Site icon HashtagU Telugu

CBN Fire : బ్లూ,పిచ్చ మీడియాకు వార్నింగ్!`చీప్`న్యూస్ పై చంద్ర‌బాబు అస‌హ‌నం!!

Cbn Fire

Cbn Fire

సోషల్ మీడియా కంటే బోగ‌స్ న్యూస్ ప్ర‌సారం చేస్తోన్న ఒక విభాగం మీడియా అంటూ చంద్ర‌బాబు (CBN Fire) ఆగ్ర‌హించారు. బ్లూ మీడియా(Media) అంతు చూస్తానంటూ హెచ్చ‌రించారు. `మీ స్థానం ఏమిటో రాబోవు రోజుల్లో చూపిస్తా..` అంటూ ఎప్పుడూ లేని విధంగా చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్త‌ప‌రిచారు. దానికి కార‌ణం లేక‌పోలేదు, ఏపీ కోసం అహ‌ర్నిశ‌లు పోరాటం చేస్తోన్న ఆయ‌న మీద గాసిప్స్, నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తూ కొన్ని ఛాన‌ల్స్ న్యూస్ ప్ర‌చారం చేయ‌డం ఒక కార‌ణం. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ప్ర‌య‌త్నం చేస్తోన్న దానికి గండికొట్టేలా తెలంగాణ బేస్డ్ ఛాన‌ల్స్ ఒక‌టిరెండు గాలిపోగుచేసి వార్త‌ల‌ను ఇవ్వ‌డం రెండో కార‌ణం. ఏ మాత్రం వార్త‌ల మీద అవ‌గాహ‌న‌లేని కొన్ని త‌ల‌కాయ‌లు గాలి వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న‌.

బోగ‌స్ న్యూస్ ప్ర‌సారం చేస్తోన్న ఒక విభాగం మీడియా (CBN Fire)

ఒకటిరెండు న్యూస్ ఛాన‌ల్స్ (Media) నాలుగు రోజులు క్రితం ప్ర‌సారం చేసిన న్యూస్ చంద్ర‌బాబుకే(CBN Fire) ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ట‌. దాని సారాంశం ఏమంటే సీఎం ప‌ద‌విని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇస్తూ చంద్ర‌బాబు ఒప్పుకున్నార‌ని గాలి పోగుచేసిన ప్ర‌సారం చేశాయి. ఏపీలో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుంద‌ని ఆ మీడియా యాజ‌మాన్యం ఆలోచ‌న‌గా టీడీపీ భావిస్తోంది. అందుకే, చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఏ రోజుకారోజు అదే న్యూస్ ను అటుతిప్పి ఇటుతిప్పి ప్ర‌సారం అయింద‌ట‌. ఆ విష‌యాన్ని తెలుసుకున్న చంద్ర‌బాబు మునుపెన్న‌డూ లేనివిధంగా బ్లూ మీడియాతో పాటు గాలిపోగుచేసిన న్యూస్ ను ప్ర‌సారం చేస్తోన్న ప్ర‌జాద‌ర‌ణ ఆ ఛాన‌ల్ కు కూడా వార్నింగ్ ఇచ్చారు.

సీఎం ప‌ద‌విని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇస్తూ చంద్ర‌బాబు ఒప్పుకున్నార‌ని గాలి న్యూస్

రాష్ట్రంలోని రాజ‌కీయ ఈక్వేష‌న్ల‌పై ఏ మాత్రం అవ‌గాహ‌న లేకుండా ఒక ఛాన‌ల్ న్యూస్ ప్ర‌సారం చేసింద‌ని టీడీపీ క్యాడ‌ర్ (CBN Fire) ఆగ్ర‌హంగా ఉంది. ఇటీవ‌ల చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఎందుకు క‌లిశారు? అనేది బ్లూ మీడియాకు(Media) కూడా క‌నిపించ‌నంత‌గా ఆ ఛాన‌ల్ కు కనిపించ‌డం గ‌మ‌నార్హం. సీఎం అభ్య‌ర్థిత్వాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కోర‌డానికి వెళ్లాడ‌ని ఆ న్యూస్ సారాంశం. అందుకు, చంద్ర‌బాబు అంగీక‌రించాడ‌ని గాలి బాగా పోగుచేసింది. అంతేకాదు, సీఎం అభ్య‌ర్థిత్వాన్ని ప‌వ‌న్ కు ఇస్తూ అంగీక‌రించడంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, మోడీ ప‌ని అయిపోయింద‌ని గాలి న్యూస్ ఎపిసోడ్‌. పైగా దానికి చీప్ గా ఆ హెడ్ పేరు కూడా పెట్టుకోవ‌డం టీడీపీ క్యాడ‌ర్ కు న‌షాలానికి ఎక్కింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు ఆప్ష‌న్ల‌ను ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా

