YS Jagan Convoy : మాజీ సీఎం వైఎస్ జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్  కాన్వాయ్‌‌కు తృటిలో ప్రమాదం తప్పింది.

Published By: HashtagU Telugu Desk
Ys Jagan Convoy

YS Jagan Convoy : వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్  కాన్వాయ్‌‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం పులివెందులకు జగన్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  వైఎస్ జగన్  గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు ఆయన  వెళ్తుండగా, కాన్వాయ్‌లో ప్రమాదం సంభవించింది. రామరాజుపల్లి సమీపంలో వైఎస్‌ జగన్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో జగన్ కాన్వాయ్‌ను అకస్మాత్తుగా ఆపాల్సి వచ్చింది.  ఈ సమయంలో కాన్వాయ్‌లోని ఓ ఇన్నోవా వాహనాన్ని ఫైరింజన్ అదుపు తప్పి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో(YS Jagan Convoy) ఎవరికైనా గాయాలయ్యాయా ? లేదా ? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join

సొంత నియోజకవర్గం పులివెందులలోనే మూడు రోజుల పాటు జగన్ ఉండబోతున్నారు. పర్యటనలో భాగంగా జగన్ ఇడుపుల పాయలో వైఎస్సార్ ఘాట్‌ను సందర్శిస్తారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పిస్తారు. ఈసందర్భంగా  ఇడుపులపాయలో  రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో జగన్ భేటీ అవుతారు. కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు ఆయనను కలుసుకుంటారు.

Also Read :Amarnath Yatra : గుడ్ న్యూస్.. జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్సార్ సీపీ మూడు నియోజకవర్గాలకే  పరిమితమైంది. పులివెందుల, బద్వేలు, రాజంపేటల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన చోట్ల ఓడిపోయింది. ఈ ఓటమికి గల కారణాలను జగన్ ఆరా తీయనున్నారు. సొంత నియోజకవర్గం, సొంత జిల్లా నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా వైఎస్ జగన్ నిర్ణయాలను తీసుకోనున్నారు. కాగా,  శుక్రవారం రోజు అసెంబ్లీకి హాజరైన జగన్  ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు హాజరుకాలేదు. ఈరోజు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఆయన్నపాత్రుడు బాధ్యతలు చేపట్టారు.

  Last Updated: 22 Jun 2024, 02:58 PM IST