CBN Jail : ఏపీ కోర్టుల్లో చెల్ల‌ని`లూథ్రా`! జైలులో బాబుకు `క‌త్తి` క‌థ !!

CBN Jail : న్యాయవాది లూథ్రా ఏపీలోని ప‌రిస్థితుల‌తో విసిగిపోయారా?బాబును జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకురాలేకపోవ‌డంతో నిరుత్సాహ ప‌డ్డారా?

  • Written By:
  • Updated On - September 13, 2023 / 05:51 PM IST

CBN Jail : దేశంలోనే పేరుమోసిన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఏపీలోని ప‌రిస్థితుల‌తో విసిగిపోయారా? చంద్ర‌బాబును జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకురాలేకపోవ‌డంతో నిరుత్సాహ ప‌డ్డారా? ఏపీలోని నేర ప‌రిస్థితుల‌ను చూసిన త‌రువాత ఆయ‌న రియాక్ట అయ్యారా? తెలియ‌దుగానీ, ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు సంచ‌ట‌నం క‌లిగిస్తోంది. క‌త్తితో పోరాట‌మే స‌రైన‌దంటూ ట్వీట్ చేయ‌డం ప‌రోక్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైఖ‌రిని తెలియ‌చేస్తున్న‌ట్టు ఉంది. జైలులో ఉన్న చంద్ర‌బాబును ములాఖ‌త్ కావ‌డానికి ముందుగా ఆయ‌న చేసిన ఆ ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

లూథ్రా సీనియార్టీ, ప్ర‌తిభ ఏపీ కోర్టుల్లో ప‌నిచేయ‌లేదు (CBN Jail)

`అన్నింటిని విచారించినా న్యాయం కనిపించడం లేదు. కత్తి తీయడం హక్కు, అప్పుడు యుద్ధం చేయడం సరైనది. శ్రీ గురు గోవింద్ సింగ్ జీ రాసిన zfarnama నుంచి ఔరంగజేబ్ కు వినిపించిన సూక్తి.` అంటూ ఆయ‌న ట్వీట్ చేయ‌డంలోని సందేశంపై ప‌లు ర‌కాలు చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌త నాలుగు రోజులుగా లూత్రా విజ‌య‌వాడ‌లోనే ఉన్నారు. బ‌హుశా ఆయ‌న కెరీర్ లోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ కేసు మారింది. ఎన్ని కోణాల నుంచి వాద‌న‌లు వినిపించిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబుకు (CBN Jail) న్యాయం చేయ‌లేక‌పోయారు. దేశంలోని ప్ర‌ముఖ న్యాయ‌స్థానాల్లో వాదించిన ఆయ‌న‌కు ఏపీలోని ప‌రిస్థితులు వెంట‌నే అర్థం కాలేదు. ఆ లోపు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింద‌ని బ‌హుశా ఆయ‌న భావించి ఉంటారు. ఆ క్ర‌మంలో ఈ ట్వీట్ చేసి ఉంటారు.

క‌త్తితో పోరాట‌మే స‌రైన‌దంటూ ట్వీట్ చేయ‌డం

ప్ర‌త్యేక విమానంలో సిద్ధార్థ లూథ్రా విజ‌య‌వాడ రావ‌డ‌మే పెద్ద న్యూస్. ఆయ‌న వాద‌న‌లు ఇక వండ‌ర్ గా ఉంటాయ‌ని టీడీపీ సంబ‌ర‌ప‌డింది. కానీ, ఎక్క‌డ తొట్రుపాటు లేకుండా ఏపీ సీఐడీ, జగ‌న్మోహ‌న్ రెడ్డి టీమ్ ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం న‌డిచింది. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌తో అరెస్ట్ చేయ‌డం నుంచి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు పంప‌డం వ‌ర‌కు స్కెచ్ ముందుగానే వేసింది. ఆ మేర‌కు ఏర్పాట్ల‌ను కూడా ముందుగానే చేశారు. ఏసీబీ కోర్టు జ‌డ్జి తీర్పు ఇవ్వ‌డానికి ఒక రోజు ముందే రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుతో ఒక బ్యార‌క్ ను సిద్దం చేశార‌ని వైసీపీ సోష‌ల్ మీడియాలోని ప్ర‌ధాన ట్రెండింగ్ న్యూస్. దాన్ని చూడ‌గానే, ప‌క్కా ప్లాన్ జ‌రిగింద‌ని కొంద‌రు అనుమానించారు. ఏసీబీ కోర్టులో సిద్ధార్థ్ లూథ్రా వాదించిన వాద‌న‌ల దెబ్బ‌కు సీఐడీ న్యాయ‌వాదులు వెనుక‌బ‌డ్డార‌ని అంద‌రూ భావించారు. పైగా విక్ట‌రీ సింబ‌ల్ చూపుతూ సిద్ధార్థ్ లూథ్రా బ‌య‌ట‌కు రావ‌డంతో ఆ రోజు రిమాండ్ పిటిష‌న్ ను కొట్టివేస్తార‌ని టీడీపీ క్యాడ‌ర్ ఊహించింది. కానీ, ముందుగా వేసిన ప్లాన్ ప్ర‌కారం అంతా జ‌రిగిపోయింద‌ని(CBN Jail) ఆల‌స్యంగా టీడీపీకి బోధ‌ప‌డింది. ఆ రాత్రి పొద్దుపోయిన త‌రువాత రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు చంద్ర‌బాబును పంపారు. వెంట‌నే వైసీపీ సంబ‌రాలు చేసుకుంది.

