Pawan Kalyan : భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షాకింగ్ ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్‌లో పాకిస్తాన్ వక్రబుద్ధిని కడిగిపారేశారు. పాకిస్తాన్ సైన్యాన్ని ఎలుకలతో పోల్చారు. భారతదేశాన్ని మహా సముద్రంతో పోల్చారు. భారత దేశం అమ్ములపొదిలో ఉన్న మేడిన్ రష్యా గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400ను శేషనాగుతో పోల్చారు. శేషనాగు లాంటి అత్యంత శక్తివంతమైన ఎస్-400 వ్యవస్థ చేసే ఒక్క హుంకారంతో ఎలుకల్లాంటి పాకిస్తాన్ సైనికులు, అస్త్రాలు తోక ముడుస్తాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
An excerpt from Thiruvalluvaar’s ‘Thirukkural.’
763: ஒலித்தக்கால் என்னாம் உவரி
எலிப்பகை ? நாகம் உயிர்ப்பக்
கெடும்.Hindi : अगर (दुश्मन) चूहों की पूरी फौज भी समुद्र
की तरह गरजने का मिथ्याभास करने लगे,
तो भी वे… pic.twitter.com/5o4bdkrJMe— Pawan Kalyan (@PawanKalyan) May 12, 2025
Also Read :Anasuya : కొత్తింట్లోకి అనసూయ.. గ్రాండ్ గా గృహప్రవేశం.. ఇంటికి ఏమని పేరు పెట్టిందో తెలుసా?
ఆ పద్యం సారాంశం ఏమిటి ?
తమిళ కవి తిరువల్లువార్ రచించిన తిరుక్కురల్ గ్రంథంలోని ఒక పద్యాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఆ తమిళ పద్యం సారాంశాన్ని గురించి పవన్ కల్యాణ్ ఇలా చెప్పారు.. ‘‘ఎలుకలన్నీ కలిసి సముద్రంలా ఘోషించినా ఏం హాని జరుగుతుంది.. శేషనాగు చేసే ఒక్క హుంకారంతోనే అవన్మీ నశిస్తాయి’’ అని ఆయన వివరించారు. ఇక ఈ పద్యానికి ఎస్ 400 మిస్సైల్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ ఫోటోను పెట్టారు. తమిళం, హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఈ పద్యాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. తద్వారా దేశ ప్రజలందరికీ గొప్ప సందేశాన్ని ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించారు.
Also Read :IPL 2025 New Schedule: ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ విడుదల.. 6 స్టేడియాల్లో మిగిలిన మ్యాచ్‌లు!
దక్షిణాది పాలిటిక్స్‌పై పవన్ ఫోకస్ ?
ఇతర భాషల్లోనూ ట్వీట్లు చేస్తుండటంతో.. పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉందా అనే సందేహం రేకెత్తుతోంది. ప్రత్యేకించి గతంలో పలు దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ ఆధ్యాత్మిక పర్యటన చేశారు. ఇప్పుడు ట్వీట్‌లో తమిళ పద్యాన్ని హైలైట్ చేశారు. అంటే తమిళనాడు పాలిటిక్స్‌పై కూడా పవన్ కూడా ఇంట్రెస్ట్ ఉందా అనే కోణంలో చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో పవన్ కల్యాణ్‌ను ప్రధానంగా వాడుకోవాలనే ప్రధాని మోడీ ప్లాన్‌కు అనుగుణంగానే ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ట్వీట్‌లో ప్రధాని మోడీని పవన్ కొనియాడారు. తన ట్వీట్‌లో భారత సైన్యం, బీజేపీ, ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర హోంమంత్రి కార్యాలయంలను పవన్ కల్యాణ్ ట్యాగ్ చేశారు. తన పార్టీ జనసేనను మాత్రం పవన్ ట్యాగ్ చేయకపోవడం గమనార్హం.