House Warming : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు(ఆదివారం) తన స్వగ్రామం కుప్పంలో కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఇవాళ తెల్లవారుజాము 4:30 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా చంద్రబాబు కుటుంబీకులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అసలు విషయం ఏమిటంటే.. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం వద్ద రెండు ఎకరాల స్థలంలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా బెంగళూరుకు వెళ్లారు. అక్కడి నుంచి శనివారం రాత్రికల్లా కుప్పంకు చేరుకున్నారు.
Also Read :Sirajs Terror Links: రాజాసింగ్ వీడియోకు సిరాజ్ కౌంటర్.. సిరాజ్‌కు ఓ అధికారి ప్రోత్సాహం.. ఎవరతడు ?
శనివారం మధ్యాహ్నమే కుప్పంకు చేరుకున్న భువనేశ్వరి, లోకేశ్
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(House Warming) శనివారం మధ్యాహ్నమే కుప్పంకు చేరుకొని, పీఈఎస్ వైద్య కళాశాల అతిథి గృహంలో బస చేశారు. కొత్త ఇంటికి వెళ్లి, గృహప్రవేశ ఏర్పాట్లను ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు. నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం రాత్రి కుప్పంకు చేరుకున్నారు.చంద్రబాబు ఫ్యామిలీ నుంచి ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామానికి వెళ్లి ముద్రించిన పత్రికలను పంచి గృహప్రవేశానికి ఆహ్వానించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులకు సైతం ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. పసుపు కుంకుమలు ఇచ్చి మరీ మహిళలను సంప్రదాయబద్ధంగా గృహప్రవేశానికి ఆహ్వానించారు.
Also Read :Mann Ki Baat : ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య మాత్రమే కాదు.. ధైర్యం, దేశభక్తి కూడా : ప్రధాని మోడీ
భోజన ఏర్పాట్లు అదుర్స్
చంద్రబాబు గృహప్రవేశం వేళ దాదాపు 25 వేలమందికి భోజనాల ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కొత్త ఇంటి పరిసరాల్లో ప్రత్యేక షెడ్లను నిర్మించారు. శనివారం రాత్రి కూడా ఇంటి వద్ద బంధుమిత్రులకు, వీఐపీలకు భోజనాలు పెట్టారు. ఈ రోజు(ఆదివారం) మధ్యాహ్నం కూడా వేల సంఖ్యలో జనం భోజనాలు చేశారు. వీవీఐపీ, వీఐపీ, సాధారణ గ్యాలరీలను ఇందుకోసం సిద్ధం చేశారు. నారా భువనేశ్వరి దగ్గరుండి మరీ వంటకాలను సిద్ధం చేయించారు.25 వేలమంది సాధారణ ప్రజలకు, 2 వేలమంది వీఐపీలకు భోజనాలను అందించారు. చక్కెర పొంగలి, జిలేబీ, తాపేశ్వరం కాజా, సమోసా, వెజ్ బిర్యానీ, టమోటా రైస్, రైతా, మ్యాంగో రైస్, గుత్తి వంకాయ మసాలా, మష్రూమ్ గుజ్జు కూర, బెండకాయ, బంగాళాదుంప కూరలతో పాటు వడలతో పులుసును కూడా వడ్డించారు. రైస్, సాంబారు, రసం, ఆవకాయ, గోంగూర పండుమిరపకాయ పచ్చడి, అప్పడం, పెరుగుతో పాటు క్యారెట్ హల్వా, ఐస్ క్రీమ్ అందరికీ అందించారు.