CBN Prediction : మంచిరోజులు!చంద్ర‌బాబు ఆశాభావం!

మంచిరోజులు వ‌స్తాయ‌ని చంద్ర‌బాబు (CBN Prediction)ఆశాభావంతో ఉన్నారు.ప్రాజెక్టుల సంద‌ర్శ‌నలో భాగంగా ఉత్త‌రాంధ్ర వ‌ర‌కు ఆయ‌న చేరుకున్నారు.

  • Written By:
  • Publish Date - August 10, 2023 / 03:46 PM IST

ఏపీకి మంచిరోజులు వ‌స్తాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు (CBN Prediction)ఆశాభావంతో ఉన్నారు. ప్రాజెక్టుల సంద‌ర్శ‌నలో భాగంగా రాయ‌ల‌సీమ నుంచి ఉత్త‌రాంధ్ర వ‌ర‌కు ఆయ‌న చేరుకున్నారు. ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రాజెక్టుల నిర్మాణంలో చేసిన నిర్లక్ష్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపిస్తున్నారు. దానిపై చ‌ర్చ సీరియ‌స్ గా ప్ర‌జాక్షేత్రంలో జ‌రుగుతున్న స‌మ‌యంలో అధిక‌ప‌క్షం ఇష్యూను హైజాక్ చేసింది. జ‌నసేన చీఫ్ ప‌వ‌న్ న‌టించిన బ్రో సినిమా వైపు మ‌ళ్లించింది. కొన‌సాగింపుగా భోళాశంక‌ర్ సినిమాను సీన్లోకి తీసుకొచ్చింది.

ఏపీకి మంచిరోజులు వ‌స్తాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు (CBN Prediction)

ఇష్యూల‌ను హైజాక్ చేయ‌డంలో తొలి నుంచి వైసీపీ వ్యూహాత్మ‌కంగా ఉంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా టీడీపీ, బీజేపీ బంధాన్ని తెంచేయ‌డంలోనూ చాక‌చక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఎన్డీయే కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా గేమాడింది. సీన్ క‌ట్ చేస్తే, ఆ ఎన్నిక‌ల్లో లోపాయికారిగా బీజేపీతో క‌లిసి పనిచేసింది. ఆనాడు వైసీపీ వేసిన బుట్ట‌లో అడ్డంగా టీడీపీ ప‌డిపోయింది. ఇప్ప‌టికీ లేవ‌లేక‌పోతోంది. ఒక బీజేపీని మ‌రో వైపు బీఆర్ఎస్ పార్టీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీల ప‌రోక్ష మ‌ద్ధ‌తుతో మ‌రో ఛాన్స్ కొట్టేయాల‌ని చూస్తోంది. ఆ విష‌యం తెలుసుకున్న టీడీపీ వ్యూహాల‌ను ర‌చిస్తూ వైసీపీని ఒంటరిని చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. కానీ, ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ కేంద్రంలోని మోడీ స‌ర్కార్ అండ‌తో పైచేయి  (CBN Predictionసాధిస్తున్నారు.

ఇష్యూల‌ను హైజాక్ చేయ‌డంలో వైసీపీ వ్యూహాత్మ‌కం

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా చేస్తాని శ‌ప‌థం చేసిన ప‌వ‌న్ ఇప్పుడు దారిత‌ప్పారు. బీజేపీ వేసిన ట్రాప్ లో ప‌డ్డారు. ఆ పార్టీ ఢిల్లీ పెద్ద‌లు గీసిన రోడ్ మ్యాప్ ప్ర‌కారం న‌డుచుకుంటున్నారు. అంటే, పరోక్షంగా వైసీపీ వేసిన మ్యాప్ అమ‌లు అవుతోంద‌న్న‌మాట‌. ఆ క్ర‌మంలోనే వారాహి యాత్ర చేస్తూ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నారు. ప్ర‌తిగా మంత్రులు రాజ‌కీయ దాడికి పూనుకున్నారు. దీంతో రాష్ట్రంలోని స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా వైసీపీ, జ‌న‌సేన వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయ చ‌ద‌రంగాన్ని  (CBN Prediction చేసుకున్నాయి. దానిలో బ్రో సినిమా కూడా చేరింది. వాస్త‌వంగా ఆ సినిమా అట్ట‌ర్ ప్లాప్ . కానీ, వైసీపీ మంత్రులు ఇచ్చిన ప్ర‌చారం కార‌ణంగా 100 కోట్ల వ‌సూళ్ల‌ను చేరుకుంది. ఆ క్రెడిట్ అంతా మంత్రుల‌కు చెందుతుంద‌ని ప‌వ‌న్ అభిమానులు చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.

