AP Capital : ప్ర‌పంచ టాప్ -6 న‌గ‌రాల్లో అమ‌రావ‌తి,`మేగ‌జైన్` చెప్పిన నిజాలు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి( AP Capital) ప్ర‌పంచ స్థాయి న‌గ‌రాల జాబితాలోకి వెళ్లింది.

  • Written By:
  • Updated On - March 1, 2023 / 02:30 PM IST

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి( AP Capital) ప్ర‌పంచ స్థాయి న‌గ‌రాల జాబితాలోకి వెళ్లింది. టాప్-6 న‌గ‌రాల్లో ఒక‌టిగా ఆవిష్క‌రించ‌నుంది. ఆ విష‌యాన్ని ప్రతిష్టాత్మక ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మేగజైన్  తేల్చేసింది. మేగ‌జైన్ ప్ర‌చురించిన ప్ర‌పంచ భ‌విష్య‌త్ న‌గ‌రాల జాబితాలో అమ‌రావ‌తి(Amaravathi) ఉండ‌డం గ‌మ‌నార్హం.

అమ‌రావ‌తి ప్ర‌పంచ స్థాయి న‌గ‌రాల జాబితాలోకి ( AP Capital)

అమ‌రావ‌తికి పునాది వేసిన రోజే ఆనాటి సీఎం చంద్ర‌బాబునాయుడు ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా అమ‌రావ‌తి(Amaravathi) రూపుదిద్దుకుంటుంద‌ని చెప్పారు. ఆ మేర‌కు విజ‌న్ ను ఆవిష్క‌రించారు. అంతేకాదు, 2029 విజ‌న్ ప్ర‌జ‌ల ముందు ఉంచారు. దేశంలోనే నెంబ‌ర్ రాష్ట్రంగా ఏపీ అవుతుంద‌ని చెప్పారు. అంతేకాదు, 2050 నాటికి ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1 రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంద‌ని చంద్ర‌బాబు అంచ‌నా వేశారు. ప్ర‌పంచానికి ఆద‌ర్శ‌వంత‌మైన న‌గ‌రంగా అమ‌రావ‌తి రూప‌క‌ల్ప‌న ఉంటుంద‌ని వెల్ల‌డించారు. ఇప్పుడే అదే విష‌యాన్ని ప్ర‌ఖ్యాత ఆర్కిటెక్చ‌ర‌ల్ మేగ‌జైన్ చెప్పింది.

Also read : Amaravati: అమరావతికి సుప్రీం ముహూర్తం! అసెంబ్లీలో ‘మూడు’ లేనట్టే!

ఆ మేగ‌జైన్ తాగాగా భవిష్యత్ నగరాల జాబితాను ప్ర‌చురించింది. ఆధునిక, స్థిరమైన నగరంగా మారడానికి అనువైన రాజ‌ధానులను(AP Capital) గుర్తించింది. ప్రపంచ వేదికపై భారతదేశం గర్వించేలా అమ‌రావ‌తి ఉంటుంద‌ని ప్ర‌చురించింది. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న ప్రపంచస్థాయి నగరాల‌ను మేగ‌జైన్ గుర్తించింది. ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ టాప్-6 భవిష్యత్ నగరాల జాబితాలో ఏపీ రాజధాని అమరావతిను పొందుప‌ర‌చ‌డం విశేషం.

మేగ‌జైన్ ప్ర‌చురించిన న్యూస్ ను గ‌మనించిన చంద్రబాబు  హర్షం

మేగ‌జైన్ ప్ర‌చురించిన న్యూస్ ను గ‌మనించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు.ప్రతిష్ఠాత్మక ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ ఎంపిక చేసిన భావి నగరాల జాబితాలో అమరావతి(Amaravathi) కూడా ఉండ‌డం సంతోష‌మ‌న్నారు. స్థిరంగా అభివృద్ధి చెందే ఒక ఆధునిక నగరాన్ని ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో అమరావతి పునాదులు వేసిన‌ట్టు చంద్రబాబు వెల్లడించారు. అమరావతి నగరం ప్రపంచ వేదికపై భారత్ ను గర్వించేలా చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ మేరకు సదరు పత్రికా కథనాన్ని కూడా చంద్రబాబు పంచుకున్నారు.

Also Read : BRS in Amaravati : అమరావతిలో కేసీఆర్ భారీ బహిరంగసభ..!

ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిందని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ వెల్లడించింది. అయితే, ఇది కార్యరూపం దాల్చలేదని, కానీ భవిష్యత్ లో రూపుదిద్దుకునే కొత్త నగరాలు(AP Capital) ఎలా ఉండాలన్నదానిపై గొప్ప దార్శనికతను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. అమరావతి ప్లాన్ ను పరిశీలిస్తే, ఒక ప్రభుత్వ భవన సముదాయం నగరానికి వెన్నెముకలా ఉంటుందని, భారతదేశ రాజధాని హస్తినలోని లుట్యెయన్స్ ఢిల్లీ, న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ తరహాలో అమరావతి నగరం మధ్యన భారీ పచ్చదనం కనువిందు చేసేలా డిజైన్ చేశారని వివరించింది. అంతేకాదు, పర్యావరణ పరంగా ఏమాత్రం రాజీపడని విధంగా నగరంలో 60 శాతం పచ్చదనం, నీరు ఉండేలా ప్రణాళిక రూపొందించారని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ పేర్కొంది.

అమరావతి రూపుదిద్దుకుని ఉంటే ప్రపంచ మహానగరాల్లో ..

అమరావతి(Amaravathi) గనుక రూపుదిద్దుకుని ఉంటే ప్రపంచ మహానగరాల్లో ఒకటిగా సుస్థిర స్థానం పొందేదని స్పష్టం చేసింది. వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానాలు, ఫొటోవోల్టాయిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, వాటర్ ట్యాక్సీలు, సైకిల్ తొక్కేవారికోసం ప్రత్యేక మార్గాలతో అమరావతి ఒక విలక్షణ నగరం అయ్యేదని అభిప్రాయపడింది. ఆర్చిటెక్చరల్ డైజెస్ట్ పేర్కొన్న టాప్-6 నగరాలు జాబితాలో నెంబ‌ర్ 1. స్మార్ట్ ఫారెస్ట్ సిటీ- మెక్సికో , 2. టెలోసా- అమెరికా, 3. ద లైన్ సిటీ- సౌదీ అరేబియా, 4. ఓషియానిక్స్ బుసాన్- దక్షిణ కొరియా, 5. చెంగ్డు స్కై వ్యాలీ- చైనా, 6. అమరావతి- భారత్ ఉండ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Amaravathi : ఢిల్లీకి అమ‌రావ‌తి ఉద్య‌మం! భారతీయ కిసాన్ సంఘ్ మ‌ద్ధ‌తు!