AP Capital : జ‌గ‌న్నాట‌కంలో అమ‌రావ‌తి

అమ‌రావ‌తి(AP Capital) రూపురేఖ‌ల్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారు. సీఆర్డీయేలోని ఆర్ -5కు మ‌రిన్ని భూముల‌ను కేటాయించేలా నిర్ణ‌యం తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - May 10, 2023 / 02:22 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమ‌రావ‌తి(AP Capital) రూపురేఖ‌ల్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారు. సీఆర్డీయే ప‌రిధిలోని ఆర్ -5 జోన్ కు (R-5 Zone)మ‌రిన్ని భూముల‌ను కేటాయించేలా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే స్థానికేతురులుగా ఉండే వాళ్ల‌కు అమ‌రావ‌తి(Amaravathi) ప్రాంతంలో సుమారు 25 మందికి స్థలాల‌ను కేటాయిస్తూ ప‌ట్టాలు ఇచ్చారు. ఆ ప్ర‌క్రియ కొన‌సాగిస్తూ ఆర్ -5 జోన్ కు కేటాయించిన భూముల్ని రాజ‌ధానేత‌ర ప్రాంతాల‌కు పేద‌ల‌కు కేటాయించ‌నుంది. అద‌నంగా ఎస్-3 జోన్ ప‌రిధిలోనూ 268 ఎక‌రాల‌ను పేద‌ల‌కు ప‌ట్టాల కోసం భూముల‌ను కేటాయించాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

ఆర్ -5 జోన్ కు ఎస్-3 జోన్ ప‌రిధిలోనూ 268 ఎక‌రాల‌ను కేటాయించాల‌ని..(AP Capital)

సీఆర్డీయే (CRDA) ఆధీనంలోని అమ‌రావ‌తి భూముల‌ను(AP Capital) పేద‌ల‌కు కేటాయించాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ చాలా కాలంగా ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే, రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులు న్యాయ‌పోరాటానికి దిగారు. హైకోర్టులో ఆర్ -5(R-5  Zone) జోన్ ను స‌వాల్ చేస్తూ పిటిష‌న్ వేశారు. దానిపై విచార‌ణ చేసిన కోర్టు ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉండేలా డైరెక్ష‌న్ ఇచ్చింది. దీంతో సుప్రీం కోర్టు త‌లుపు మ‌రోసారి త‌ట్టారు. ఇంకా ఆ పిటిష‌న్ మీద సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌కుండానే పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయిస్తూ ప‌ట్టాల‌ను ఏపీ ప్ర‌భుత్వం పంపిణీ చేసింది. రాజ‌ధాని కోసం ఇచ్చిన భూముల‌ను ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌కు వాడడాన్ని రైతులు స‌వాల్ చేస్తున్నారు.

గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా ప‌రిధిలోని పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు

సుప్రీం కోర్టుకు రైతులు వెళ్లిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ స‌ర్కార్ ఎస్ -3 జోన్ (S-3  Zone)ను కూడా కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఆ ప‌రిధిలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా ప‌రిధిలోని పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వ‌డానికి 268 ఎక‌రాల‌ను కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. ఆ రెండు జిల్లాల‌కు చెందిన క‌లెక్టర్లు ఇటీవ‌ల సీఆర్డీయే (CRDA)క‌మిష‌నర్ కు లేఖ‌లు రాస్తూ ల‌బ్దిదారుల జాబితాను అంద‌చేశారు. అందుకు బదులిస్తూ క‌లెక్ట‌ర్లు అడిగిన 1134.58 ఎక‌రాల కంటే ఉదారంగ‌దా మ‌రికొంత భూమిని ఎస్ -3 జోన్ లో 268 ఎక‌రాల‌ను కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

సీఆర్డీయే కేటాయించిన భూముల్లో గుంటూరు జిల్లాకు చెందిన 23,235 మందికి ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల‌ను ఇవ్వ‌నున్నారు. అలాగే, ఎన్టీఆర్ జిల్లాలో 26,739 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ రెండు జిల్లాల కలెక్టర్లు, వాలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఫొటోలను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ హ‌డావుడిగా సేక‌రిస్తోంది.

