Minister Narayana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారు అని మంత్రి నారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా.. పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. అమరావతిపై లాంగ్ విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని పేర్కొన్నారు. అమరావతికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలి అని తేల్చి చెప్పారు.
Read Also: CM Revanth Reddy : పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన
ఎయిర్‌పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభం అయ్యాయి. భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహలు వద్దు. ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తాం. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుంది అని నారాయణ తెలిపారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలి. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. భూ సేకరణ జరిగితే రైతులు నష్టపోతారు అని నారాయణ తెలిపారు. దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం.. అలాగే, భూములు ఇచ్చిన వారి ల్యాండ్ రేట్ పడిపోతుందని ఒక సందేహం రైతులకు ఇవ్వొద్దు.. ఒక ఏడాది లోపే ఉద్యోగుల భవనాలు, ట్రంక్ రోడ్లు పూర్తి అవుతాయని తేల్చి చెప్పారు.
Read Also: Justice BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్.. నేపథ్యమిదీ