వాస్త‌వంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు ఆప్ష‌న్ల‌ను ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ఓటు బ్యాంకు చీల‌కుండా టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన క‌లిసి వెళ్ల‌డం మొద‌టి ప్రాధాన్యం. ఇక టీడీపీ, జ‌నసేన పొత్తు రెండో ఆప్ష‌న్‌గా చెప్పారు. లేదంటే, జ‌న‌సేన ఒంట‌రిగా వెళ్ల‌డాన్ని మూడో ఆప్ష‌న్ గా చెబుతూ పొత్తుల అంశాన్ని త‌న‌కు వ‌దిలేయాల‌ని క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశారు. ఆ త‌రువాత జ‌రిగిన పొలిటిక‌ల్ ఎఫైర్ మీటింగ్ లో రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం పొంద‌డం కంటే పొత్తు అవ‌స‌ర‌మ‌ని చ‌ర్చించార‌ని పార్టీ వ‌ర్గాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అంశం. అంటే, టీడీపీతో పొత్తు పొత్తులేక‌పోతే, 2019 ఫ‌లితాలు జ‌న‌సేన‌కు త‌ప్ప‌ద‌ని అర్థం. అంటే, ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌లను భ‌ర్తీ చేసేలా ఓటు శాతం, సీట్ల సంఖ్య ఛాన్స్ లేద‌ని ప‌ర‌మార్థం. ఫ‌లితంగా రిజిస్ట్ర‌ర్ పార్టీగా ఉండాల్సి ఉంటుంది. గుర్తు రావ‌డం క‌ష్టం. దాన్ని రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం కింద ప‌వ‌న్ సూచించార‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌.

Also Read : CBN Plan : మోడీతో బాల‌య్య భేటీ? భార‌త ర‌త్న, పొత్తు ఎజెండా!

ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన ప‌వ‌న్ రాబోవు ఎన్నిక‌ల్లో పొత్తుల అవ‌స‌రాన్ని బీజేపీ పెద్ద‌ల వ‌ద్ద ప్ర‌స్తావించారని స‌ర్వ‌త్రా తెలిసిన అంశం. కానీ, వాళ్లు ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఇటీవ‌ల చంద్ర‌బాబును క‌లిసి ప్లాన్ బీ లోకి వెళ్లాల‌ని చ‌ర్చించి ఉంటార‌ని రాజ‌కీయ పండితులు సైతం భావిస్తున్నారు. కానీ, ఏ మాత్రం రాజ‌కీయ అవ‌గాహ‌న‌లేని ఒక ఛాన‌ల్ (Media) ప‌వ‌న్ కల్యాణ్ సీఎం అభ్య‌ర్థిత్వంపై చ‌ర్చ జ‌రిగింద‌ని గాలి మూట‌గ‌ట్టింది. గౌరప్ర‌ద‌మైన స్థానాల్లో పోటీ చేస్తామ‌ని ప‌వన్ ఒక వైపు చెబుతుంటే, అర్థ‌ప‌ర్థంలేని న్యూస్ తో ఆ రెండు పార్టీల పొత్తును కుద‌ర‌కుండా ఆపాల‌నే ప్ర‌య‌త్నం ఆ న్యూస్ లో టీడీపీకి క‌నిపించింద‌ట‌. అందుకే, త‌ల‌కాయ‌లేని ఆ వార్త‌ను ఇచ్చిన వాళ్ల‌ను చంద్ర‌బాబు అండ్ టీమ్ గుర్తు(CBN Fire) పెట్టుకుంది. రాబోయే రోజుల్లో వాళ్ల స్థాయి ఏమిటో చూపిస్తానంటూ జ‌ర్నలిజంలో ఏ మాత్రం అవ‌గాహ‌న‌లేని ఆ త‌ల‌కాయ‌ను హెచ్చ‌రించార‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : Operation NTR Statue : BRS కు జూనియ‌ర్ క్రేజ్! రేవంత్, T-TDPకి బ్రేక్!

చిట్స్ వ్యాపారం చేసే ఆ యాజ‌మాన్యంకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan mohan Reddy) అండ ఉంద‌ని టీడీపీ భావిస్తోంది. అందుకే, ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని చిట్ ఫండ్స్ కంపెనీల‌ మీద ఏపీ సీఐడీ దాడులు జ‌రిగిన‌ప్ప‌టికీ ఆ కంపెనీని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ వ‌దిలేసిందట‌. అందుకు గిఫ్ట్ గా ఇలాంటి గాలి న్యూస్ ను ఇవ్వ‌డం ద్వారా ఏపీ ప్ర‌భుత్వాన్ని సంతృప్తి ప‌రిచాల‌నే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని మీడియా స‌ర్కిల్స్ లోని టాక్‌. పైగా హైదరాబాద్ చుట్టు ప‌క్క‌ల చిట్స్ సొమ్ముతో కొనుగోలు చేసిన భూముల ధ‌ర‌లు ప‌డిపోతాయ‌ని ఏపీలో జ‌గ‌న్మోహన్ రెడ్డి రావాల‌ని తెలంగాణ బాస్ ఇచ్చిన డైరెక్ష‌న్ మేర‌కు గాలి న్యూస్ పోగేశార‌ని టీడీపీ (CBN Fire) అనుమానిస్తోంది. మొత్తం మీద బ్లూ మీడియా (Media) కంటే మించిన పోయిన ఆ మీడియా సంగ‌తి చూడ్డానికి చంద్ర‌బాబు సిద్ద‌మై వార్నింగ్ ఇచ్చార‌ని తెలుస్తోంది.