AP Politics : మ‌స‌కబారిన `మాజీ సీఎం` రాజ‌కీయ కిర‌ణాలు

మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజ‌కీయాల్లో (AP Politics) ఆయ‌న చేసిన

  • Written By:
  • Publish Date - March 9, 2023 / 01:20 PM IST

మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజ‌కీయాల్లో (AP Politics) చెల్ల‌ని రూపాయిగా మారారు. ఆయ‌న చేసిన త‌ప్పులు ఏపీకి శాపంగా(Kirankumar Reddy) ప‌రిణ‌మించాయి. అలాగ‌ని, తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌లేరు. మ‌స‌క‌బారిన రాజ‌కీయ జీవితాన్ని ఏపీలోనే వెదుక్కోవాలి. కానీ, ఆయ‌న మీద ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీని సైతం ఆలోచ‌న‌లో ప‌డేసింది. అందుకే, ఆయ‌న్ను కాద‌ని, గిడుగు రుద్ర‌రాజుకు ఏపీ పీసీసీ ప‌దవిని అప్ప‌గించారు. ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రానికి మాత్ర‌మే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా ద్రోహం చేసిన లీడ‌ర్ గా కిర‌ణ్ కుమార్ రెడ్డి మిగిలార‌ని ఆ పార్టీలోని వాళ్లే ప‌లుమార్లు విమ‌ర్శ‌లు గుప్పించిన సంద‌ర్భాలు అనేకం.

మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజ‌కీయాల్లో (AP Politics)

పావురాల గుట్ట‌లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందిన వెంట‌నే సీఎం ప‌ద‌వి కోసం ప‌లువురు తెర‌చాటుగా పోటీప‌డ్డారు. ప్ర‌త్య‌క్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పోటీ ప‌డిన‌ప్ప‌టికీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్య‌వ‌హ‌రించింది. అంద‌రివాడుగా పేరున్న రోశ‌య్య‌కు సీఎం బాధ్య‌త‌ల‌ను అప్పగించింది. ఆనాటి నుంచి రోశ‌య్య ప‌ద‌వికి ఎస‌రు పెడుతూ `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం పావులు క‌దిపింది. ఆ క్ర‌మంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి(Kirankumar Reddy) వ్యూహాత్మ‌కంగా ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకున్నారు. వివాద‌ర‌హితునిగా, అనుభ‌వ‌జ్ఞుడుగా ఉన్న రోశ‌య్య‌ను ఆక‌స్మాత్తుగా ప‌ద‌వీచ్యుడ్ని చేసి ఆ స్థానంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి కూర్చున్నారు. ఆప్ప‌టి నుంచి ప్ర‌త్యేక తెలంగాణకు అడుగులు ప‌గ‌డ్బందీగా వేయ‌డానికి ఆయ‌న స‌హ‌కారం అందించిన తీరు ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు.

రోశ‌య్య ప‌ద‌వికి ఎస‌రు పెడుతూ `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం పావులు

అప్ప‌ట్లో(AP Politics) కాంగ్రెస్ పార్టీ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైపు వెళ్లారు. ఉప ఎన్నిక‌లకు వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 23 మందిని గెలిపించుకున్నారు. ఆ ఎన్నికల్లో కిర‌ణ్ కుమార్ రెడ్డితో(Kirankumar Reddy) క‌లిసి తెర వెనుక టీడీపీ కూడా ప‌నిచేసింది. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని మూడేళ్ల పాటు చంద్ర‌బాబు నిల‌బెట్టారు. ఆ స‌మ‌యంలో ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసింది. అయిన‌ప్ప‌టికీ దాన్ని ఏ మాత్రం కంట్రోల్ చేయ‌లేక‌పోయిన కిర‌ణ్ కుమార్ రెడ్డి స్వార్థ రాజ‌కీయం కోసం కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద‌ల అడుగుల‌కు మ‌డుగులొత్తారు. ప్ర‌త్యేక రాష్ట్ర విభ‌జ‌న బిల్లును కాంగ్రెస్ ఏపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బ‌య‌ట‌ వ్య‌తిరేకించారు. వాళ్లంద‌రూ బిల్లుకు సంబంధించిన ఓటింగ్ జ‌రిగే స‌మ‌యానికి అసెంబ్లీలో లేకుండా చేయ‌గ‌లిగారు. స‌భా నాయ‌కునిగా బిల్లును విజ‌య‌వంతంగా ఆమోదించి, లోక్ స‌భ‌కు పంపారు. ఆ రోజు నుంచి ఏపీ ద్రోహిగా ఆయ‌న్ను అక్క‌డి ప్ర‌జ‌లు చూస్తున్నారు.

