Site icon HashtagU Telugu

Jana Sena : పవన్ కళ్యాణ్‌తో బాలినేని, సామినేని ఉదయభాను భేటీ

Balineni-and-samineni-udayabhanu-meet-pawan-kalyan

Balineni-and-samineni-udayabhanu-meet-pawan-kalyan

Balineni and samineni udayabhanu meet pawan kalyan: జగన్​కు తమ పార్టీ నేతలు షాక్​ల మీద షాక్​లు ఇస్తున్నారు. తాజాగా బాలినేని, సామినేని ఉదయభాను వైఎస్‌ఆర్‌సిపికి వీడ్కోలు పలికారు. వీరిద్దరూ ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. జనసేన పార్టీలో చేరేందుకు వీరిద్దరూ తమ ఆసక్తిని పవన్ కళ్యాణ్ కు తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

Read Also: Idi Manchi Prabhutvam Programme : ‘ఇది మంచి ప్రభుత్వం’ అంటూ ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు

కాగా, నేడు మధ్యాహ్నం బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వేర్వేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ వైఎస్‌ఆర్‌సిపిని వీడాల్సిన పరిస్ధితులపై ఆయనకు వివరించారు. అలాగే జనసేనలోకి వచ్చాక తమకు లభించే గౌరవంపైనా చర్చించారు. ఈ మేరకు పవన్ వారికి కీలక హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్‌ఆర్‌సిపి తరహాలో కాకుండా సీనియర్ నేతలకు కీలక పదవులు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. బాలినేని, సామినేని ఉదయభాను ఇద్దరికీ ఎమ్మెల్సీ అవకాశాలు కల్పిస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత బయటికి వచ్చిన సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడారు. జగన్ విధానాలు నచ్చక పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపికి తక్షణం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో ప్రయాణం చేసే వాళ్ళని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ నెల 22న తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు సిద్ధమని సామినేని ఉదయభాను తెలిపారు.

Read Also: Congress : బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు