హైదరాబాద్ (Hyderabad)లో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. పెద్ద అంబర్‌పేట్‌లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు మామ వరుస అయ్యే బండారు మహేష్ ఈనెల 23న ఈ దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గురజాలలో బాలికపై అత్యాచారయత్నం
మరోవైపు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసానుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేయగా బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు బాలికపై అత్యాచారయత్నం చేశాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Bansuwada: బాన్సువాడలో విషాదం.. చిన్నారులను కెనాల్‌లో పడేసిన తల్లి