Also Read : AP Politics: ఏపీ బీజేపీ ఖాళీ! సైకిల్ ఎక్కనున్న కామినేని, మరో మాజీ మంత్రి?

అసెంబ్లీలో రాష్ట్ర విభ‌జ‌న బిల్లును ఆమోదింప చేసిన కిర‌ణ్ కుమార్ రెడ్డి(Kiran kumar Reddy) 2014 ఎన్నిక‌ల నాటికి స‌మైక్య నినాదాన్ని వినిపించారు. ఏపీ ఓట‌ర్ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తూ స‌మైక్యాంధ్ర పార్టీ పెట్టారు. చెప్పు గుర్తుతో పోటీ చేసిన కిర‌ణ్ కుమార్ రెడ్డి టీమ్ కు ఓట‌ర్లు క‌ర్రుకాల్చి వాత‌పెట్టారు. ఎక్క‌డా సింగిల్ డిజిట్ ఓట్లు రాలేదు. ఆ రోజు నుంచి ఏపీ ప్ర‌జ‌ల‌కు మొఖం చూప‌లేక‌పోతున్న కిర‌ణ్ 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. రెండేళ్ల క్రితం మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్ష ప‌ద‌విని ఆశించారు. ఆ క్ర‌మంలో అప్ప‌టి వ‌ర‌కు ఏపీలో పార్టీని న‌డుపుతోన్న ర‌ఘువీరారెడ్డి మీద లేనిపోని ఆరోప‌ణ‌ల‌ను అధిష్టానంకు చేర‌వేశారు. ఆయ‌న స్థానంలో డాక్ట‌ర్ శైల‌జానాథ్ కు పీసీసీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఫ‌లితంగా కాంగ్రెస్ పార్టీ (AP Politics)మ‌రింత బ‌ల‌హీన‌ప‌డింది.

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో స్థానం కోసం

కాంగ్రెస్ అధిష్టానంకు మ‌రో దిక్కులేకుండా చేసి ఆ ప‌ద‌విని దక్కించుకోవాల‌ని కిర‌ణ్ కుమార్ రెడ్డి (Kirankumar Reddy) ఆశించార‌ట‌. కానీ, అధిష్టానం మాత్రం ఏపీ ప్ర‌జ‌ల్లో ఆయ‌న మీద ఉన్న వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నిస్తూ గిడుగు రుద్ర‌రాజుకు పీసీసీ ప‌ద‌విని అప్ప‌గించింది. అయిన‌ప్ప‌ట‌కీ ఆయ‌న తెర వెనుక కీల‌క ప‌ద‌వుల కోసం పాకులాడుతున్నార‌ని టాక్‌. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీనియ‌ర్ల‌తో మీటింగ్ ను ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్ లోనూ పీసీసీ ప‌ద‌వి ప్ర‌స్తావ‌న వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలో కేవీపీతో కూడిన ఒక క‌మిటీని వేసి, పీసీసీ ఎంపిక‌ను అప్ప‌గించింది. సీన్ క‌ట్ చేస్తే, కిర‌ణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ కాంగ్రెస్ హ్యాండిచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో స్థానం కోసం ఢిల్లీ లాబీయింగ్ ను ఉప‌యోగించుకుంటున్నార‌ట‌. కానీ, ర‌ఘువీరారెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం ఉంద‌ని తెలుస్తోంది. సో..ఏపీ విభ‌జ‌న (AP Politics)దాష్టీకం ఇప్ప‌ట్లో కిర‌ణ్ కుమార్ రెడ్డిని వ‌దిలేలా లేదన్న‌మాట‌.

Also Read : AP Politics: జగన్ మరో ఛాన్స్ కోసం కేసీఆర్ వ్యూహం! పవన్ పై బీఆర్ఎస్ నీడ!