CBN – PK : గోదా`వ‌రి`లో `వారాహి` సైకిల్

ఎన్నిక‌ల్లో పొత్తు సంగ‌తి ఏమోగానీ, ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు ఒక అవ‌గాహ‌న‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్ (CBN - PK) వెళుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - May 10, 2023 / 03:31 PM IST

ఎన్నిక‌ల్లో పొత్తు సంగ‌తి ఏమోగానీ, ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు ఒక అవ‌గాహ‌న‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్ (CBN – PK) వెళుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఉమ్మ‌డి ప్ర‌ణాళిక‌తో క‌లిసి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) స‌ర్కార్ మీద పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారా? అనే సందేహం క‌లుగుతోంది. ఆ మేర‌కు చంద్ర‌బాబు కొన్ని నెల‌ల క్రితం విజ‌య‌వాడ కేంద్రంగా ప్ర‌క‌ట‌న కూడా చేసిన విషయం విదిత‌మే. ఫ‌లితంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ `వారాహి` మూల‌న‌ప‌డింది. యువ‌గ‌ళం యాత్ర రోడ్డు మీద‌కు వ‌చ్చింది.

అవ‌గాహ‌న‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్ (CBN – PK)  

అకాల వ‌ర్షం కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల్ని గ‌త వారం టీడీపీ అధినేత చంద్ర‌బాబు (CBN)ప‌రామ‌ర్శించారు. మూడు రోజుల పాటు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని రైతుల‌ను పరామ‌ర్శించేందుకు వెళ్లారు. వెంట‌నే ప్ర‌భుత్వం కూడా కొంత మేర‌కు స్పందించింది. అప్ప‌టి వ‌ర‌కు గోతాల‌ను కూడా ఇవ్వ‌లేని ప్ర‌భుత్వం స్పందించింది. గోతాల‌ను ఇవ్వ‌డంతో పాటు రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే, పూర్తి స్థాయిలో పంట బీమా ఇవ్వాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేస్తూ ప్ర‌భుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చారు. ఆ మేర‌కు ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం 13న నిర‌స‌న దీక్షకు ఆయ‌న దిగ‌నున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

చంద్ర‌బాబు బాట‌న గోదావ‌రి జిల్లా వైపు ప‌వ‌న్(CBN – PK)

రైతుల‌ను ప‌రామర్శించ‌డానికి చంద్ర‌బాబు బాట‌న గోదావ‌రి జిల్లా వైపు ప‌వ‌న్(CBN – PK) వెళ్లారు. తూర్పు గోదావ‌రి జిల్లా క‌డియంకు బుధ‌వారం జ‌నసేనాని వెళ్లారు. ఆయ‌న రాక‌ను అభిమానులు పెద్ద ఎత్తున వేడుక‌లా చేశారు. సినిమాటిక్ గా రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. రెండు నెల‌ల త‌రువాత ఏపీలో త‌ళుక్కున మెరిశారు. నెల‌కు ఒక‌సారి లేదా రెండు నెల‌ల‌కు ఒక‌సారి ఏపీ ప‌ర్య‌ట‌న పెట్టుకుంటున్నారు. ఆ ప‌ర్య‌ట‌న‌లు చంద్ర‌బాబు, లోకేష్ (Lokesh)టూర్ల‌కు క్లాష్ కాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అంటే, చంద్ర‌బాబు, ప‌వ‌న్ మ‌ధ్య రాజ‌కీయ ఫిక్సింగ్ ఏదో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

కింగ్ మేక‌ర్ కావాల‌ని  ప‌వ‌న్ ప్లాన్

వాస్త‌వంగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం 9వ తేదీ ఎమ్మార్వో ఆఫీసుల వద్ద మొమోరాండం ఇస్తూ ‘మా పంట మునిగింది…పరిహారం ఇవ్వండి’ అనే స్లోగన్ తో టీడీపీ పోరాటం చేసింది. ఈనెల 13వ తేదీ నిరసన దీక్ష చేప‌డ‌తామ‌ని నాలుగు రోజుల క్రితం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. షెడ్యూల్ ప్ర‌కారం పెందుర్తి, అనకాపల్లి, ఎస్.కోట ప్రాంతాల్లో మే 16, 17, 18 తేదీల్లో ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని ప్ర‌క‌టించారు. ఉత్త‌రాంధ్ర మీద అటు చంద్ర‌బాబు ఇటు ప‌వ‌న్ ప‌ట్టు సాధించ‌డానికి(CBN – PK ) అడుగులు వేస్తున్నారు. ప్ర‌త్యేకించి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు కార్య‌క్ర‌మాల‌ను ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌ను కేంద్రంగా చేసుకుని పెట్టారు. అక్క‌డ క‌నీసం 10 స్థానాల‌ను గెల‌వ‌డం ద్వారా కింగ్ మేక‌ర్ కావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

