CBN Vision Effect : చంద్ర‌బాబు విలువ తెలుస్తోంది.! ప్రపంచ వ్యాప్తంగా నిర‌స‌న‌!!

CBN Vision Effect :  `అందుబాటులో ఉండేది ఏదైనా లోకువ..` అని పెద్ద‌ల నానుడి. దాన్ని చంద్ర‌బాబుకు వ‌ర్తింప చేస్తే స‌రిపోయేలా ఉంది.

  • Written By:
  • Updated On - September 16, 2023 / 03:41 PM IST

CBN Vision Effect :  `అందుబాటులో ఉండేది ఏదైనా లోకువ..` అని పెద్ద‌ల నానుడి. దాన్ని చంద్ర‌బాబుకు వ‌ర్తింప చేస్తే స‌రిపోయేలా ఉంది. ఏపీ జ‌నం కంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్లు ఆయ‌న అరెస్ట్ , జైలుకు పంప‌డాన్ని ఖండిస్తున్నారు. రోడ్ల మీద‌కు వ‌స్తున్నారు. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల‌ని త‌ప‌న ప‌డుతున్నారు. ఉన్న‌త విద్యావంతులు, మేధావులు, త‌ట‌స్తులు ఇప్పుడు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఏపీలోని ప‌రిస్థితుల‌పై ఆందోళ‌న చెందుతున్నారు. హైద‌రాబాద్, బెంగుళూరు, చెన్నై త‌దిత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల‌తో పాటు విదేశాల్లోనూ తెలుగు వాళ్లు చంద్ర‌బాబును జైలుకు పంప‌డాన్ని నిర‌సిస్తున్నారు. వీకెండ్ నిర‌స‌న తారాస్థాయికి చేరింది.

చంద్ర‌బాబు కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా టెక్కీల నిర‌స‌న‌ (CBN Vision Effect)

ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఆయ‌న ప్రోత్స‌హించిన ఐటీ రంగం యువ‌త‌కు పెద్ద ఎత్తున (CBN Vision Effect) ఉపాథి క‌ల్పించింది. భ‌విష్య‌త్ ను దృష్టిలో పెట్టుకుని ఐటీకి ప్రాధాన్యం ఇచ్చారు. హైటెక్ సిటీని నిర్మించిన హైటెక్ సిఎంగా రాజ‌కీయాల్లో వెనుక‌బ‌డ్డా, ఐటీ రంగం ఫ‌లితాల‌ను ముందుగా గుర్తించిన విజ‌న‌రీ చంద్ర‌బాబు. ఆయ‌న విజ‌న్ ఇస్తోన్న ఫ‌లితాల‌ను అనుభ‌విస్తోన్న ఐటీ రంగ నిపుణులు ఇప్పుడు కృత‌జ్ఞ‌తాభావాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. స్కిల్ గురించి తొలుత ప‌రిచ‌యం చేసిన చంద్ర‌బాబు విజ‌న్ బాగా తెలిసిన టెక్కీలు ఆయ‌న మ‌ద్ధ‌తుగా నిలుస్తున్నారు. మేమున్నాం..అంటూ ముందుకొస్తున్నారు. అక్ర‌మంగా జైలులో పెట్టిన చంద్ర‌బాబు విడుద‌ల కావాల‌ని కోరుకుంటున్నారు. మెట్రో పాలిటిన్ సిటీల్లో ఉండే టెక్కీలు చంద్ర‌బాబు సేవ‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆయ‌న్ను జైలుకు పంప‌డాన్ని నిర‌సిస్తూ ఆందోళ‌న బాట ప‌ట్టారు.

ఐటీ ఫ‌లితాల‌ను గుర్తించిన విజ‌న‌రీ చంద్ర‌బాబు

చంద్ర‌బాబు విజ‌న్ గురించి ప్ర‌శంసించ‌ని వాళ్లు లేరు. మంత్రి కేటీఆర్ కూడా చంద్ర‌బాబు విజ‌న్ ను విమ‌ర్శించ‌లేమ‌ని స‌మ్మిట్స్ లో చెబుతుంటారు. కానీ, రాజ‌కీయంగా విభేదిస్తామ‌ని ఆయ‌న అంటారు. ఎందుకంటే, చంద్ర‌బాబు ఎప్పుడూ ఫ‌క్తు రాజ‌కీయాల‌ను చేయ‌లేదు. ఎన్నిక‌ల‌ప్పుడే రాజ‌కీయాలంటూ అభివృద్ధి గురించి (CBN Vision Effect) త‌ప‌న ప‌డ్డారు. ఆయ‌న 1995 నుంచి 2004 వ‌ర‌కు సీఎంగా ఉమ్మ‌డి రాష్ట్రానికి ఉన్నారు. ఆ రోజుల్లో రాష్ట్ర వెనుక‌బాటుత‌నం ఎంత ఉండేదో, రికార్ట్ లు తిర‌గేస్తే తెలుస్తుంది. యువ‌త‌కు ఉపాథి క‌ల్పించే రంగం ఐటీగా అప్ప‌ట్లోనే ఆయ‌న గుర్తించారు. దాన్ని ప్రోత్స‌హిస్తూ వీలున్నంత టైమ్ కేటాయించారు. విజ‌న్ 2020 త‌యారు చేయ‌డం కార‌ణంగా ఎన్ని విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో వ‌చ్చిన‌ప్ప‌టికీ వెనుకాడ‌లేదు. ఆయ‌న త‌యారు చేయించిన విజ‌న్ ప్ర‌కారం ముందుకెళ్లారు. ఇప్పుడు ఆ ఫ‌లితాల‌ను తెలంగాణ రాష్ట్రం ప్ర‌త్య‌క్షంగా అనుభ‌విస్తోంది. ప‌రోక్షంగా ఏపీలోని యువ‌త ఉపాథి పొందుతోంది.

