Raj Kasireddy : వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి విచారణ ముగిసింది. ఇవాళ ఆయనను ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) అధికారులు గంటల కొద్దీ ప్రశ్నించారు. ఈ కేసుతో ముడిపడిన చాలా అంశాలపై ప్రశ్నలు అడిగారు. కీలక వివరాలను రాబట్టారు. ఆ సమాచారంతో రిమాండ్ రిపోర్టును సిట్ అధికారులు రెడీ చేశారు. విచారణ ముగిసిన అనంతరం కసిరెడ్డిని పోలీసులు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం రాజ్ కసిరెడ్డిని విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జికి రిమాండ్ రిపోర్టును అందించారు. రాజ్ కసిరెడ్డిని మరిన్ని రోజుల పాటు తమ రిమాండ్‌కు అప్పగించాలని కోరారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. మెరిట్స్‌ను పరిశీలించి రిమాండ్ విధింపుపై న్యాయమూర్తి తీర్పు ఇస్తారు.
Also Read :Civils Toppers: సివిల్స్ టాప్-5 ర్యాంకర్ల నేపథ్యం ఇదీ
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏమైందంటే..
సోమవారం సాయంత్రమే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ రెడ్డి అనే పేరుతో గోవా నుంచి వచ్చిన రాజ్ కసిరెడ్డి.. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. అయితే కసిరెడ్డి కదలికలను ఏపీ పోలీసులు హైటెక్ నిఘాతో ట్రాక్ చేశారు. విమానాశ్రయంలోని ఎరైవల్ బ్లాక్ వద్ద కాపు కాశారు. పోలీసులు ఉన్నారని తెలియగానే రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) విమానశ్రయం నుంచి బయటకు రాకుండా లోపలే దాక్కున్నట్లు గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయ పోలీసు సిబ్బంది సహకారంతో ఎయిర్ పోర్టులోకి వెళ్లిన పోలీసులు రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న 24 గంటల్లోగా కోర్టులో హాజరుపర్చాల్సి ఉన్నందున, మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో జడ్జి ఎదుట హాజరుపరిచారు.
Also Read :Rajya Sabha: ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. రేసులో అన్నామలై, స్మృతి ఇరానీ
ఆధారాలను చూపిస్తూ ఆరా..
సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు సహా ఏడుగురు అధికారుల బృందం కసిరెడ్డిని ప్రశ్నలు అడిగింది. వైఎస్సార్ సీపీ పాలనా కాలంలో జరిగిన లిక్కర్ స్కాంపై కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించగా.. ‘‘నాకు వసూళ్ల నెట్‌వర్క్‌తో లింకు లేదు’’ అని తేల్చి చెప్పాడట. గతంలో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి(Kasireddy) ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా కసిరెడ్డికి అధికారులు ప్రశ్నలు వేశారట. పలు ఆధారాలను ముందుపెట్టి, వాటిని చూపిస్తూ సిట్ అధికారులు అతడిని ప్రశ్నలు అడిగారట.