ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రిమండలి సమావేశంలో మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైసీపీ తప్పుడు ప్రచారాలపై తక్షణ స్పందన ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసినా, దానిపై స్పందించేందుకు ఆలస్యం చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. గతంలో రాజకీయాలు సబ్జెక్టు ప్రకారం సాగేవని, ఇప్పుడు మాత్రం వ్యక్తిగత విమర్శలతో నిండిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి స్థాయిలోనే సత్వర కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
Virat Kohli: రిటైర్మెంట్‌కు కారణం చెప్పిన విరాట్ కోహ్లీ!
ఇంతకుముందు కేబినెట్ సమావేశాల్లోనూ చంద్రబాబు కొన్ని మంత్రుల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు ప్రోటోకాల్ పాటించకపోవడం, పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. “ఎన్నిసార్లు చెప్పినా ప్రవర్తనలో మార్పు రాకపోతే, వారి స్థానంలో ఇతరులను తీసుకుంటాం” అని స్పష్టం చేశారు. గతంలో 1995లోని తన రాజకీయ శైలిని గుర్తు చేస్తూ, ఇకపై మెత్తగా ఉండే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Health Tips : మీకు నెయ్యితో రోటీ, చపాతీ తినే అలవాటు ఉందా? దీనివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి?
కేబినెట్‌లో మరో ముఖ్యాంశం ఏమిటంటే .. రాష్ట్రంపై కుట్రలు జరుగుతున్న విషయమూ చర్చకు వచ్చింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకారం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, అప్పులు తగ్గించేందుకు ప్రయత్నాలు జరగకుండా చేయడానికి దాదాపు 200 ఫేక్ ఈమెయిల్స్ పంపారని తెలిపారు. ఇవి జర్మనీలో ఉన్న ఓ వైసీపీ అనుచరుడు చేసిన పని అని గుర్తించారంటూ చంద్రబాబుకు వివరించారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి కుట్రలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, అలాగే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.