Site icon HashtagU Telugu

Seaplane : ఫ్యూచర్‌లో ఏ యిజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుంది : సీఎం చంద్రబాబు

Ap Cm Chandrababu Naidu Seaplane Tourism Services

Seaplane : సీప్లేన్‌ పర్యాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘‘అప్పట్లో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం గురించి చెబితే.. ఎగతాళి చేశారు.  ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఐటీ రంగంలో మనవాళ్లే ఉన్నారు. రాబోయే రోజుల్లో సీప్లేన్ టూరిజం బాగా డెవలప్ అవుతుంది. ఆ అవకాశాన్ని ఏపీ అందిపుచ్చుకోబోతోంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘సీ ప్లేన్ టూరిజం వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆ జాబ్స్‌లో.. శారీరక శ్రమ అవసరం ఉండదు. అన్నీ వైట్ కాలర్ జాబ్సే’’ అని ఆయన తెలిపారు.

Also Read :GPS Attack : దక్షిణ కొరియాపై ‘జీపీఎస్’ ఎటాక్.. ఉత్తర కొరియా ఘాతుకం

‘‘టూరిజం డెవలప్ కావాలంటే మంచి రోడ్లు కావాలి. మంచి ప్రదేశాలు కావాలి. మంచి రవాణా వసతులు కావాలి. మంచి హోటళ్లు కావాలి. ఇవన్నీ డెవలప్ చేయడానికి మేం శాయశక్తుల ప్రయత్నిస్తాం. తప్పకుండా టూరిజం ద్వారా రాష్ట్రంలో ఉపాధిని, ఆదాయాన్ని క్రియేట్  చేస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో మసకబారిన ఏపీ ఇమేజ్‌ను(Seaplane) సరిచేసే పనిలోనే మేం ఉన్నాం. ఏపీని టూరిజం హబ్‌గా మారుస్తాం. పెద్ద ఎత్తున టూరిస్టులు వచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం’’ అని ఏపీ సీఎం తెలిపారు. ‘‘అరకు కాఫీ వరల్డ్ ఫేమస్. చాలా దేశాల్లో దాన్ని విక్రయిస్తారు. అరకుకు వెళ్లి అక్కడి కాఫీ తోటల మధ్య కూర్చొని కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది. అరకు లాంటి చాలా ప్రదేశాలు ఏపీలో ఉన్నాయి’’ అని చంద్రబాబు చెప్పారు. ‘‘రాష్ట్ర ప్రజలంతా కలిసి ఏపీని తిరిగి నిలబెట్టారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలే ఆక్సిజన్‌ ఇచ్చారు’’ అని ఆయన తెలిపారు. ‘‘తక్కువ సమయంలోనే అత్యున్నత  స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్‌ నాయుడు. కేంద్ర మంత్రివర్గంలో అత్యంత యువకుడు ఆయన’’ అని ఏపీ సీఎం కితాబిచ్చారు.

Also Read : Seaplane : అందరికీ అందుబాటులో సీ ప్లేన్ ఛార్జీలు.. 3 నెలల్లోగా సర్వీసులు షురూ : రామ్మోహన్‌ నాయుడు