ర‌బాబునాయుడు గురించి తెలిసిన అంశం. బ‌హుశా అందుకే, ఇష్టానుసారంగా చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబం మీద లేనిపోని అపోహ‌లు, అనుమానాల‌ను రేకెత్తిస్తున్నారు. 40ఏళ్ల రాజ‌కీయ ప్ర‌యాణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో స‌హా ప‌లువురు చంద్ర‌బాబు మోచేతినీళ్లు తాగిన వాళ్లు ఆయ‌న‌కే శ‌త్రువుగా మారారు. ఆయ‌న రాజ్య‌స‌భ కు పంపిన వాళ్లు ఒక‌రిద్ద‌రి మిన‌హా ఎవ‌రూ పార్టీకి అండగా నిలువ‌క‌పోగా వ్య‌తిరేకంగా ప‌నిచేశారు. బ‌హుశా చంద్ర‌బాబు జాతకం అంతేనేమో.

సంక‌ల్ప సిద్ధి కేసుపై పోరాడుతోన్న టీడీపీ

రాజ‌కీయ భిక్ష‌పెట్టిన తండ్రిలాంటి చంద్ర‌బాబు(CBN) వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రజల కంటే ఎక్కువగా మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకుంటాడని, చంద్రబాబు చేయగలిగిన ఏకైక పని గుడ్డకాల్చి ముఖంపై వేయడమేనని, అందులో ఆయన సిద్ధహస్తుడని విమర్శించారు. వాస్త‌వంగా `సంక‌ల్పసిద్ధి` ప్రాజెక్టు ద్వారా కోట్లాది రూపాయాల దుర్వినియోగం జ‌రిగింది. ఆ సంస్థ నిర్వాహ‌కులు కొడాలి, వ‌ల్ల‌భ‌నేని స‌న్నిహితుల‌ని అంద‌రికీ తెలుసు. క‌రోనా టైమ్ లో చైన్ స్కీమ్ ల‌ను ర‌చించిన కొడాలి, వ‌ల్ల‌భ‌నేని అనుచ‌రులు వేల కోట్ల‌ను సామాన్యుల నుంచి దోచుకున్నారు. అందుకు సంబంధించిన ఆధారాల‌ను కూడా టీడీపీ బ‌య‌ట‌పెట్టింది. బాధితుల‌ను ఆదుకోవాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేసింది. కానీ, పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఆ కేసు ద‌ర్యాప్తు చేయ‌లేదు.

Also Read : TDP vs YCP : గ‌న్న‌వ‌రంలో మ‌రోసారి ఉద్రిక్త‌త‌.. మ‌రో కారుని త‌గ‌ల‌బెట్టిన వైసీపీ నేత‌లు

సంక‌ల్ప సిద్ధి కేసుపై పోరాడుతోన్న టీడీపీ నేత‌ల‌ను భ‌య‌కంపితుల‌ను చేస్తూ పార్టీ ఆఫీస్ మీద విధ్వంసం జ‌రిగింది. అక్క‌డున్న కార్లు, ఫ‌ర్నిచ‌ర్ అంతా త‌గుల‌పెట్టారు. సంక‌ల్ప సిద్ధి ద్వారా కొడాలి, వ‌ల్ల‌భ‌నేని(Gannavaram) అనుచ‌రులు చేసిన మోసాల‌ను బ‌య‌ట‌కు తీసిన టీడీపీ నేత ప‌ట్టాభిని టార్గెట్ చేశారు. ఆయ‌న మీద కేసుల‌ను న‌మోదు చేసిన పోలీసులు దాడుల‌పై మాత్రం కేసు క‌ట్ట‌క‌పోవ‌డం విచిత్రం. గ‌తంలోనూ టీడీపీ సెంట్ర‌ల్ ఆఫీస్ మీద ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అనుచ‌రులు దాడి చేసిన భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించారు. అప్పుడు కూడా దాడి చేసిన వాళ్ల మీద కేసులు న‌మోదు చేయ‌లేదు. సీన్ క‌ట్ చేస్తే, ఆ దాడికి ప్ర‌తిఫ‌లంగా జోగి రమేష్ కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 3.0 క్యాబినెట్ లో స్థానం పొంద‌డానికి గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యాన్ని కొడాలి, వ‌ల్ల‌భ‌నేని చేసిన ధ్వంస ర‌చ‌న‌గా టీడీపీ ఆరోపిస్తోంది. ఇలా తెగ‌బ‌డిన వాళ్లిద్ద‌ర్నీ గ‌ట్టు త‌ప్పిన పిల్లలు అనాలా? న‌మ్మ‌క ద్రోహులు అనాలా? విశ్వాస‌ఘ‌త‌కులు అనాలా? మీరే తేల్చండి!