 మంత్రులు ఇచ్చిన ప్ర‌చారం కార‌ణంగా బ్రో సినిమా 100 కోట్ల వ‌సూళ్ల‌ను

ఇక ఇప్పుడు భ‌ళాశంక‌ర్ సినిమా చుట్టూ రాజ‌కీయాన్ని తిప్పారు. వ్యూహాత్మ‌కంగా వాల్తేరు వీర‌య్య సినిమా 200 రోజుల సంద‌ర్భంగా చిరంజీవి `పిచ్చుక మీద బ్ర‌హ్మాస్త్రం` అంటూ కామెంట్ చేశారు. దాన్ని రెండు రోజులుగా మంత్రులు పోటీప‌డి విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టారు. అంతేకాదు, చిరంజీవిని కూడా రాజ‌కీయగోదాలోకి లాగారు. ఆయ‌న జ‌న‌సేన పార్టీలోకి వెళుతున్నార‌ని ప్ర‌చారాన్ని గ‌ట్టిగా చేశారు. అంటే, ఆయ‌న జ‌నసేన పార్టీలోకి వెళ్లేలా వైసీపీ మంత్రులు ప్రొవోక్ చేస్తున్నారు. అదే జ‌రిగితే, జ‌నసేన పార్టీ కొంత బ‌లంప‌డుతుంది. అప్పుడు బీజేపీ, జ‌న‌సేన కూట‌మి ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును భారీగా చీల్చుకుంటుందని అంచ‌నా. ఫ‌లితంగా రెండోసారి అధికారంలోకి రావ‌చ్చ‌ని వైసీపీ ఎత్తుగ‌డ‌. ఆ క్ర‌మంలోనే భ‌ళాశంక‌ర్ సినిమా చుట్టూ మ‌రో వారం రోజులు రాజ‌కీయాన్ని (CBN Prediction  వైసీపీ న‌డ‌ప‌నుంది.

Also Read : Vizag Varahi Yatra : పవన్ వైజాగ్ వారాహి యాత్రకు ఏపీ సర్కార్ ఆంక్షలు..మరి ఇంత దారుణమా..?

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స‌బ్జెక్టు లేకుండా వారాహి యాత్ర‌ను చేస్తున్నారు ప‌వ‌న్. ఆయ‌న ఎమ్మెల్యేల వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌ను బ‌య‌ట‌కు తీస్తున్నారు. అంతేకాదు, రోజుకో మాట మాట్లాడుతూ రాజ‌కీయాన్ని డైవ‌ర్ట్ చేస్తున్నారు. తొలి రోజుల్లో సీఎం రేస్ లో లేన‌ట్టు ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత సంతోషంగా సీఎం ప‌ద‌విని తీసుకుంటాన‌ని వెల్ల‌డించారు. ఇప్పుడు సీఎం గా ఉండాల‌ని బ‌ల‌మైన కోరిక ఉంద‌ని చెబుతున్నారు. ఇలా రోజుకో ర‌కంగా మాట్లాడుతూ ఏపీ పాలిటిక్స్ ను గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్నారు. యువ‌త‌ను భావోద్వేగాల‌కు గురిచేస్తున్నారు. సామాజిక‌వ‌ర్గం మ‌త్తులో ఆయ‌న ప్ర‌సంగాల‌ను మైండ్ ఎక్కించుకుంటోన్న యువ‌త సీఎంగా ఆయ‌న్ను కోరుకుంటూ కేరింత‌లు కొడుతున్నారు. ఇదంతా వైసీపీ, బీజేపీ తెర‌వెనుక ర‌చించిన స్క్రిఫ్ట్ ప్ర‌కారం జ‌రుగుతుంద‌ని టీడీపీ ఇప్పుడిప్పుడు గ్ర‌హిస్తోంది.

Also Read : YCP Policing : పుంగ‌నూరులో త‌ప్పంతా టీడీపీదేన‌ట‌.!

గ‌త వారం రోజులుగా రాష్ట్రంలోని ప్రాజెక్టుల ప‌రిస్థితిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని చంద్ర‌బాబు ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప‌వ‌ర్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెడుతున్నారు. ప్ర‌జ‌ల్ని ఆలోచింప చేసేలా ఆయ‌న క్షేత్ర‌స్థాయికి వెళ్లి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేత‌గాని పాల‌న‌పై ఆలోచింప చేసేలా చైత‌న్య‌ప‌రుస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో రాజ‌కీయాన్ని హైజాక్ చేస్తూ వైసీపీ ఆడిన గేమ్ లో జ‌న‌సేన ప‌డిపోయింది. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు మాత్రం మంచిరోజులు స‌మీప భ‌విష్య‌తులోనే రాష్ట్రానికి ఉన్నాయ‌ని చెబుతున్నారు. మ‌రో ఆరు నెల‌ల్లో రాష్ట్రానికి మంచిరోజులు వ‌స్తాయ‌ని చెబుతూ ప్రాజెక్టుల సంద‌ర్శ‌న చేస్తున్నారు. కానీ, ఆయ‌న‌కు, లోకేష్ కు ప్ర‌చారం అనుకున్నంత‌గా ల‌భించ‌కుండా జ‌న‌సేన పార్టీని హైప్ చేస్తూ వైసీపీ వ్యూహాత్మ‌క గేమాడుతోంది.