రైతులు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ (AP Capital)

ఆర్-5 జోన్ లో (R-5 Zone) ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల కేటాయింపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రాజ‌ధాని రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. అయితే, దీనిపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కోర్టు తీర్పును అనుసరించి ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే, ఏపీ సర్కారు ఆర్-5 జోన్ లో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. అమరావతి (AP Capital) రైతులు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జ‌రిగింది. కానీ, ఏపీ స‌ర్కార్ మాత్రం దూకుడుగా వెళుతూ అమ‌రావ‌తి(Amaravathi) ప్రాంతంలోని భూముల్లో పేద‌ల‌కు ఇళ్ల స్థలాల‌ను కేటాయించాల‌ని భావిస్తోంది.

సెప్టెంబ‌ర్ నెల‌లో విశాఖ‌ప‌ట్నంకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి   కాపురాన్ని

అసెంబ్లీ వేదిక‌గా మూడు రాజ‌ధానుల బిల్లును ఉప‌సంహ‌రించుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) తిరిగి దాన్ని వినిపిస్తున్నారు. అధికార వికేంద్ర‌క‌ర‌ణ అంటూ సెప్టెంబ‌ర్ నెల‌లో విశాఖ‌ప‌ట్నంకు కాపురాన్ని మార్చుతున్నారు. ఆ మేర‌కు ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. మూడు చోట్ల కాక‌పోతే, 30చోట్ల కాపురం ఉన్నా అభ్యంత‌రంలేద‌ని విప‌క్షాలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం విశాఖ అడ్మినిస్ట్రేష‌న్ క్యాపిట‌ల్‌, అమ‌రావ‌తి శాస‌న రాజ‌ధాని, కర్నూలు న్యాయ రాజ‌ధాని అంటూ చెబుతున్నారు. రాజ్యాంగం, చ‌ట్ట ప్ర‌కారం ఆయ‌న మూడు రాజ‌ధానుల క‌ల నెర‌వేరే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే, క‌ర్నూలుకు హైకోర్టు త‌ర‌లించ‌డం సుప్రీం కోర్టు కొలిజియం నిర్ణ‌యం మేర‌కు ఉంటుంది. ఇక సీఎం ఎక్క‌డ ఉంటే అక్క‌డే నిర్వ‌హ‌ణ రాజ‌ధాని (AP Capital) అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతున్నారు. దానికి గెజిట్ నోటిఫై చేయాలి. పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల ఆమోదం అందుకు అవ‌స‌రం. ఇవ‌న్నీ ఇప్పుడు జ‌రిగే అవ‌కాశం లేదు. అందుకే, కాపురం మార్చుతున్నానంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Also Read : Amaravathi : ఢిల్లీకి అమ‌రావ‌తి ఉద్య‌మం! భారతీయ కిసాన్ సంఘ్ మ‌ద్ధ‌తు!

మూడు రాజ‌ధానుల ముచ్చ‌ట ముగిసిన అధ్యాయంగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అందుకే, ఆయ‌న క‌సిగా అమ‌రావ‌తిని(Amravathi) ధ్వంసం చేస్తున్నార‌ని విప‌క్షాల ఆరోప‌ణ‌. ఆ క్ర‌మంలోనే రాజ‌ధానికి(AP Capital) భూములు ఇచ్చిన రైతుల మ‌నోభావాల‌కు భిన్నంగా ఇత‌ర ప్రాంతాల పేద‌ల‌కు అక్క‌డ ఇళ్ల స్థ‌లాల కేటాయిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ధ్వంస ర‌చ‌న‌కు ఇదో ప‌రాకాష్టగా విమ‌ర్శిస్తున్నారు. ఇంతకు మించి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) స‌ర్కార్ ఏమీ చేయ‌లేద‌ని చెబుతూనే ఏపీ భ‌విష్య‌త్ గురించి ఆలోచించాల‌ని కోరుతున్నారు. రాజ‌ధాని రాష్ట్రానికి సీఎం అంటూ ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎక్క‌డ‌కు వెళ్లిన‌ప్ప‌టికీ బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితి నుంచి ప‌బ్లిక్ మైండ్ ను మార్చేందుకు ఇళ్ల స్థలాల కేటాయింపు, కాపురం మార్చ‌డం త‌దిత‌ర అంశాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వినిపిస్తున్నార‌ని ప్ర‌త్య‌ర్థులు చెబుతున్నారు. ఏదేమైనా, సుప్రీం కోర్టు ఇచ్చే డైరెక్ష‌న్ మేర‌కు ఇళ్ల స్థలాల కేటాయింపు ఆధారప‌డి ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేటాయించిన ప‌ట్టాలు చెల్ల‌తాయా? లేదా? అనేది సందిగ్ధమే.

Also Read : AP Capital : అమ‌రావ‌తి వెలుగుతోంది.! రైల్వే లైన్ షురూ!