CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితునిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.
Read Also: Vijay : హీరో విజయ్‌కి వై ప్లస్ కేటగిరీ భద్రత
మరోవైపు ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించి అండగా నిలుస్తామని తెలిపారు. యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. యాసిడ్ బాధితురాలి తండ్రి జనార్ధన్‌కు మంత్రి లోకేష్ ఫోన్ చేశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తాం. ఆమెను నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తా. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం. అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. అధైర్య పడొద్దు, మీ వెంట నేనున్నాను అని మంత్రి భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
కాగా, ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లె గ్రామానికి చెందిన యువతిపై ఈ దాడి జరిగింది. బ్యూటిషియన్‌గా చేస్తున్న గౌతమి అనే యువతిపై గౌతమ్ యాసిడ్‌తో దాడి చేశాడు. ముందుగా యువతికి బలవంతంగా యాసిడ్ తాగించిన ప్రేమోన్మాది.. ఆపై ఆమె మొహంపై యాసిడ్ పోశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని మదనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు బెంగూరుకు తరలిస్తున్నారు. ఇక, యువతిపై యాసిడ్ దాడి చేసిన యువకుడు ప్రీప్లాన్డ్‌గా పురుగులు మందు తాగి మదనపల్లి ఆస్పత్రికిలో చేరాడు. దీంతో నిందితుడు తప్పించుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.