BRS strategy : కేసీఆర్ గురివింద క‌బుర్లు! ఏపీని గేలిచేస్తూ ప‌బ్బం.!!

త‌ప్పులెన్ను వారు త‌మ త‌ప్పులెర‌గ‌రు..` వేమ‌న ప‌ద్యంలోని నీతి. స‌రిగ్గా కేసీఆర్ కు (BRS strategy)ఈ నీతిని వ‌ర్తింప చేస్తే స‌రిపోతుంది.

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 12:24 PM IST

`త‌ప్పులెన్ను వారు త‌మ త‌ప్పులెర‌గ‌రు..` వేమ‌న ప‌ద్యంలోని నీతి. స‌రిగ్గా కేసీఆర్ కు (BRS strategy)ఈ నీతిని వ‌ర్తింప చేస్తే ప్ర‌స్తుతం అతికిన‌ట్టు స‌రిపోతుంది. ఎందుకంటే, ఏపీలో విద్యుత్ కోత‌లు, అమ‌రావ‌తి, రోడ్ల గురించి మాట్లాడుతోన్న కేసీఆర్ కు తెలంగాణ‌లోని అమ‌రుల త్యాగాలు గుర్తు రావ‌డంలేదు. ప్ర‌త్యేక రాష్ట్రంలో తొమ్మిదేళ్లు కేసీఆర్ పాల‌న చేసిన త‌రువాత ఎందుకు విడిపోయామా? అంటూ ఉద్య‌మ‌కారులు ప్ర‌శ్నిస్తున్నారు. స‌మైక్య పాల‌కుల పాల‌న బాగుంద‌ని కితాబు ఇస్తున్నారు. మేధావులు, క‌వులు, క‌ళాకారులు, సామాజిక‌వేత్త‌లు, రాజకీయ విశ్లేష‌కులు కేసీఆర్ పాల‌న ఎంత క‌ర్క‌శంగా ఉందో చెబుతున్నారు.

స‌మైక్య పాల‌కుల పాల‌న బాగుంద‌ని  ఉద్య‌మ‌కారులు కితాబు (BRS strategy)

ప్ర‌జాస్వామ్యంలో రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు వాక్ స్వేచ్ఛ‌, ఉద్య‌మించ‌డం, పోరాటాలు చేయ‌డం. కానీ, కేసీఆర్ ఉద్మ‌మాల‌కు వ్య‌తిరేకం. ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వాల‌కు తెలియ‌చేసేలా ఇందిపార్క్ వ‌ద్ద గ‌తంలో నిర‌స‌న‌ల‌కు, పోరాటాల‌కు దిగే వాళ్లు. ఇప్పుడు అక్క‌డ నిషేధం విధించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్క‌డా ఉద్య‌మించ‌డానికి, పోరాడ‌డానికి లేదు. ఎవ‌రైనా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతున్నారు. ఆ విధంగా తొమ్మిదేళ్ల‌లో ప‌లు రంగాల‌కు చెందిన వాళ్ల‌ను, ప్ర‌త్యేకించి మీడియాకు గొంత‌ను నొక్కేలా పోలీసుల‌ను ప్ర‌యోగించారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో స్వేచ్ఛ‌గా పోరాటాలు చేశారు. ఆనాడు స‌మైక్య పాల‌కులు ఇప్పుడు కేసీఆర్ త‌ర‌హాలో(BRS strategy) అణ‌చివేయ‌లేద‌ని తెలంగాణ ఉద్య‌మాకారుల అభిప్రాయం.

మీడియా రంగాన్ని దాదాపుగా కేసీఆర్ ఆధీనంలోకి

ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధంగా తొలి రోజుల్లో విప‌క్షాల‌ను నిర్వీర్యం చేయ‌డాన్ని కేసీఆర్ ఎంచుకున్నారు. ఏ పార్టీలో గెలిచిన‌ప్ప‌టికీ టీఆర్ఎస్ గూటికి చేరేలా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డారు. ఆ త‌రువాత పార్టీల‌ను అసెంబ్లీ వేదిక‌గా విలీనం చేసుకున్నారు. మియాపూర్ భూ కుంభ‌కోణం నుంచి తాజాగా 111 జీవో ఎత్తివేత వ‌ర‌కు న‌డిచిన భూ భాగోతం కేసీఆర్ పాల‌న‌ దోపిడీకి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా అమ‌రుల కుటుంబీకులు చెబుతున్నారు. డ్ర‌గ్స్, రియ‌ల్ మాఫియా కు త‌లుపులు బార్లా తెరిచారు. క‌రోనా స‌మ‌యంలో ఆస్ప‌త్రుల దోపిడీని చూశాం. మీడియా రంగాన్ని దాదాపుగా కేసీఆర్ ఆధీనంలోకి తీసుకున్నారు. విద్య‌, వైద్య‌, మీడియా, రాజ‌కీయ రంగాల‌న్నీ దాదాపుగా కేసీఆర్ చేతిలోకి వెళ్లిపోయాయి. ఆయ‌న కుటుంబీకులు బినామీలుగా ఆయా రంగాల్లో పాతుకుపోయార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ప్ర‌త్యేక విమానం కొనుగోలు చేసే స్థాయికి కేసీఆర్ వ‌చ్చారు. ఇదంతా తెలంగాణ ప్ర‌జ‌ల సొమ్ము కాదా? అంటూ ప్ర‌శ్నించే ఉద్య‌మకారుల‌కు ఎనాడూ క‌ల్వ‌కుంట్ల కుటుంబం(BRS strategy) స‌మాధానం చెప్ప‌లేదు.

