Site icon HashtagU Telugu

Duvvada Srinivas : కత్తి పట్టిన దువ్వాడ శ్రీనివాస్

Duvvada Video

Duvvada Video

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఈ మధ్య సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాడు. నేతగా ప్రజలకు సేవ చేసి వార్తల్లో నిల్చింది లేదు కానీ దివ్వెల మాధురి (MAdhuri) కి అన్ని సేవలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. కట్టుకున్న భార్య , పిల్లలను వదిలేసి..దివ్వెల మాధురి తో సహజీవనం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.

మొన్నటికి మొన్న దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మాధురి చేసిన బర్త్‌డే వేడుకలు ఆయన్ను వార్తల్లో హైలైట్ చేయగా..తాజాగా దువ్వాడ కు సంబదించిన ఓ వీడియో మాత్రం ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో లో శ్రీనివాస్ కత్తి పట్టుకొని హీరో మాదిరి తెగనరుకుతూ కనిపించాడు. మరి శ్రీనివాస్ హీరోగా ఏదైనా సినిమా చేస్తున్నాడా..? లేక ఏదైనా షార్ట్ ఫిలిం చేస్తున్నారా..? అనేది తెలియదు కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : Telangana Spice Kitchen Restaurant : తెలంగాణ స్పైస్ కిచెన్ హోటల్‌లో భారీ పేలుడు