Also Read : Janasena : క‌ద‌ల్లేని వారాహి, ఢిల్లీ బీజేపీ చేతిలో స్టీరింగ్

గోదావ‌రి జిల్లాలోని వెస్ట్ గోదావ‌రి టీడీపీకి ఎప్పుడూ బ‌లంగా ఉండే జిల్లా. గ‌త ఎన్నిక‌ల్లో (2014) టీడీపీ స్వీప్ చేసి 19 స్థానాల‌ను గెలుచుకుంది. అందుకే, తూర్పు గోదావ‌రి జిల్లా మీద ప‌వ‌న్ ఇప్పుడు ఎక్కువ‌గా క‌న్నేశారు. రాబోవు ఎన్నిక‌ల్లో పొత్తుల్లో భాగంగా పోటీ చేసే స్థానాల మీద ఎక్కువ‌గా దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇక నుంచి ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు అన్నీ దాదాపుగా ఎన్నిక‌లు, పొత్తుల‌ను దృష్టిలో ఉంచుకుని ఉంటాయ‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. ఆ మేర‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్ (CBN- PK)మ‌ధ్య అవ‌గాహ‌న ఉంద‌ని ఇరు పార్టీల్లోనూ వినిపిస్తోన్న మాట‌.

Also Read : Pawan Kalyan: నేను విన్నాను.. నేను చూశాను, పంట నష్టంపై పవన్ ఆవేదన!

పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం జ‌న‌వ‌రి నుంచి `వారాహి` ద్వారా రాష్ట్రం మొత్తం ప‌వ‌న్ ప‌ర్య‌టించాలి. ఆ మేర‌కు కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయుడు, విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యాల్లో పూజ‌లు చేసి సిద్దం చేశారు. కానీ, హ‌ఠాత్తు అదృశ్యం అయింది. మ‌ళ్లీ మ‌చిలీప‌ట్నంలో జ‌రిగిన ఆవిర్భావ స‌భ‌కు వెళ్ల‌డానికి`వారాహి`ని ఉప‌యోగించారు. ఇక ఆ వాహ‌నం ఎక్క‌డ ఉందో..ఎవ‌రికీ తెలియ‌దు. ఫ‌స్ట్ సర్వీస్ కూడా కాకుండానే త‌ప్పు బ‌డుతుంద‌ని వైసీపీ నేత‌లు వ్యంగ్యాస్త్రాల‌ను సంధిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం వెర‌వ‌కుండా వ్యూహాత్మ‌కంగా చంద్ర‌బాబుతో అవ‌గాహ‌న ప్ర‌కారం ప‌వ‌న్ రాబోవు ఎన్నిక‌ల‌కు స్టెప్స్ (CBN-PK)వేస్తున్నార‌ని ఇటీవ‌ల వాళ్లిద్ద‌రి మ‌ధ్యా జ‌రిగిన భేటీ సంకేతాలను ఇస్తోంది. అందులో భాగంగానే బుధ‌వారం జ‌రిగిన తూర్పు గోదావ‌రి జిల్లా క‌డియంలోని రైతుల ప‌రామ‌ర్శ యాత్ర ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అధికారంలోకి వ‌స్తే ప్ర‌కృతి వైప‌రిత్యాల‌తో పంట న‌ష్ట‌పోయే రైతుల‌కు ప‌రిహారం కోసం కొత్త విధానం తెస్తామంటూ ప‌వ‌న్ (Pawan)ఈ టూర్లో ప్ర‌క‌టించ‌డం కొస‌మెరుపు.

Also Read : CBN : పంట బీమా కోసం, రైతు దీక్ష‌కు చంద్రబాబు.?