Site icon HashtagU Telugu

Sakhi Suraksha : మహిళల కోసం ‘సఖి సురక్ష’ ప్రారంభించబోతున్న కూటమి సర్కార్

Cm Chandrababu

Cm Chandrababu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ మహిళల సంక్షేమం కోసం మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. పట్టణ పేద మహిళల అభివృద్ధికి పనిచేస్తున్న మెప్మా (MEPMA – Mission for Elimination of Poverty in Municipal Areas) ఆధ్వర్యంలో ‘సఖి సురక్ష’ (Sakhi Suraksha) అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించబడుతోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ యజ్ఞంలో భాగంగా అమలు కానుంది. రేపు విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమం ప్రధాన లక్ష్యం పట్టణాల్లో మహిళల ఆరోగ్యాన్ని కాపాడడం, వారిని ఆరోగ్య పరీక్షల ద్వారా అవగాహన కల్పించడం, అలాగే వారి కుటుంబాల్లో నిరుద్యోగుల కోసం ఉపాధి అవకాశాలు సృష్టించడం.

‎Friday Remedies: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే శుక్రవారం రోజు ఏం చేయాలో మీకు తెలుసా?

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 74 మున్సిపాలిటీలలో 35 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. రక్తపోటు, షుగర్, థైరాయిడ్, రక్తహీనత, గర్భాశయ సమస్యలు వంటి సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవగాహన సెషన్లు కూడా నిర్వహిస్తారు. పట్టణ మహిళల ఆరోగ్య పరిస్థితిని సక్రమంగా పర్యవేక్షించేందుకు హెల్త్ రికార్డులను డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. దీంతో ప్రభుత్వం వారికి నిరంతర వైద్య సహాయం అందించగలదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆరోగ్యపరంగా చైతన్యం పొందడం మాత్రమే కాకుండా, తమ కుటుంబాలకు ఆరోగ్య రక్షణను కూడా కల్పించగలరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

‎Mobile Usage: బాత్రూమ్​లోకి ఫోన్ తీసుకెళ్తున్నారా.. అయితే జాగ్రత్త  ఈ ప్రమాదం తప్పదు!

ఇక, ఆరోగ్య పరీక్షలతో పాటు మహిళా సంఘాల కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు కూడా నిర్వహించనున్నారు. ఈ రోజు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20 కంపెనీలు పాల్గొనే భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందులో వివిధ రంగాల ఉద్యోగాలు, స్కిల్ ట్రైనింగ్ అవకాశాలు ఇవ్వనున్నట్లు మెప్మా అధికారులు తెలిపారు. ఈ విధంగా ‘సఖి సురక్ష’ కార్యక్రమం ఆరోగ్య సంరక్షణతో పాటు ఉపాధి సృష్టిని కలగలిపిన సమగ్ర పథకంగా నిలవబోతోంది. పట్టణ మహిళా సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేసి, మహిళల సామాజిక–ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Exit mobile version