దేశానికి తెలంగాణ మోడ‌ల్ అంటూ ఊద‌ర‌కొట్ట‌డాన్ని (BRS strategy)

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ఎమ్మెల్యే క‌విత‌ను చుట్టుముట్టింది. అంటే, తెలంగాణ స‌రిహ‌ద్దుల్ని దాటి క‌ల్వ‌కుంట్ల కుటుంబీకుల వ్యాపార‌, దందాలు వెళ్లాయ‌ని ఏపీ నేత‌లు ప‌లుమార్లు వేలెత్తిచూపారు. తెలంగాణ‌లోని ఉద్య‌మ‌కారులు కూడా ప్ర‌శ్నిస్తున్నారు. తెల్ల‌దొర‌లు పోయిన త‌రువాత న‌ల్ల‌దొర‌ల దోపిడీ దేశంలో చూస్తున్నాం. అలాగే, తెలంగాణ‌లో ఆంధ్రా  వాళ్ల‌ దోపిడీ కంటే తెలంగాణ‌లోని దొర‌ల దోపిడీ మించిపోయింద‌ని ఉద్య‌మ‌కారులు గొంతెత్తుతున్నారు. స‌మైక్య పాల‌న మేల‌ని ఘంటాప‌థంగా చెబుతున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం 24 గంట‌ల విద్యుత్, మంచినీళ్లు (BRS strategy) అందిస్తున్నామ‌ని చెబుతున్నారు. తెలంగాణ‌లో మారుమూల గ్రామాల‌కు వెళ్లినా క‌నీసం 30ల‌క్ష‌ల త‌క్కువ లేకుండా ఎక‌రం భూమి ధ‌ర ఉంద‌ని చెబుతూ…దాన్ని అభివృద్ధి కింద చెబుతున్నారు. దేశానికి తెలంగాణ మోడ‌ల్ అంటూ ఊద‌ర‌కొట్ట‌డాన్ని తెలంగాణ‌వాదులు అంగీక‌రించ‌డంలేదు.

విజ‌న్ 2020 ప్ర‌కారం 24 గంట‌ల విద్యుత్, ప్ర‌తి ఇంటికీ మంచినీళ్లు

వాస్త‌వంగా విజ‌న్ 2020 ప్ర‌కారం 24 గంట‌ల విద్యుత్, ప్ర‌తి ఇంటికీ మంచినీళ్లు ఇవ్వాలి. మెట్రో, ఎయిర్ పోర్ట్ , గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లు, ఐటీ వృద్ధి, ఉపాథి అవ‌కాశాల క‌ల్ప‌న‌, ఈ రేస్ త‌దిత‌రాల‌న్నీ ఉన్నాయి. ఆనాడు చంద్ర‌బాబు వేసిన విజ‌న్ ఫ‌లాలు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వ‌చ్చేనాటికి కేసీఆర్ సీఎంగా ఉన్నారు. 20ఏళ్ల క్రితం వేసిన అభివృద్ధి అనే వృక్షం ఇప్పుడు కాయ‌లు కాస్తోంది. వాటిని తానే పండిస్తున్నానంటూ కేసీఆర్ అండ్ క‌ల్వ‌కుంట్ల కుటుంబం(BRS strategy) చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Political king pin : BRS, కాంగ్రెస్ జాత‌కాల‌ను మార్చ‌నున్న MIM

క‌ల్వ‌కుంట్ల చేసిన జిమ్మిక్కుల‌తో తెలంగాణ స‌మాజం రెండుసార్లు మోసం పోయింద‌ని ఉద్య‌మ‌కారుల అభిప్రాయం. ఈసారి మాత్రం కేసీఆర్ ను కుర్చీ దించాల్సిందేనంటూ అమ‌ర‌వీరుల కుటుంబీకులు ముందుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ‌బ‌లిదానం చేసిన 1200 మంది కంటే తొమ్మిదేళ్ల కేసీఆర్ పాల‌న‌లో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతుల సంఖ్య నాలుగింత‌లు ఉంది. ఇందుకేనా? తెలంగాణ సాధించుకుంది అంటూ ఉద్య‌మ‌కారులు ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌లేని కేసీఆర్ ఏపీ ప్ర‌గ‌తి, అభివృద్ధి ఆగిపోయింద‌ని గేలిచేస్తూ మాట్లాడ‌డం (BRS strategy) రాజ‌కీయ జిమ్మిక్కు మాత్ర‌మే.

Also Read : KCR’s Coverts: బీజేపీలో కేసీఆర్ కోవర్ట్ లు..! జాబితా రెడీ..!!