చంద్ర‌బాబు విజ‌న్ ను విమ‌ర్శించ‌లేమ‌ని 

ఒక వేళ ఐటీ రంగాన్ని ఆనాడు చంద్ర‌బాబు ప్రోత్స‌హించ‌లేద‌ని కొద్దిసేపు భావిస్తే, మ‌రో రాష్ట్రం ఆ అవ‌కాశాన్ని అందిపుచ్చుకునేది. అప్ప‌ట్లో క‌ర్ణాట‌క సీఎంగా ఉన్న ఎస్ ఎం కృష్ణ ఐటీ రంగాన్ని బాగా ప్రోత్స‌హించారు. ఆ రాష్ట్రం దూసుకెళుతోన్న టైమ్ లో దాన్ని మించిన ప్రోత్సాహ‌కాల‌ను ఇస్తూ ఐటీ కంపెనీల‌ను (CBN Vision Effect) చంద్ర‌బాబు తీసుకొచ్చారు. ఫ‌లితంగా ఆయ‌న సీఎంగా ఉన్న స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌ను దాటి ఐటీ ఎగుమ‌తుల్లో రికార్ట్ ను ఏపీ సృష్టించింది. దాని ఫ‌లిత‌మే, ఇప్పుడు ల‌క్ష‌లాది మందికి ఉపాథి ల‌భిస్తోంది. ఇంజ‌నీరింగ్ కాలేజిలు పెంచ‌డం, స్కిల్స్ ట్రైనింగ్ త‌దిత‌రాల‌న్నీ ఆనాడు చంద్ర‌బాబు ప‌రిచ‌యం చేసిన‌వే. అందుకే, వాటి ఫ‌లాల‌ను అనుభ‌విస్తోన్న టెక్కీలు ఇప్పుడు ఆయ‌నకు మ‌ద్ధ‌తు ఇస్తున్నారు.

ఔట‌ర్ రింగ్ రోడ్డు మీద కార్ల ర్యాలీకి టెక్కీలు (CBN Vision Effect)

తెలంగాణ ప్ర‌భుత్వం టెక్కీల  (CBN Vision Effect) నిర‌స‌న‌ల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఐటీ కంపెనీల‌తో ఆందోళ‌న‌కు దిగే ఉద్యోగుల‌కు నోటీసులు ఇప్పించే ప్ర‌య‌త్నం చేసింది. స్థానిక పోలీసుల‌తో వార్నింగ్ ఇప్పించే ప్ర‌య‌త్నం చేసింది. అయిన‌ప్ప‌టికీ వీకెండ్ లో ఔట‌ర్ రింగ్ రోడ్డు మీద కార్ల ర్యాలీకి టెక్కీలు పిలుపు ఇచ్చారు. పెద్ద ఎత్తున హైద‌రాబాద్ రింగ్ రోడ్డుకు కార్లు త‌ర‌లి రావ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. పోలీసుల త‌నిఖీలతో హడావుడి చేస్తూ టెక్కీల‌ను ఆపే ప్ర‌య‌త్నం చేశారు. ఇలాంటి ప‌రిస్థితి బెంగుళూరులోనూ నెల‌కొంది. ప్ర‌పంచ వ్యాప్తంగా చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా తెలుగు వాళ్లు ముందుకొస్తున్నారు. కానీ, ఏపీలోని జ‌నం మాత్రం తిర‌గ‌బ‌డేందుకు సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు.

Also Read : Sharmila in Congress : కాంగ్రెస్ లో ష‌ర్మిల చేరిక‌పై `బైబిల్` బ్రేక్?

ఇంటికో మ‌నిషి ముందుకొచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాల‌ని చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపు. అలా ఏపీలోని ప్ర‌జ‌లు ముందుకొస్తే, పోలీస్ సైతం ఆప‌లేరు. కానీ, అలాంటి తెగింపు ఏపీలోని ప్ర‌జ‌ల్లో లేక‌పోవ‌డంపై టీడీపీ అధ్య‌య‌నం చేస్తోంది. అందుబాటులో చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ క‌నిపిస్తారు. సుదూరంగా ఉండే వాళ్ల‌కు మాత్రం ఆయ‌న చేసిన అభివృద్ధి అపురూపంగా క‌నిపిస్తోంది. అందుకే, ఆయ‌న కోసం రోడ్ల మీద‌కు ప్ర‌పంచంలోని తెలుగు వాళ్లు వ‌స్తుంటే, ఏపీలోని ప్ర‌జ‌లు మాత్రం జ‌రుగుతున్న దాన్ని చూస్తున్నారు.