Skill Development Scam : చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం – డీజీ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్

జీఎస్టీ స్కాం జరిగిందన్నది అబద్ధమని, సీఐడీ అధికారులు అసలు తమ వద్దకు విచారణకే రాలేదని డీజీ టెక్ కంపెనీ (DG Tech Company) ఎండీ ఖాన్ విల్కర్ తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
DG Tech Company MD Khanwilkar on Chandrababu Arrest

DG Tech Company MD Khanwilkar on Chandrababu Arrest

ఏపీ స్కిల్ డెవలప్‍ మెంట్ లో స్కామ్ (Skill Development Scam) జరిగిందని.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu Arrest) వందల కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన్ను CBI అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అనేది దురదృష్టకరం అంటూ యావత్ తెలుగు ప్రజలు అంటూ తమ నిరసనను తెలుపుతున్నారు. తాజాగా డీజీ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ (DG Tech Company MD Khanwilkar) దీనిపై స్పందించారు.

ఏపీ స్కిల్ డెవలప్‍ మెంట్ కార్పొరేషన్‍తో ఒప్పందంలో ఎలాంటి స్కాం లేదని, స్కాం జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం అన్నారు డీజీ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్. జీఎస్టీ స్కాం జరిగిందన్నది అబద్ధమని, సీఐడీ అధికారులు అసలు తమ వద్దకు విచారణకే రాలేదని ఖాన్ విల్కర్ తెలిపి షాక్ ఇచ్చారు. తమ వద్దకు వస్తే అన్ని లెక్కలూ చూపిస్తామని తెలుపుతామన్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఓ వీడియో విడుదల చేసారు. ఏపీ స్కిల్ డెవలప్‍ మెంట్ లో స్కామ్ జరిగిందని..టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమన్న ఖాన్.. మొత్తం 371 కోట్ల రూపాయల సామాగ్రి సరఫరా చేశామని వెల్లడించారు.

డీజీ టెక్ కంపెనీ సీఈఓ ఖాన్ (DG Tech Company MD Khanwilkar) ఏమన్నారంటే..

ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రూ.371 కోట్ల విలువైన మొత్తం సామగ్రి సరఫరా చేశాం. సరఫరా చేసిన మొత్తం ఎక్విప్‍మెంట్‍కు సంబంధించిన డేటాను, వీడియోలో వివరించారు. పరికరాలు నాసిరకంగా ఉన్నా, రిపేరుకు వచ్చినా పూచీ తీసుకున్నామని, దానిపై ఒప్పందం ఉందని చెప్పుకొచ్చారు. జీఎస్టీ స్కాం ఉందన్న ఆరోపణలు నిజం కాదు . ఏపీ దర్యాప్తు సంస్థలు ఈ స్కామ్‍కు సంబంధించి, తమతో సంప్రదించలేదు. ఆడిటర్లను పంపితే పూర్తి లెక్కలు చూపిస్తామన్నారు.

Read Also : Chandrababu : సోమవారం వరకు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దు : హైకోర్టు

  Last Updated: 13 Sep 2023, 12:29 PM IST