Site icon HashtagU Telugu

Facebook Harashment : సెల్ఫీ వీడియో తీసుకుని యువతి సూసైడ్..!!

Sucide Imresizer

Sucide Imresizer

సోషల్ మీడియాలో అమ్మాయిలను ట్రాప్ చేస్తూ..వేధించడం సాధారణ అయ్యింది. ముఖ్యంగా ఫేస్ బుక్ లో అమ్మాయిలను పరిచయం చేసుకోని వారితో స్నేహం చేస్తున్నట్లు నమ్మించడం..వలలోకి దించడం…ఆ తర్వాత అడిగింది చేయకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు కొంతమంది యువకులు. అలాంటి వేధింపులకు ఓ యువతి తట్టుకోలేక సుసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని సత్య సాయి జిల్లాలో జరిగింది.

తనకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఉరివేసుకుని బలవన్మారణానికి పాల్పడింది. నల్లచెరువకు చెందిన యువకుడు ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. తర్వాత వేధింపులకు గురిచేసాడు. తన చావుకు అతనే కారణమంటూ యువతి సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఈ విషయం తెలిసి తన పేరెంట్స్ బాధపడతారని చెప్పింది. అనంతరం ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ కు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.