Site icon HashtagU Telugu

AP Emergency : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి `జ‌న` భ‌యం! చంద్ర‌బాబు స‌భ‌ల‌తో వ‌ణుకు!

Jagan Sabha

Jagan Sabha

`ఆడ‌లేక మ‌ద్దెల దరువు` అన్న‌ట్టుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కం ఉంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌భ‌ల‌కు జ‌నం ఎందుకు వ‌స్తున్నారో ఆలోచించ‌కుండా వాటిని నిషేధించే ఉత్త‌ర్వుల‌ను (AP Emergency )జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా ఇందిరాగాంధీ పెట్టిన ఎమ‌ర్జెన్సీ రోజుల కంటే భ‌యంక‌రంగా జ‌గ‌న్ స‌ర్కార్ వాల‌కం ఉంద‌ని విప‌క్ష నేత‌లు మండిప‌డుతున్నారు. ఏపీలో స‌భ‌లు, స‌మావేశాలు, రోడ్ షో(Road shows)లను నిషేధిస్తూ (AP Emergency )ఉత్వ‌ర్వులు ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం స‌భ‌లు పెట్టుకుంటున్నారు. కేవ‌లం చంద్ర‌బాబు స‌భ‌ల‌ను అడ్డుకోవ‌డానికి రోడ్లపైమీద ర్యాలీలు, రోడ్ షో(Road shows)లు, స‌భ‌లను ఆపితే జ‌నం ఒప్పుకుంటారా? న్యాయ‌స్థానాలు అంగీక‌రిస్తాయా? అనే ప్ర‌శ్న ప్ర‌భుత్వం వేసుకోవాలి. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌భ‌లు ఎలా పెడ‌తారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌.

సభలు, ర్యాలీలు, రోడ్ షోలను నిషేధించ‌డం (AP Emergency) 

గొడుగు వేసుకున్నంత మాత్రాన సూర్యుడు కాంతిని, వ‌ర్ష‌పాతాన్ని ఎవ‌రూ ఆప‌లేరు. నాలుగు గోడ‌ల మ‌ధ్య ప్యాలెస్ లో నుంచి తొంగిచూస్తే జ‌నం వ్య‌తిరేక‌త క‌నిపించ‌దు. తెర‌లు తీసి చూస్తే నిజాలేమిటో తెలుస్తుంది. అలా కాకుండా చంద్ర‌బాబు స‌భ‌ల‌ను అడ్డుకోవ‌డానికి రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షోలను నిషేధించ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. జాతీయ రహదారులు, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులు, రహదారుల మార్జిన్లలో సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం విడ్డూరం. అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమ‌తిస్తూ మినహాయింపును ఇచ్చింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

Also Read : Chief Minister Jagan Mohan Reddy: ఎనిమిది మంది మృతికి చంద్రబాబే కారణం: సీఎం జగన్

రోడ్లపై ర్యాలీలు, సభల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఉత్తర్వుల్లో హోంశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్నట్టు తెలిపింది. రహదారులను ప్రజల రాకపోకలకు, సరుకు రవాణాకు మాత్రమే ఉపయోగించాలని సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని జిల్లాల ఉన్నతాధికారులకు సూచించింది.ఇటీవల జరిగిన చంద్ర‌బాబు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. SP, పోలీస్‌ కమిషనర్ అనుమతితో సభలు సమావేశాలు పెట్టుకోవచ్చని సూచిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్‌‌కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేయ‌డం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి భ‌యం ప‌ట్టుకుంద‌ని విప‌క్షాలు చేస్తోన్న ఆరోప‌ణ‌.

