వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి సీబీఐ కోర్టు (CBI Court ) గుడ్ న్యూస్ అందించింది. జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతించింది. ఈ నెల 11 నుండి 30వ తేదీ వరకు ఆయన లండన్ (YS Jagan London Tour) వెళ్లేందుకు సీబీఐ కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జగన్ కుమార్తెలు లండన్‌లో చదువుకుంటుండగా, తమ గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతించాలన్న జగన్ అభ్యర్థనపై కోర్టు సానుకూలంగా స్పందించింది.
Tirupati Stampede : తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో ఏమన్నారంటే..!!
జగన్ కు సీబీఐ కోర్టు 20 రోజుల పాటు లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. తన విదేశీ పర్యటనకు సంబంధించి తగిన సమాచారం అందించాల్సిందిగా కోర్టు జగన్‌ను ఆదేశించింది. పర్యటన తర్వాత తక్షణమే కోర్టులో హాజరుకావాలని సూచించింది. ఇక నిన్న హైకోర్టులో జగన్‌కు మరో ఊరట లభించింది. పాస్‌పోర్ట్ పొందేందుకు హైకోర్టు ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) జారీ చేసింది. ఐదేళ్ల కాలపరిమితితో పాస్‌పోర్ట్ ఇవ్వాలని సంబంధిత అథారిటీలను హైకోర్టు ఆదేశించింది. ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఇక జగన్ లండన్ పర్యటన రాజకీయ దృష్ట్యా కూడా చర్చనీయాంశమవుతోంది. జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతులు ఇవ్వడంపై పలు పార్టీలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక కేసుల్లో నిందితుడైన జగన్‌కు కోర్టు సడలింపు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.