Big Shock For YCP: ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు ఆరు నెలలు దాటింది. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ (Big Shock For YCP) క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే వైఎస్ జగన్ సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ సమయంలో వైసీపీకి సీనియర్, కీలక నేతల పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తూ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కడప కార్పొరేషన్‌లో ఏడుగురు కార్పొరేటర్లు పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సీఎం చంద్రబాబు సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశానికి అసంతృప్తి కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో టీడీపీకి ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు.
Also Read: Boiled Egg vs Omelette : ఏది ఆరోగ్యకరమైనది, ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్..?
బీజేపీలోకి గ్రంధి?
వైసీపీకి రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజకీయ పయనం ఎటూ అన్న చర్చ మొదలైంది. గ్రంధి బీజేపీలో జాయిన్ కానున్నట్లు సమాచారం. బీజేపీలో కనుక గ్రంధి శ్రీనివాస్ చేరితే కూటమిలో వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా భీమవరం టికెట్ సాధించుకునే ఉంటుందని అంటున్నారు. ఇక నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాసరాజుతో గ్రంధికి మంచి రిలేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ త్వరలోనే తన రాజకీయం ఏ పార్టీతో ఉండనుందో చెప్పనున్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక పదవులు అనుభవించిన వారు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో జగన్ సైతం పార్టీని పటిష్టంగా ఉంచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.