Free Gas Cylinders Scheme : ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) గుడ్ న్యూస్ తెలిపారు. దీపావళి (Diwali) కానుకగా ఉచిత గ్యాస్ (Free Gas Cylinders Scheme) అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 98 రోజులు అవుతుంది. ఈ నెల 20 తో 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే సూపర్ సిక్స్ లో భాగంగా సర్కార్ పలు హామీలను నెరవేర్చి ప్రజల్లో నమ్మకం నిలుపుకుంది. మిగతా హామీలను కూడా నెరవేర్చే పనిలో ఉంది. ఈ క్రమంలో ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సందర్బంగా ఆయన (Chandrababu) మాట్లాడుతూ..సూపర్ 6లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తానని స్పష్టం చేశారు. ‘వరదల్లో ప్రజలు పడిన కష్టాలు చూసి నేను చలించిపోయాను. పది రోజులపాటు అక్కడ ఉండి సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత వెళ్ళాను. ప్రపంచవ్యాప్తంగా వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు . సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సర్వశక్తులు ఓడ్డాం. వరదల్లో నష్టపోయిన వారందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. వరదల్లో దెబ్బతిన్న వారికి 45 ఏళ్లలో నేనెప్పుడూ ఇంత ప్యాకేజీ ఇవ్వలేదు. పంటలకు హెక్టార్‌కు రూ.25 వేలు ఇస్తున్నాం. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం.
జగన్ పాలనలో తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దేవుడి ప్రసాదం (Tirumala Laddu) అపవిత్రం చేసేలా నాసిరకం పదార్థాలు వాడారని మండిపడ్డారు. గతంలో తిరుమల లడ్డూ నాణ్యత సరిగా లేదని వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదానంలో కూడా నాణ్యత పాటించలేదని అన్నారు. దేవుడి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యి వాడాలని ఆదేశించినట్లు వివరించారు. ప్రస్తుతం ప్రసాదం నాణ్యత పెరిగిందని స్వామివారి పవిత్రతను కాపాడుకోవాల్సి బాధ్యత ఉందని సీఎం చంద్రబాబు వివరించారు.
Read Also : Telangana Flood Relief Fund : వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్‌కు భారీ విరాళాలు..