AP BJP : వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని మరింత బలోపేతం చేయాలనే టార్గెట్‌తో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉన్నారు. ఈక్రమంలోనే ఒక కొత్త మిషన్‌పై బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టారు. ఏపీ నుంచి రాజ్యసభలో బీజేపీ బలాన్ని పెంచుకోవాలనేది ఈ కొత్త మిషన్ లక్ష్యం. ఇందుకోసం ఏం చేయాలని భావిస్తున్నారనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Rice Consumption : ఆ రాష్ట్రాల ప్రజలు నెలకు కేజీ బియ్యం కూడా తినరట.. తెలుగు స్టేట్స్ ఎక్కడ ?
పవన్ తోడుగా.. మున్ముందుకు..
ఏపీలో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బీజేపీ అంత బలంగా లేదు. సొంత బలాన్ని పెంచుకుంటేనే భవిష్యత్తులో ఏపీ పాలిటిక్స్‌లో చక్రం తిప్పగలమని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. ఏపీలో బీజేపీకి నమ్మకమైన రాజకీయ భాగస్వామి జనసేన. బీజేపీ ఎటువైపు ఉంటే.. జనసేన అటువైపే ఉండే అవకాశాలు ఉంటాయి. జనసేనతో కలిసి రానున్న రోజుల్లో ఏపీ పాలిటిక్స్‌లో వ్యూహాత్మక లక్ష్యాలను ఛేదించాలనే ప్లాన్‌తో బీజేపీ ఉంది. ఏపీలో బీజేపీకి కావాల్సిన చరిష్మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో లభిస్తుంది. ఇక కావాల్సిందల్లా క్షేత్రస్థాయి నెట్‌వర్క్. ఈక్రమంలోనే త్వరలో కీలకమైన పావులను బీజేపీ పెద్దలు కదపబోతున్నారు.
Also Read :100 Years For Electric Train : మన తొలి విద్యుత్ రైలుకు నేటితో వందేళ్లు.. ఆ ట్రైన్ విశేషాలివీ
నెక్ట్స్ టార్గెట్‌లో..
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది నెలల్లోనే ముగ్గురు వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీలు(AP BJP) రాజీనామా చేశారు. ఇటీవలే విజయసాయిరెడ్డి కూడా తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలేశారు. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ ఎంపీ స్థానాల్లో ఒకదాన్ని బీజేపీకి కేటాయించారు. భవిష్యత్లో జనసేనకు కూడా ఒక రాజ్యసభ స్థానం దక్కొచ్చు. అయితే ఇలా ఒకటి, అర రాజ్యసభ ఎంపీ స్థానాలతో ఆగొద్దని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తమ క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్న కమలదళం.. వైఎస్సార్ సీపీ నుంచి గంపగుత్తగా రాజ్యసభ ఎంపీలను పార్టీలో చేర్చుకునేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతానికి వైసీపీకి ఏడుగురు రాజ్యసభ సభ్యులే మిగిలారు. వీరిలో ఆరుగురు జగన్‌కు సన్నిహితులు. ఈ లిస్టులో జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి, పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, సీనియర్ నేత పిల్లి సుభాశ్ చంద్రబోస్, మేడా రఘురామిరెడ్డి, గొల్ల బాబూరావు ఉన్నారు. వీరిలో గొల్ల బాబూరావు, మేడా రఘురామిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి బీజేపీలోకి వెళ్లే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. నిరంజన్ రెడ్డిపై బీజేపీ గట్టిగా ఫోకస్ చేసిందని ప్రచారం జరుగుతోంది.