Vice Chancellors : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్‌ను నియమించారు.
Read Also: Rahul Gandhi : సీఈసీ నియామకాన్ని తప్పుపట్టిన రాహుల్‌గాంధీ
ప్రస్తుతం ప్రసాద్.. వరంగల్ నిట్‌లో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. యోగి వేమన వర్సిటీకి వీసీగా ప్రొఫెసర్‌గా పి.ప్రకాశ్‌బాబును నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హెచ్‌సీయూ, స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్‌లో బయో టెక్నాలజీలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరంతా మూడేళ్లపాటు ఆయా వర్సిటీలకు వీసీగా కొనసాగనున్నారు.