విప‌క్ష నేత‌లు జ‌నంలోకి వెళ్ల‌కుండా (Road shows)

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల నిర్వ‌హిస్తోన్న `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ విజ‌య‌వంతం అయింది. ఎక్క‌డికి వెళ్లిన‌ప్ప‌టికీ ఆయ‌న స‌భ‌ల‌కు ల‌క్ష‌లాది మంది జ‌నం వ‌స్తున్నారు. వాటిని చూసి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భ‌యప‌డుతున్నార‌ని టీడీపీ చెబుతోంది. కానీ, దాన్నో రాజ‌కీయ విమ‌ర్శ కింద చాలా మంది తీసున్నారు. రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌ను నిషేధిస్తూ ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్వ‌ర్వులు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత నిజంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భ‌య‌ప‌డుతున్నార‌ని విశ్వ‌సించడానికి ఆధారం క‌నిపిస్తోంది. ఏపీలోని జ‌గ‌న్ పాల‌న మీద చాలా కాలంగా చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌లు ఆరోప‌ణ‌లు గుప్పించారు. సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద విరుచుకుప‌డుతున్నారు. గతంలో ఏ సీఎంకూ ఎదురుకాని ప‌రిస్థితులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. అందుకే, ఆయ‌న విప‌రీత ధోర‌ణితో ఆలోచిస్తూ విప‌క్ష నేత‌లు జ‌నంలోకి వెళ్ల‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

చంద్ర‌బాబు స‌భ‌లంటే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి భ‌యం

జ‌నం మ‌ధ్య‌కు వెళ్ల‌కుండా ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబునాయుడును ఆప‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌వర్ ను ఉప‌యోగించారు. కానీ, జ‌నం నుంచి వ‌స్తోన్న వ్య‌తిరేక‌త‌ను ఆయ‌న ఎలా ఆప‌గ‌ల‌రు?. అంతేకాదు, ప్ర‌భుత్వ ప‌రంగా ఆయ‌న స‌భ‌ల‌ను ఎలా పెడ‌తారు? ముఖ్య‌మంత్రి అయినంత మాత్రానా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఒక రూలు విప‌క్ష నేత‌ల‌కు మ‌రో రూలు ఉండ‌ద‌ని గ్ర‌హించాలి. అంతేకాదు, ప్ర‌జాహిత కార్య‌క్ర‌మాలు ఎన్నో జ‌రుగుతుంటాయి. వాటిని ఎలా అడ్డుకుంటారు. సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత బోటు ప్ర‌మాదం జ‌రిగింది. ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణించారు. విశాఖ గ్యాస్ లీకు సంద‌ర్భంగా ప‌దుల సంఖ్య‌లో జ‌నం ప్రాణాలు కోల్పోయారు. వాటికి ఎవ‌రు బాధ్య‌త వ‌హించాలి. అలాగ‌ని బోటుల‌ను, కంపెనీల‌ను నిషేధించారా? అంటే స‌మాధానం ఏం చెప్ప‌గ‌ల‌రు. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర సంద‌ర్భంగా ప‌లు సంద‌ర్భాల్లో తొక్కిస‌లాట జ‌రిగింది. గోదావ‌రి బ్రిడ్జి క‌దిలిపోయేలా ఆయ‌న బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న ఆనాడు చేశారు. అప్ప‌ట్లో సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ఇప్పుడు తీసుకొచ్చిన జీవోల‌ను జారీ చేసి ఉంటే జ‌గ‌న్ ఆనాడు పాద‌యాత్ర చేసే వాళ్లా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది.

ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉంద‌ని ఇంత‌కాలం విప‌క్షాలు చెబుతోన్న దానికి బ‌లం చేకూరేలా రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌లపై నిషేధం ఉత్త‌ర్వులు ఉన్నాయి. ఇటీవల కేంద్ర‌, రాష్ట్ర నిఘా సంస్థ‌లు కూడా చంద్ర‌బాబు స‌భ‌ల‌పై ప్ర‌త్యేకంగా క‌న్నేశాయి. అనూహ్యంగా వ‌స్తోన్న జ‌నం సందోహాన్ని చూసిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి భ‌యం ప‌ట్టుకుంది. ఆ క్ర‌మంలో నిషేధం ఉత్త‌ర్వులు వ‌చ్చాయని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అంటే, చంద్ర‌బాబు స‌భ‌లంటే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి భ‌యం ప‌ట్టుకుందన్న‌మాట‌.

Also Read : AP CM Jagan : గుంటూరు తొక్కిసలాటపై ఏపీ సీఎం జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి