Site icon HashtagU Telugu

Nitish Reddy : వీడియో వైరల్.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన క్రికెటర్‌ నితీశ్ రెడ్డి

Cricketer Nitish Reddy In Tirumala Nitish Kumar Reddy Video Viral

Nitish Reddy : భారత క్రికెట్‌లో సెన్సేషన్‌గా మారిన యువతేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డి సంక్రాంతి వేళ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకున్నాడు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈక్రమంలో తన మొక్కు ప్రకారం మెట్లమార్గంలో వెళ్లి వేంకటేశ్వర స్వామివారిని నితీశ్ దర్శించుకున్నాడు. మోకాళ్ల పర్వతం వద్ద నితీశ్‌ మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్(Nitish Reddy) తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేశాడు.

Also Read :Crypto Scam In Telangana : రూ.100 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కాం.. కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ ఏం చేశాడంటే ?

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ‌లో నితీశ్ కుమార్ రెడ్డి  సత్తా చాటుకున్నాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్‌‌కు దిగిన నితీశ్ సెంచరీ కొట్టి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లలో అతడు 37.25 సగటుతో 298 రన్స్ చేశాడు. భారత జట్టు తరఫున అత్యధిక రన్స్ చేసిన రెండో ఆటగాడిగా మన నితీశ్  నిలిచాడు.

Also Read :Cockfights Race : బరి.. హోరాహోరీ.. ఏపీలో ఒక్కరోజే రూ.330 కోట్ల కోడిపందేలు

నితీశ్ గురించి ఇర్ఫాన్ పఠాన్ ఏమన్నాడంటే..

నితీశ్‌ రెడ్డిపై ఇటీవలే ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.  ‘‘నితీశ్ రెడ్డి రూపంలో టీమిండియాకు ఎనిమిది లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేసే ఆల్‌రౌండర్‌ దొరికాడని అందరం సంతోషపడుతున్నాం. ఒకవేళ ఆరో స్థానంలో గనుక అతడిని పంపితే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి. అతడికి ఆ సత్తా ఉంది. టీమిండియా విధ్వంసకర ఆటగాడిగా నితీశ్ ఎదగగలడు. భారత పేస్‌ బౌలర్ల దళంలో ఐదో బౌలర్‌గానూ నితీశ్‌ రెడ్డి రాణించగలడు. బౌలింగ్‌ నైపుణ్యాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే.. ఐదో బౌలర్‌గా అతడు అందుబాటులో ఉండగలడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.