Site icon HashtagU Telugu

Brutal Murder : ఆభరణాల కోసం పొరుగింటి మహిళ మర్డర్.. నెల్లూరులో దారుణం

Brutal Murder In Nellore Dead Body In Suitcase

Brutal Murder : నెల్లూరులోని రాజేంద్రనగర్‌లో దారుణ మర్డర్ జరిగింది. ‘‘కొత్తగా ఇల్లు కట్టాం.. టీ తాగండి’’ అంటూ పొరుగునే ఉండే మణ్యం రమణి (65)  అనే వృద్ధురాలిని..  బాలసుబ్రహ్మణ్యం, అతడి కుమార్తె దివ్యశ్రీ తమ ఇంట్లోకి పిలిచారు. ఆమె టీ తాగుతుండగా తాడును గొంతుకు బిగించి మర్డర్ చేశారు. అనంతరం డెడ్‌బాడీని సూట్‌కేస్‌లో పెట్టి చెన్నైకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం కూరగాయల కోసం బయటికి వెళ్లిన రమణి ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read :US Election Results : అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ 198 Vs కమల 109

సూట్‌కేసులో రమణి డెడ్‌బాడీని తీసుకొని వెళ్తున్న బాలసుబ్రహ్మణ్యం, అతడి కుమార్తె దివ్యశ్రీలను తమిళనాడులోని తిరువళ్లూ జిల్లా మీంజూరు రైల్వే పోలీసులు(Brutal Murder) పట్టుకున్నారు. దీనిపై మంగళవారం రోజు నెల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం ఫొటోను పరిశీలించిన నెల్లూరు పోలీసులు.. అది రమణి డెడ్‌బాడీ అని గుర్తించారు. దీంతో మింజూరు రైల్వే పోలీసులు తండ్రీకుమార్తెలను విచారించగా.. హత్య చేశామని ఒప్పుకున్నారు.

Also Read :IPL Auction: ఐపీఎల్ వేలంలోకి 42 ఏళ్ల ఆటగాడు.. ఎవ‌రా స్టార్ ప్లేయ‌ర్‌?

హత్య జరిగింది ఇలా.. 

‘‘మేం ఆర్థిక ఇబ్బందుల్లో  ఉన్నాం. అందుకే రమణి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకోవాలని ప్లాన్ చేశాం. మా ప్లాన్‌లో భాగంగా సోమవారం ఉదయం కూరగాయల దుకాణం వద్ద రమణిని  మా నాన్న బాలసుబ్రహ్మణ్యం కలిశాడు. ఆమెను మాటల్లో పెట్టి.. టీ తాగేందుకు ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెను హత్య చేసి.. ఒంటిపై ఉన్న నల్లపూసల దండ, కమ్మలు తదితర బంగారు ఆభరణాలు తీసుకున్నాం. ట్రావెల్‌ సూట్‌‌కేసులో రమణి డెడ్‌బాడీని కుక్కాం. అనంతరం నెల్లూరు స్టేషనులో చెన్నై వెళ్లే ప్యాసింజర్‌ రైలు ఎక్కాం. రైలులో జనం ఎక్కువగా ఉండటంతో సూట్‌‌కేసును పడేయడం కుదరలేదు. చెన్నై సమీపంలోని మీంజూరు స్టేషన్‌లో దిగి, ప్లాట్‌ఫాంపై సూట్‌కేస్‌ వదిలేందుకు యత్నించాం. దీనిపై  ఓ యువకుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చి సూట్‌కేసును పరిశీలించగా.. అందులో నుంచి డెడ్‌బాడీ బయటపడింది’’ అని బాలసుబ్రహ్మణ్యం కుమార్తె దివ్యశ్రీ వివరించింది.