Chandrababu About Pawan Kalyan Leadership : సీఎం చంద్రబాబు (Chandrababu) మరోసారి జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) ఫై ప్రశంసలు జల్లు కురిపించారు. పవన్ కల్యాణ్ నిజమైన పోరాట యోధుడని.. తనను అరెస్టు చేసినప్పుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి వస్తుంటే జగన్ విమానాన్ని క్యాన్సిల్ చేశారని అయినాగానీ రోడ్ మార్గం ద్వారా వచ్చారని…నందిగామలో పవన్ కల్యాణ్ రాకుండా రోడ్డును మూసేస్తే మీద పడుకున్నారని కొనియాడారు. ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి (BJP) ప్రభుత్వం రాకపోతే వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడటం కష్టమయ్యేదని అన్నారు. ఈరోజు కేంద్రంలో బిజెపి , రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రజలు గుండెలపై చేయి వేసుకొని నిద్రపోతున్నారన్నారు. టీడీపీ జనసేన , బిజెపి మూడు పార్టీలు ఎన్నికల సమయంలో ఎటువంటి గ్యాప్ లేకుండా పని చేశాయన్నారు. పురందేశ్వరి పొత్తుకు అనేక విధాలుగా కృషి చేశారని వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అన్నారు. తనను అరెస్టు చేసినప్పుడు పవన్.. హైదరాబాద్ నుంచి వస్తుంటే జగన్ విమానాన్ని క్యాన్సిల్ చేశారని, విమానం లేకపోయినా పవన్ బై రోడ్డు వచ్చారని గుర్తు చేశారు. నందిగామలో పవన్ కల్యాణ్ రాకుండా రోడ్డును మూసేస్తే మీద పడుకున్నారని కొనియాడారు. పవన్ కల్యాణ్ నిజమైన పోరాట యోధుడని అభినందించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు ఒక ఆశయం కోసం వచ్చారని , ప్రజలు గెలవాలి రాష్ట్రం పునర్నిర్మాణం కావాలని పవన్ కల్యాణ్ కోరాడని గుర్తు చేశారు. వరద సహాయార్ధం పవన్ కల్యాణ్ రూ.6 కోట్లు విరాళం ఇచ్చారని సీఎం కొనియాడారు.
అంతకు ముందు పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు ఫై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు హయాంలో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని..కేవలం 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని , ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ హామీ ఇచ్చినట్లు పింఛన్లను పెంచి చూపించామని వెల్లడించారు. చంద్రబాబు దార్శనికుడు, అనునిత్యం ఆశ్యర్యపరుస్తూ, ఆయనకు ఉన్న జ్ఞానాన్ని, ఓపికని చూసి ఆశ్చర్యం కలుగుతుందని కొనియాడారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కావు. జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేది..కానీ ప్రస్తుతం ఒకటో తేదీనే అకౌంట్లలోకి జీతం పడుతుందని గుర్తు చేసారు. అలాగే నిర్జీవమవుతున్న పంచాయతీలకు సీఎం రూ.1,452 కోట్లు ఇచ్చి జీవం పోశారన్నారు. అన్న క్యాంటీన్ల వల్ల పేదలు, కార్మికులకు ఎంతో లాభం జరుగుతుందని , ఎంతో మంది కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లను ఎలా మూసివేయాలనిపించిందని గత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేయాలని చాలామంది సూచించారు, ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను రక్షించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాజమండ్రి జైల్లో చంద్రబాబు ను కలిసినప్పుడు ఆయన గుండె ధైర్యాన్ని చూశా. బాబులో ఆత్మస్థైర్యం ఏనాడూ దెబ్బతినలేదు. పాలన ఎలా ఉండాలో బాబు పక్కనే ఉండి నేర్చుకోవాలనుకున్నా. జైల్లో ఉన్నప్పుడు నేను సినిమా షూటింగులకు కూడా వెళ్లలేదు. షూటింగ్‌కు రావాలని ప్రొడ్యూసర్లు అడిగినా నేను రానని చెప్పా నని పవన్ గుర్తు చేసారు. ఇలా ఒకరిపైఒకరు ప్రశంసలు , అభినందనలు తెలుపుకోవడం ఫై ఇరు పార్టీల శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Telangana Flood Relief Fund : వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్‌కు భారీ విరాళాలు..