Site icon HashtagU Telugu

TDP : ద్వారంపూడి దోచుకున్నదంతా నయా పైసాతో సహా కక్కిస్తాం : మాజీ మంత్రి కే.ఎస్ జవహార్

Jawahar Imresizer

Jawahar Imresizer

తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న పెడిగ్రీ ని తిని ద్వారంపూడి లాంటి వారు మొరుగుతున్నారని మాజీ మంత్రి కె.ఎస్. జ‌వ‌హ‌ర్ అన్నారు. లోకేష్ వేసే ప్రతి అడుగు, చెప్పే ప్రతి మాట వైసీపీ పాలకుల గుండెల్లో తుపాకి తూటాల్లా దిగుతున్నాయని.. యువత భవిష్యత్తుకై ప్రజల మధ్యకు యువనేత వచ్చారని జ‌వ‌హ‌ర్ అన్నారు. యువగళం యాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారని.. అది చూసి ఓర్వలేని జగన్ రెడ్డి తన పెంపుడు ఎమ్మెల్యేలు, మంత్రులకు స్క్రిప్ట్ రాసి వాళ్ల చేత మొరిగిస్తున్నారిన మండిప‌డ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేతకాక అప్పుల ఊబిలోకి నెట్టి చివరకు గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆయ‌న ఆరోపించారు. కోడి కత్తి డ్రామాలు, గొడ్డలి వేట్లు, దొంగ దారుల్లో అధికారం దక్కించుకునే సంస్కారం వైసీపీలోనే ఉందని.. నమ్మిన ప్రజలను మోసం చేయటం వైసీపీ నైజమ‌న్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా, ధర్మ మార్గంలో చట్ట సభలకు వెళ్తారు తప్ప.. దొడ్డి దారిన కాద‌న్నారు. \ వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ మొదలైందని.. వైసీపీ దుకాణం సర్దుకునే సమయం దగ్గర పడింద‌న్నారు. ద్వారంపూడి లాంటి వారు దొడ్డి దారిన దారుణంగా సంపాదించి ఏ దొడ్డిలో ఎంత దాచిపెట్టారో.. అధికారంలోకి రాగానే బయటపెడతామ‌ని..అలాంటి వారిని తప్పకుండా వారిని శిక్షిస్తామ‌ని హెచ్చ‌రించారు.

Also Read:  Telangana CM: సీఎం సాబ్ తో తీన్మార్ మల్లన్న