Also Read : All Party Meet: అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపు

ఆ రోజు రాత్రి ఏమి జ‌రిగింది? అనేది లూథ్రా లాంటి పేరుమోసిన లాయ‌ర్ల‌కు అర్థ‌మైయింది. ప్లాన్ బీ వైపు ఆయ‌న వెళ్లారు. కానీ, రెండు రోజుల పాటు హౌస్ రిమాండ్ మీద పిటిష‌న్ వాద‌న‌లు కొన‌సాగ‌డంతో లూథ్రాకు మ‌రింత బోధ‌ప‌డిన‌ట్టు ఉంది. ఏపీ ఏఐజీ టీమ్ , ప్ర‌భుత్వం కదిలిస్తోన్న పావులు దెబ్బ‌కు లూథ్రా న్యాయ సూత్రాలు ప‌నిచేయ‌లేదు. ఆ విష‌యాన్ని రెండు రోజుల్లో గ్ర‌హించారు. వేదిక‌ను హైకోర్టుకు మార్చారు. ఆ పిటిష‌న్ల‌పై విచార‌ణ కొన‌సాగించ‌డానికి ముందే సంబంధిత జ‌డ్జి `నాట్ బిఫోర్‌` ను తీసుకుంటాను అంటూ చెప్ప‌డం పెద్ద ట్విస్ట్. ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ గా చేశానంటూ ఆయ‌నే చెబుతూ అభ్యంత‌రం ఉంటే వేరే బెంచ్ కు త‌ర‌లిస్తానంటూ చంద్ర‌బాబు న్యాయ‌వాదులకు చెప్పారు. కానీ, ఈ రోజు ఎలాగైనా చంద్ర‌బాబును బ‌య‌ట‌ప‌డేయాల‌ని లూథ్రా భావిస్తూ ఆ జ‌డ్జినే విచారించ‌మ‌ని కోరారు. అంతే, ఈనెల 19వ తేదీ వ‌ర‌కు కేసు వాయిదా వేస్తూ తీర్పు వెలువ‌డింది.

Also Read : Sidharth Luthra Tweet : ‘కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’ అంటూ సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్‌..

విజ‌య‌వాడ‌లోని హైకోర్టు నుంచి లూథ్రా రాజ‌మండ్రిలోని సెంట్ర‌ల్ జైలులో ఉన్న చంద్ర‌బాబును క‌ల‌వ‌డానికి బ‌య‌లు దేరారు. మార్గ‌మ‌ధ్యంలో సంచ‌ల‌న ట్వీట్ చేశారు. `అన్ని కోణాల‌ను నుంచి న్యాయం జ‌ర‌గ‌ద‌ని అర్థ‌మ‌వుతున్న‌ప్పుడు క‌త్తి తీయ‌డం హ‌క్కు, దానితో యుద్ధం చేయ‌డమే మార్గం..` అనే భావ‌న క‌లిగిస్తూ ఔరంగ‌జేబుకు గురుగోవింద్ సింగ్‌ చెప్పిన సూక్తిని గుర్తు చేస్తూ zfarnama పుస్త‌కంలో రాసిన కోడ్ ను ట్వీట్ ద్వారా బ‌య‌ట పెట్టారు. ఆ ట్వీట్ చూసిన త‌రువాత చంద్ర‌బాబుకు ఇప్ప‌ట్లో న్యాయం జ‌ర‌గ‌ద‌ని ఆయ‌న భావిస్తున్నారా?. ఆయ‌న్ను జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డం క‌ష్ట‌మ‌ని లూథ్రా ఫిక్స్ అయ్యారా? ప‌క్కాగా చంద్ర‌బాబును ఇరికించేశార‌ని లూథ్రాకు అర్థం కావ‌డంతో ఆ ట్వీట్ చేశారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తం మీద నాలుగు రోజుల పాటు చూపిన లూథ్రా సీనియార్టీ, ప్ర‌తిభ ఏపీ కోర్టుల్లో ప‌నిచేయ‌లేదు. అందుకే, ఆయ‌న టుడేస్ కోడ్ అంటూ ట్వీట్ చేసి ప‌రిస్థితులను ప‌రోక్షంగా బ‌య‌ట‌పెట్టారు. ఆ ట్వీట్లో ఎవ‌రికి ఏది కావాలో, ఆ కోణం నుంచి వెదుక్కోవ‌చ్చు.