CBN strategy : జ‌గ‌న్ పై కేసీఆర్ `భూ` చ‌క్రాన్ని వ‌దిలిన‌ చంద్ర‌బాబు

కేసీఆర్ చేతిలోని అస్త్రాన్ని ఇప్పుడు చంద్ర‌బాబు (CBN strategy)సంధిస్తున్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్లోగ‌న్ మీద అస్త్రాన్ని విసురుతున్నారు.

  • Written By:
  • Updated On - June 30, 2023 / 12:24 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ చేతిలోని అస్త్రాన్ని ఇప్పుడు చంద్ర‌బాబు (CBN strategy)సంధిస్తున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్లోగ‌న్ మీద అస్త్రాన్ని విసురుతున్నారు. పేద‌ల ప్ర‌భుత్వం అంటూ ఊద‌ర‌గొడుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ పై భూముల ధ‌ర‌ల అంశాన్ని ఎక్కుపెడుతున్నారు. రాష్ట్రంలోని అభివృద్ధికి కొల‌మానంగా భూముల ధ‌ర‌ల‌ను కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణ‌లో ఒక ఎక‌రం అమ్ముకుంటే ఏపీలో వంద ఎక‌రాలు వ‌స్తుంద‌ని స్లోగ‌న్ అందుకున్నారు. దాన్నే ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద సూటిగా ప్ర‌యోగిస్తున్నారు చంద్ర‌బాబు.

కేసీఆర్ చేతిలోని అస్త్రాన్ని ఇప్పుడు చంద్ర‌బాబు (CBN strategy)

ప్ర‌తి వేదిక‌పై పేద‌ల‌కు, పెత్తందారుల‌కు మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల‌కు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వినిపిస్తున్నారు. మీడియా స‌హాయం, బీజేపీ అండ లేక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ఆశీస్సులు, దేవుని ద‌య‌తో మ‌ళ్లీ గెలుస్తాన‌ని చెబుతున్నారు. వాస్త‌వంగా జ‌గ‌న్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ధ‌నిక సీఎం. ఆ విషయాన్ని ఇటీవ‌ల అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇక ఆయ‌న క్యాబినెట్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తులు కోట్ల‌లోనే ఉన్నాయి. నాలుగేళ్లుగా ఇసుక‌, కంక‌ర‌, మ‌ట్టి, లిక్క‌ర్, భూముల సిండికేట్ల‌ను చూశాం. రాష్ట్రాన్ని దారుణంగా దోచుకున్నార‌ని  (CBN strategy) స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కే సీఎం

న‌వ‌ర‌త్నాల‌ను ఇస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కే సీఎంగా పేరుగాంచారు. అదే, పేద‌ల ప్రభుత్వ పాల‌న‌గా చెబుతున్నారు. కానీ, ఉపాథి చాలా మంది కోల్పోయారు. ఏపీలో వ‌ల‌స‌ల సంఖ్య పెరిగింది. పారిశ్రామిక ప్ర‌గ‌తి క‌నిపించ‌డంలేదు. అమ‌రావ‌తి ప్రాజెక్టు కుప్ప‌కూలింది. విశాఖ భూ దందాలు పెర‌గ‌డంతో కంపెనీలు రావ‌డానికి వెనుకాడుతున్నాయి. తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర‌స్వామి ప్ర‌పంచ ఆత్మాత్మిక కేంద్రంగా భాసిల్లాలి. కానీ, అక్క‌డ కూడా శ్రీవాణి ట్ర‌స్ట్ కుంభ‌కోణం వెలుగుచూసింది. ఇలా ప్ర‌గ‌తి కుంటుప‌డ‌డంతో ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. ఫ‌లితంగా భూముల రేట్లు  (CBN strategy)ప‌డిపోయాయి.

హైద‌రాబాద్ కు చాలా మంది వ‌ల‌స‌లు (CBN strategy 

ఏపీ ప‌రిస్థితి బాగాలేక‌పోవ‌డంతో హైద‌రాబాద్ కు చాలా మంది వ‌ల‌స‌లు వ‌చ్చారు. పెట్టుబ‌డులు ఇక్క‌డే పెడుతున్నారు. దీంతో ధ‌ర‌లు అనూహ్యంగా తెలంగాణ వ్యాప్తంగా పెరిగాయి. ఇలా భూముల ధ‌ర‌లు పెర‌గ‌డాన్ని అభివృద్ధిగా కేసీఆర్ చెబుతున్నారు. ఇదే స్లోగ‌న్ చంద్ర‌బాబు  (CBN strategy) వినిపిస్తూ మ‌ళ్లీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని గెలిపిస్తే, ఇక ఏపీ రాష్ట్రం అంతే సంగ‌తులంటూ ప్ర‌జ‌ల‌కు నిర్ణ‌యాన్ని వ‌దిలేస్తున్నారు. పేద‌ల ప్ర‌భుత్వంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్ప‌డం అబ‌ద్ధ‌మ‌ని, దోచుకునే వాళ్ల ప్ర‌భుత్వం న‌డుస్తుంద‌ని చంద్ర‌బాబు ఆరోపిస్తున్నారు. వివిధ రూపాల్లో ఏపీలోని వ‌న‌రుల‌ను దోచుకుని హైద‌రాబాద్ కు త‌ర‌లిస్తోన్న వైసీపీ గ్యాంగ్ ను త‌రిమి కొట్టాల‌ని ఆయ‌న పిలుపునిస్తున్నారు.

Also Read : CBN target : వైసీపీ బ‌లంపై చంద్ర‌బాబు గురి

ద‌ళితుల‌కు ఉండే 17 ర‌కాల ప‌థ‌కాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ర‌ద్దు చేసింది. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ఆద‌ర‌ణ కింద. ఇచ్చే ప‌రిక‌రాల‌ను ఆపేసింది. రైతుల‌కు స‌బ్సీడీతో ఇచ్చే ప‌రిక‌రాల‌ను, డ్రిప్ వంటి స్కీమ్ ల‌ను నిలిపివేసింది. ఎస్పీ కార్పొరేష‌న్ నిధుల‌ను పూర్తిగా మ‌రిచిపోయింది. ఇలా ప‌లు వ‌ర్గాల‌కు టీడీపీ హ‌యాంలో ఉండే ప‌థ‌కాల‌న్నింటికీ కోత వేసింది. వాటికి బ‌దులుగా బ‌ట‌న్ నొక్కుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంక్షేమ ప్ర‌భుత్వం అంటూ చెప్పుకుంటున్నారు. అదే విస‌యాన్ని చంద్ర‌బాబు (CBN strategy) చెబుతూ ఆలోచించాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని ప్ర‌జ‌లు పిలుపునిస్తున్నారు. భూముల ధ‌ర‌ల‌ను రెండు రాష్ట్రాల్లో పోల్చుచూసుకుని టీడీపీకి మ‌ద్ధ‌తు ప‌ల‌కాల‌ను కోరుతున్నారు. గ‌తంలో అమ‌రావ‌తి, అనంత‌పురం, విశాఖ, తిరుప‌తి న‌గ‌రాల్లో ఎంత ధ‌ర‌లు భూములు ఉండేవి, ఇప్పుడు ఎంత ఉన్నాయో ఆలోచించాల్సిన అంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన భూముల లెక్క‌ల్ని గ‌మ‌నించి టీడీపీకి ఓటు వేయాల‌ని చంద్ర‌బాబు కోర‌డం గ‌మ‌నార్హం.

Also Read : Nellore TDP : నెల్లూరు సిటీ టీడీపీ ఇంఛార్జ్‌గా పొంగూరు నారాయ‌ణ‌